శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి- డా|| కె.వి.రాఘవాచార్య

శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి - డా|| కె.వి.రాఘవాచార్య


39.అగస్త్యాభ్యర్థితాశేష జన దృగ్గోచరాయ నమః అగస్త్య మహర్షిచే ప్రార్థింపబడి, జనులందరి కన్నులకు కనిపించుచున్న వేంకటేశునకు నమస్కారము.


శంఖరాజుయొక్కతపస్సునకుఫలమును అనుగ్రహించుటకై శ్రీ మన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు, అగస్త్యుడు మున్నగు ఋషులు భగవంతుని విశ్వరూపమును సేవించి ఆనందించినారు. పిమ్మట శ్రీ మన్నారాయణుడు బ్రహ్మాది దేవతలు కోరిన వరములను అనుగ్రహించిన తర్వాత భగవంతుడు అగస్త్యుని చి "ప్రసన్నో7హం ద్విజే ప్ల! వియతాం యత్తవేప్సితమ్" - బ్రాహ్మణోత్తమా! నీ యందు ప్రసన్నుడనైతిని. నీకు అభీష్టమైన వరమును కోరుకోమనగా అగస్త్యుడు మొదట "త్వయి భక్తి: పరా చాపి నిశ్చలా స్యాత్ మమా 7మలా" - నీయందు నాకు అత్యంత భక్తి నిర్మలమై యుండుగాక! అని ప్రార్థించాడు. భగవంతుడు ఆ వరమును అనుగ్రహించాడు. పిమ్మట అగస్త్య మహర్షి సర్వజన హితమును కోరి పరోపకారమగు ఈ వరమును కోరినాడు. "త్వం చ దృశ్యో వసేహేశ! సర్వేషాం ప్రాణినా మపి" స్వామీ! నీవు సకల ప్రాణులకు కనిపించుచు ఈ వేంకటాద్రి యందు నివసించి యుండవలెనని అగస్త్యుడు కోరినాడు (వామన. 36-59 శ్లో ||). లక్ష్మీనారాయణుడు అగస్త్యుని జీవకారుణ్యమునకు, సర్వజన హితమునకు సంతోషించి - శ్లో || అహం దృశ్యో వసామీపత్రీ భూమి సహితో7నఘ! | విమానం మమ దివ్యం తు గూఢం ముక్తిపరం భవేత్ || - పాపరహితా! నేనత్రీ భూ దేవులతో కూడి ఈ పర్వతమున సకల ప్రాణులకు కనిపించుచు, వారి కోర్కెలను తీర్చుచు నివసింతును. ఈ దివ్యమైన, గూఢమైన విమానము గూడ ముక్తి ప్రదమగును అని పలికినాడు. ఆనాడు అగస్త్యమహర్షికి వాగ్దానము చేసినట్లుగా నేటికీ విష్ణుదేవుడు అర్చామూర్తి రూపములో వేంకటాద్రిపైనివసించి,తనను సేవించినజనులందరికినివారివారి అభీష్టములను అనుగ్రహించుచున్నాడు. అగస్త్యుని యెడీ తుడైన భగవంతుడు ఇంకను "మహర్షీ! ఎవరు ఈ నారాయణగిరిని ఎక్కి వచ్చి స్వామిపుష్కరిణిలో స్నానము చేసి పవిత్రులై ఈ | దివ్యవిమానమున వెలసిన నన్ను భక్తితో సేవించి పూజింతురో, వారికి వారి అభీష్టముల నన్నింటిని అనుగ్రహింతును. అట్లే నూరు యోజనముల దూరమున నున్న భక్తుడు ఈ నారాయణగిరిని ఉద్దేశించి నమస్కరించినచో, వానికి పుణ్యలోకములను అనుగ్రహించెద"నని పలికినాడు. నేటికీ వేంకటేశ్వరస్వామి తన వాగ్దానమును నెరవేర్చుచున్నాడు. తథాస్తు!


| అగస్త్య మహర్షికి లక్ష్మీనారాయణుడు వరముల నొసంగిన సన్నివేశమును వరాహపురాణము ఈ విధముగా వర్ణించినది. శ్రీ మన్నారాయణుడు అగస్త్య మహర్షిని " వరము కోరుకొనుమనగా అగస్త్యుడు మొదట తనకు భగవంతుని యెడ నిరంతరం విశేష భక్తి గలిగి యుండవలెనని కోరి, పిమ్మట "యయాచే తత్ర సాన్నిధ్యం భవాన్ దృశ్యో భవత్వితి" - స్వామీ! మీరీ పర్వతమున సర్వజన సాక్షాత్కార మొసంగుచు యుండవలెనని ప్రార్థించినాడు. అందుకశ్రీ మన్నారాయణుడు


"అహందృశ్యో భవిష్యామిత్వత్కృతే సర్వదేహినామ్ | ఆకల్పంచమునీంద్రాస్మిన్ దృశ్యోహం నాత్ర సంశయః" ||


అగస్త్యా! నీప్రార్థన ననుసరించి సర్వప్రాణులకు ప్రత్యక్షముగ కన్పించుచు ఈ విమానమునందేయుండగలను. ఈశ్వేతవరాహ కల్పాంతము వరకు నేను ఇచ్చట ప్రత్యక్షముగనే యుందును. ఇందు సందేహము లేదని తెలిపినాడు. ఆమాటలను విని అగస్త్య మహర్షి సంతోషించి తన ఆశ్రమమునకు వెళ్ళినాడు. అగస్త్య మహర్షి సర్వజన హితకాంక్షప్రశంసనీయము గదా!


40. ఓం వాసుదేవాయ నమః పరవాసుదేవుని అర్చామూర్తి యగు వేంకటేశునకు నమస్కారము. వసుదేవుని కుమారుడగు శ్రీ కృష్ణుడే (వాసుదేవుడు) వేంకటేశునిగా అవతరించి యుండుటచే ఆ వాసుదేవ రూపియగు వేంకటేశునకు నమస్కారము. ఈ నామము పరవాసుదేవునకు, వేంకటేశ్వరునకు, వసుదేవుని కుమారుడైన శ్రీ కృష్ణునకు వేంకటేశునకు అభేదము తెలుపుతున్నది. సర్వ ప్రాణులలోను విశ్వమంతటా నిండియున్నవాడే వాసుదేవుడు.


శ్లో || వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్తయమ్ | సర్వభూత నివాస్కోసి వాసుదేవ నమోస్తుతే ||


అని వ్యాసమహర్షి విష్ణు సహస్ర నామముల యొక్క ఉత్తరపీఠికలో (25) వాసుదేవ నామమును వివరించాడు. సర్వత్ర తానునివసించుటవలన,ప్రాణులన్నింటియందుఅంతర్యామిగా తాను నివసించి యుండుట చేత భగవంతునికి వాసుదేవుడను పేరుసార్థకమని వ్యాసమహర్షిభగవత్ తత్త్వమును కీర్తించినాడు.


"వసతి వాసయతి ఆచ్చాదయతి సర్వం | వాస్తుశ్చాసౌదేవశ్చవాసుదేవః || సర్వత్ర తాను నివసించుట చేత, సర్వమును తన యందు నివసింపజేయుట చేత వాసువు అనబడుచున్నాడు. వాసువు అయిన దేవుడు వాసుదేవుడు అని వ్యుత్పత్త్యర్ధము. ఈ విషయమునే


శ్లో || ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః | సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతః స్మృతః ||


శ్లో || ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః | సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతః స్మృతః ||


సూర్యుడు తన కిరణములను జగత్తంతటా ప్రసరింప చేసినట్లు నేను మాయా శక్తితో సర్వజగత్తును ఆచ్ఛాదించి యున్నాను. సర్వప్రాణులందు నివసించి యున్నాను. అందుచేత నన్ను వాసుదేవుడని పిలుచుచున్నారు అనిశ్రీ కృష్ణ భగవానుడే మహాభారతం, శాంతిపర్వం (341-41 శ్లో)లో తెలిపియున్నాడు.


శ్లో || సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని | భూతేషుచససర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః || పరమాత్మలో సర్వప్రాణులూ నివసించి యున్నవి. ప్రాణులన్నింటిలోనూ పరమాత్మ నివసించి యున్నాడు. కనుక పరమాత్మ వాసుదేవుడనబడుచున్నాడు అని విష్ణుపురాణం (65-80 శ్లో||) పరమాత్మతత్త్వాన్ని కీర్తించింది. ఆ ఈ సమస్త ప్రపంచము ఆత్మస్వరూపుడైన వాసుదేవుడే అనేది నిశ్చయ జ్ఞానం. ఈ జ్ఞానం కలవాడే మహాత్ముడని వివరిస్తూ భగవద్గీత


"వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః |" అని (7-19 శ్లో ||) ప్రశంసించింది. అంతరాత్మరూపుడుగా ఉన్న వాసుదేవుడే భగవంతుడైశ్రీ కృష్ణుడని జ్ఞాని భావిస్తాడని శంకర భాష్యం వివరించింది. కనుక జ్ఞాని సర్వాత్మ దృష్టితో సమస్తమూ ఆత్మమయముగా, భగవన్మయముగా, వాసుదేవ మయముచూస్తాడు. అందువలన సమదృష్టి, సమదర్శనము కలుగుతాయి. ఈ వాసుదేవజ్ఞానంగలవారు ఎవరినీ ద్వేషించరు. అందరూ మనవంటివారే అనే సమభావంతో ప్రవర్తిస్తారు. వారికి శోక మోహాదులు వుండవు. అందుచేతనే "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనీ ద్వాదశాక్షరీ మంత్రము సర్వులకూ హితకరమైన దివ్య మహామంత్రముగ గౌరవింపబడుచున్నది.


శ్లో|| చింతయన్ వాసుదేవాఖ్యంపరబ్రహ్మస్వరూపిణమ్ | | దృష్టుకామశ్చతం దేవం వృషభాద్రి నివాసినమ్ ||


'వృషభాచలమున వెలసినది పరబ్రహ్మ యగు వాసుదేవుడే అను జ్ఞానముతో అగస్త్యమహర్షి మొదలగువారు ఆ వాసుదేవుని గూర్చి చింతించుచు, ఆతనినిచూడవలెనను కోరికతోవేంకటాచలమున అనేక సంవత్సరములు వేచియున్నారని వామన పురాణం వెల్లడించింది. |


| వామదేవ మహర్షి నిమి పుత్రుడగు జనకరాజుకు అతనియందు గల వాత్సల్యముతో నారాయణగిరి మహిమ యందున్న రహస్యమును ఇట్లు బోధించినాడు. "ఈ నారాయణగిరిలోశ్రీ మన్నారాయణుడు వాసుదేవుడనెడి తన పేరుకు తగినట్లుగ ఈ పర్వతమందు అన్నిచోట్ల అనగా అన్ని గుహలయందు, అన్ని సెలయేళ్ళయందు, పుణ్యతీర్థములలో, చెట్లు, తీగలు మొదలగు వానియందు నివసించుచున్నాడు. ఇట్లే నారాయణగిరి యందు దేవతల రూపములో, మనుష్య రూపములో, పక్షి - మృగ రూపములలో భగవంతుడు (వాసుదేవుడు) నివసించుచున్నాడు. నారాయణగిరిపై వాసుదేవుడు సర్వప్రాణి రూపమై నివసించుచున్నాడు. అందుచే ఎవరైనా ఈ పర్వతముపై ఎక్కడైనను వుండి భగవంతుని ధ్యానించిన, పూజించిన, అచట భగవంతుడు సాన్నిధ్యమును వహించి, అతని అభీష్టములను అనుగ్రహించును" (వామన 42-21-26).


| "వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవః". వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీ కృష్ణుడు. వరాహ, భవిష్యోత్తర పురాణములలో పద్మావతీశ్రీ నివాసుల తొలి పుల వేళలో శ్రీనివాసుడు ఆమె చెలులతో తన పేరు కృష్ణుడని, తాను దేవకీ వసుదేవుల కుమారుడనని చెప్పినాడు. కనుక వాసుదేవుడే శ్రీ నివాసుడు ఇద్దరికీ అభేదము కలదు. ఆవసుదేవుని కుమారుడే శ్రీ నివాసుడుగ (వేంకటేశునిగ) అవతరించినాడు. వేంకటాద్రిపై అర్చామూర్తిగ వెలసి భక్తజనుల అభీష్టములను తీర్చుచున్నాడు. వాసుః చ అసౌ దేవశ్చ ఇతి వాసుదేవః అను విగ్రహ వాక్యముతో వాసుదేవశబ్దము (సమాసము) ఏర్పడింది. వాసువు అయిన దేవుడు అని ఈ సమాసమునకు అర్థము. వాసు అను నామము వస - ఆచ్ఛాదనే అను ధాతువును బట్టి, వస నివాసే అను ధాతువును బట్టి ఏర్పడుచున్నది. ఆచ్ఛాదయతి, వాసయతి అను అర్థములు వాసు శబ్దమునకు గలవు. వీటికి దేవ శబ్దము చేరి వాసుదేవ పదము ఏర్పడింది. భగవంతుని మంత్రములలో 'ఓం నమో విష్ణవే', అను షడక్షరీ నామమును, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అను ద్వాదశాక్షరీ నామమును, 'ఓం నమో నారాయణాయ' అను అష్టాక్షరీ నామమునుతే ఫ్రములని, ప్రభావవంతములని పెద్దల మాట. ఈ విష్ణు, వాసుదేవ, నారాయణ నామములు మూడు శ్రీ వేంకటేశ అష్టోత్తర శత నామావళిలోగలవు.. ఈ వాసుదేవ నామము విష్ణు సహస్ర నామములలో | (334,700,714) గలదు.