సప్త వ్యసనాలు ఏవేవి?

సప్త వ్యసనాలు ఏవేవి? పి.ఎల్.నరసింహాచార్య దాసన్


పర స్త్రీ వ్యామోహం - ఇది మొదటిది. భార్య ఉండగా మరొక స్త్రీ సౌందర్యానికి కామ మోహితుడవుతాడు మానవుడు. అలా చేస్తే పతనం తప్పదని మనక మద్రామాయణ భారత భాగవత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వీటిని చదివితే ఈ వ్యసనానికి బానిసైనవారి కథలు మనకు తెలుస్తాయి. రావణుడు, కీచకుడు, శంతనుడు మొదలైనవారి కథలను ఒకసారి చదవాలి. జూదము - ఇది రెండవది. భారతములో ఈ వ్యసనం వ్యవహారాన్ని మనయా డవచ్చు. ధర్మరాజజూదమాడి తనతోపాటే తన సోదరులనూ - కడకు తన ధర్మపత్నిని కూడా జూదములో పణంగా పెట్టి సర్వం పోగొట్టుకున్నాడు. అడవుల పాలయ్యాడూ దం వల్ల పగ, ద్వేషం పెరుగుతాయి. |


వేట - నాలుగవదిది. పూర్వకాలములో రాజులు వర్షాకాలములో వేటకు వెళ్ళేవారు. అదే వ్యసనంగా మారి ప్రజాపాలన వదిలి అడవుల్లో గడిపిన రాజన్యులున్నారు. వత్సరాజు ఒక ఉదాహరణ.


| మద్యపానము - కచ దేవయాని కథ చదివితే దీని పర్యవసానాలు తెలుసుకోవచ్చు. దానవుల గురువైన శుక్రాచార్యుని వద్ద దేవగురుని పుత్రుడైన కచుడు మృతసంజీవినీ విద్యను నేర్చుకున్నాడు. కచుడు ఇలా విద్యను నేర్చుకోవడం సహించలేని రాక్షసులు కచుడిని చంపి ఆ బూడిదను మద్యములో కలిపి శుక్రాచార్యునితో త్రాగించినారు. కచుణ్ణి మించిన శుక్రాచార్యుని పుత్రిక దేవయాని కచుడిని బ్రతికించమని తండ్రిని కోరింది. అలాగేనని కచుడుని బ్రతికించాడు. ఇకమీదట మద్యాన్ని ముట్టుకోనని ప్రతిన చేశాడు శుక్రాచార్యుడు.


వాక్పారుష్యము - ఇది ఐదవ వ్యసనము. అతిగా మాట్లాడడం, ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పరితనాన్ని అలవరచుకోవాలి. సంస్కారం లేకుండా అధిక లాపన చేయడం శిశుపాల వధ సన్నివేశములో మనమా డవచ్చు. కఠినంగానూ ధర్మవిరుద్దంగానూ మాట్లాడడం ప్రాణాంతకమైన వ్యసనము. వ్యసనం ఉగ్రదండము - చేసిన తప్పుకు అధికదండన విధించడం ఈ ఆరో వ్యసనం. ఎప్పుడూ చేసిన నేరానికి శిక్ష తగినట్లే ఉండాలి. చిన్నతప్పుకు పెద్దశిక్ష వేయకూడదని రామాయణము వల్ల తెలుసుకోవచ్చు. సుగ్రీవునికి వాలి అధిక దండన విధించడం వల్ల ఋష్యమూక పర్వతంపైన తల దాల్చుకోవలసి వచ్చింది కదా! అర్థ దుర్వినియోగం - ఇది ఏడవది. తాత తండ్రులు కష్టపడి సంపాదించిన సంపదను మనమిష్టమొచ్చిన రీతిలో ఖర్చుపెట్టి దుబారా చేయడం, దుర్వినియోగం చేయడం, చివరకు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా పరులముందు చేయి చాచడం ఎంత శోచనీయమో కదా? దుర్యోధనుడు ధనాన్ని దుర్వినియోగము చేసి వ్యసనానికి బానిసైపోయాడు. దీనివల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మనమే పని చేసినా అందులోని లోటుపాట్లను బేరీజు వేసుకుని కార్య నిర్వహణ చేయాలి. ఎదుటివారు ఎలాంటి బాధ పడకుండా ఆచితూచి మాట్లాడాలి. ఇటువంటి విషయాలను మనం మన సంతానానికి వారి తీరిక వేళలలో వారికి అర్థమయ్యే విధంగా బోధించాలి.


అధికారము - స్వార్థము - కీర్తికండూతి - అంగబలముతో కల్మషమైపోయిన ఈ లోకంలో మనిషి ఏదో ఒక దుర్వ్యసనానికి బానిస అయిపోతున్నాడు. ప్రధానంగా ఏడు వ్యసనాలున్నాయి. వీటికి దూరంగా ఉన్నవాడే మహనీయుడు. ఏదో సమయంలో ఏదో కారణంగా బలహీనతతో తప్పులు చేస్తూ ఉంటాడు. అవి పునరావృతము కాకుండా చూచుకోవాలి.