STHUTHI

 



శ్రీ వేంకటేశ్వర స్తుతి వరాళి (త్రివడ) పుండరీకాక్షా! అజ్ఞాన జంతువులైన మేకపోతులింద్రాది దేవతలకుఁ బశుపురోడాశంబులైన సంబంధంబున తముఁగాచు గొల్లవానితోడ గూడి స్వర్గభోగంబులనుభవించునట రాజ్యలోభంబున గ్రోధంబు వెంచి సమరరంగంబుననన్యోన్య హింసాపరులైన వీరపురుషులు సూర్యమండలంబుజొచ్చిపోయి దివ్యపదంబులనుభవింతురట కామాతురులైన సతులు పతులఁబాయలేక కళేబరములుఁగౌఁగిలించుకొని అనలంబులో బ్రవేశించి ఉత్తమగతులఁబొందుదురట సమ్యక్ జ్ఞాన సంపన్నులైన నీ దాసులై దేహంబులందునీ లాంఛనంబులైన తప్త శంఖ చక్రల ముద్రలంబరిశుద్దులై కామక్రోధపశువులజ్ఞానాగ్నిలో వేల్చి, తులసియుక్తమైన శ్రీ పాద తీర్థ సోమపానంబునం బాపంబులు విదల్చి, నీ ప్రసాదమనెడి పూరోడాశంబు గొని ఆచార్య ముఖంబునందిరుమంత్రయాజమానపాఠంబులు జపియించి, నీకులీ తిగా స్వేతమృత్తియా ర్ణధారణంబులు సేసి, పద్మాక్షుతులసి మాలికలు పూని, నీ పేరులుం బెట్టుకొని, నీపూజా యాగంబులు నిత్యంబునుం జేయు వైష్ణవోత్తముల భాగ్యంబులేమని వర్ణింపవచ్చునే వేంకటేశ్వరా! మణియును || తాత్పర్యం: కెందామరల వంటి కన్నులు కలిగినవాడాశ్రీ వేంకటేశ్వరా! యజ్ఞాలలో బలియై ఇంద్రాది దేవతలకు హవిస్సుగా మారినందువల్ల అజ్ఞాన జంతువులైన మేకపోతులు, తమను పెంచి పోషించిన గొల్లవానితో కూడి స్వర్గసుఖాలనుభవిస్తాయట. యుద్ధంలో పరస్పరం హింసించుకునే రాజవీరులు, సూర్యమండలం ద్వారా చేరి భోగాలను అనుభవిస్తారట. పతివ్రతలైన సతులు భర్తృ విరహాన్ని భరించలేక, భర్తను కౌగిలించుకుని సహగమనాచారంతో అగ్నిలో బడి ఉత్తమగతిని పొందుతారట.