ఆనంద నిలయా స్తే భక్తులకి దివ్యానందం కలుగుతోంది. బ్రహ్మానందం కలుగుతోంది. దానిని నిర్మించిన దేవశిల్పి విశ్వకర్మ కళాచాతుర్యాన్ని... దగ్గరుండి కట్టించిన తొండమాను చక్రవర్తి భక్తి ప్రపత్తుల్ని అందరూ వేనోళ్ళ కీర్తిస్తున్నారు. అందులో ఉంటూ నివాసుడు పద్మావతీ దేవితో అనంత భోగాల్ని అనుభవిస్తున్నాడు. తనని శరణు వేడిన భక్తుల | కోరికల్ని తీరుస్తున్నాడు. ఆపదల్ని తొలగించి ఆపదమొక్కులవాడిగా ఆదుకుంటున్నాడు.
|అంతా సవ్యంగా జరుగుతునాశ్రీ నివాసునికి మనసులో ఏదో వెలితి... ఏదో తీయని బాధ... ఆయనకి తెలుసు... కానీ ఎవరికీ చెప్పడు. వివాహం జరిపించి వెళ్ళిపోయింది మహాలక్ష్మి... ఒక్కసారి కూడా వేంకటాచలానికి ఆమె రాలేదు... కొత్త కాపురం కదా అని రాలేదు. అందుకే నివాసునికి విరహం... వియోగ వేదన. రోజు రోజుకి విరహం పెరుగుతోంది... తరగటం లేదు. "అయినా... ఆమె లేకుండా భక్తుల కోరికల్ని నేను ఒక్కడినే ఎలా తీర్చగలను? ధనమంతా ఆమె దగ్గరే ఉంది. ధనం లేకుండా కోరికలు ఎలా తీరుతాయి. కోలహపురానికి వెళ్ళి మహాలక్ష్మిని వెంటబెట్టుకు రావలసిందే! తప్పదు!" మనసులో అనుకున్నాడు శ్రీ నివాసుడు. మనసులోని బాధని ఆయన ఎంతగా అణుచుకున్నా... పైకి గంభీరంగా ఉంటున్నా పద్మావతీదేవి కనిపెట్టేసింది... ఆమె చాలా తెలివయింది!
ఆనంద నిలయం లోంచి... రాజగోపురం లోంచి... ఆది దంపతులు బయటికొచ్చి కోనేటి గట్టు మీద కూర్చుని చుట్టూ చూశారు. కోనేటి నీటిలోకి తొలగి శారు. చంద్రుడు తారలతో జలకాలాడుతున్నాడు.తమఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడని పద్మావతి ఆ కోనేటి నీటిని చేతితో అదిలించింది... అంతే... చంద్రుడూ తారలూ పారిపోయారు.. చుట్టూ ఎవరూ లేరు... కొండంతా నిశ్శబ్దంగా ఉంది. వృద్ధాప్యం వల్ల వరాహస్వామి ఆదమరిచి నిద్రపోతున్నాడు. దూరంగా అడవిలో కీచురాళ్ళు అరుస్తున్నాయి. "స్వామీ!" తీయగా పిలిచింది పద్మావతి. ".......శ్రీ నివాసుడు పలకలేదు. ఎటిస్తున్నాడు ఆయన. గమనించింది పద్మావతి. ఏ సమయంలో భర్తతో ఎలా మెలగాలో బాగా తెలిసిన ఇల్లాలు ఆమె. ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగల నేర్పు కలిగిన రాజకుమారి.
ఆమె మృదు కరస్పర్శకి ఆయన తనువు పులకరించింది... విద్యుత్తరంగాలు పరుగులు తీశాయి. "ఊఁ..."మత్తుగా అన్నాడు నివాసుడు. "వెన్నెల... బాగుంది కదూ!" విశాలనేత్రాల్ని మరింత విప్పాచూస్తూ అంది పద్మావతి. | ఆయన తలమీద తన గడ్డాన్ని ఆనించింది. నింగిలో చందమామలా ఉంది ఆమె మొహం.. "నీకంటేనా...?" చిలిపిగా అన్నాడు మందహాసం చేస్తూ శ్రీ నివాసుడు. "పోండీ..." అంటూ తన వాలుజడతో సున్నితంగా శ్రీ నివాసుని కొట్టింది పద్మావతి.. "సరస సల్లాపాల్లో మిమ్మల్ని మించినవాళ్ళు ముల్లోకాల్లో శ్రీ ఎవరూ లేరని అందరూ అంటూ ఉంటారు కదా! మరి... ఈ మధ్య ఎందుకో.. ఎందుకో..." అని ఆగింది పద్మావతి. ఆమెవచ్చి భర్త పక్కనే కూర్చుంది. ఆయన కళ్ళలోకి సూటి సింది... ఆయన పుమరల్చుకున్నాడు. "ఊఁ... ఎందుకో... ఎందుకో.." అన్నాడ నివాసుడు. "మీ సరసంలో నీరసం కనిపిస్తోంది..." గబగబా అనేసింది పద్మావతి. "పద్మా నీరసం అయితే సర్దుకుపోవచ్చు... విరసం కాకుండా చూసుకోవటం ముఖ్యం!" అన్నాడు నవ్వుతూనే నివాసుడు. "స్వామీ! ఈమధ్య మీరెందుకో పరధ్యానంగా ఉంటున్నారు... ఈ వెన్నెల సాక్షిగా చెప్పండి! నిజమా...కాదా?"గట్టిగా అడిగింది పద్మావతి.. "....." ఏమీ మాట్లడలేదశ్రీ నివాసుడు. "చెప్పండి స్వామీ!"మళ్ళీ అడిగింది పద్మావతి. మౌనం కొన్నిసార్లు మేలు చేస్తుంది. మరికొన్ని సార్లు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంది. కొన్ని సమయాల్లో మౌనాన్ని అర్ధాంగీకారంగా స్వీకరిస్తారు... పూర్ణాంగీకారంగా కూడా స్వీకరిస్తారు. మౌనం వల్ల కొన్నిసార్లు అపార్ధాలు... అనర్థాలు కూడా జరిగే ప్రమాదం పొంచి ఉంది. మౌనంగా ఉంటే కలహాలు రావని పెద్దవాళ్ళు అంటారు. పద్మావతీ నివాసుని వరకసింది. "చెబుతాను... చెబుతాను!" కోనేటిలోక స్తూ అన్నాడు శ్రీనివాసుడు.
పద్మావతీ నివాసుని వరకసింది. "చెబుతాను... చెబుతాను!" కోనేటిలోక స్తూ అన్నాడు శ్రీనివాసుడు. "ఊఁ.." అంది పద్మావతి. "విరహం..."సన్నగా అన్నాడు "విరహమా...?" ఆశ్చర్యంగా అడిగింది పద్మావతి. "వియోగం..." అన్నాడు నివాసుడు. "అయ్యో!..." తల పట్టుకుంది పద్మావతి.
"మహాలక్ష్మిని మరిచిపోలేకపోతున్నాను. పద్మావతీ!" అన్నాడ నివాసుడు. "ఇంకెవ్వరో అనుకున్నానులే!" అంది పద్మావతి. "ఆమె... నీకు... ఇష్టమేనా?" అన్నాడు నివాసుడు. "ఆమె... ఇష్టమేనా... ఏం మాట అన్నారండి! ఆమె దగ్గరుండి నాకు పెళ్ళి చేసిన అక్కయ్య... ఆమె నా ప్రాణం!" ఉద్వేగంతో చెప్పింది పద్మావతి. "అలాగా!" అన్నాడ నివాసుడు. "ఆనందంగా కోలహపురానికి వెళ్ళి అక్కయ్యని వెంటబెట్టుకు రండి!" ఆనందంగా అంది పద్మావతి. శ్రీ నివాసుని ఆనందానికి అవధులు లేవు. "పద్మా! అనుమానంగాచూ స్తున్నావేంటి?" అన్నాడు శ్రీ నివాసుడు. "స్వామి మీది నిజంగా..." అంది పద్మావతి. ".......శ్రీ నివాసుడు మాట్లాడలేదు. "విరహమేనా..." అంది పద్మావతి. "నమ్మకం లేదా.." అన్నాడు నివాసుడు. "నమ్మకం ఉంది... అందుకే నిజం చెప్పండి!" గడుసుగా అంది పద్మావతి.
"విరహం ఒక కారణం..." అన్నాడ నివాసుడు. "మరో కారణం...?" అంది పద్మావతి. "పద్మా! ఇక నా బాధల్ని నీకు చెప్పక తప్పటం లేదు. అయినా నీకు కాక మరెవరికి చెబుతాను?" అన్నాడు నివాసుడు. "మీకు బాధలేంటి స్వామీ! అందరి బాధల్ని మటుమాయం చేసే లీలావినోది మీరు" అంది పద్మావతి. | "వివరంగా చెబుతాను విను పద్మావతీ! నా జీవన రేఖలన్నీ కన్నీటి కాలువలే... విషాదపు చారికలే సుమా! నా తప్పు అణుమాత్రం కూడా లేకుండానే మహాలక్ష్మి నన్ను విడిచి వెళ్ళింది... ఆమెను అనుసరిస్తూ నేను వైకుంఠాన్ని వదిలిపెట్టాను... భూలోకంలో పిచ్చివాడి మాదిరిగా ఆమెకోసం కొండల్లో కోనల్లో వెదికాను... ఆకలి దప్పులతో అలమటించాను. సరైన బట్టలు లేవు... నగలు లేవు... వేంకటాచలానికి చేరాను... పుట్టలో తలదాచుకున్నాను... ఆవుపాలతో కడుపు నింపుకున్నాను... నేను ఏ అపరాధం చెయ్యకుండానే గోపాలుడు గొడ్డలితో నన్ను కొట్టాడు... వరాహస్వామి ఆశ్రయమిచ్చాడు... వకుళమాత ఆదరించింది... నిన్ను కాపాడి నీ చెలికత్తెల చేత రాళ్ళదెబ్బలు తిన్నాను..." అన్నాడ నివాసుడు. "ఊరడిల్లండి స్వామీ!" అంది పద్మావతి.
"ఊరడిల్లండి స్వామీ!" అంది పద్మావతి. "నిన్ను వివాహమాడేందుకు ధనం లేక కుబేరుని దగ్గర అప్పు చేశాను. అయినా... బాధ లేదు. ఎందుకంటే నిన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత మనసు కుదుటపడింది... జీవితం గాడిన పడింది... కానీ ఇప్పుడు మరో బాధ... విరహబాధ... భక్తుల కోర్కెలు తీర్చాల్సిన బాధ్యత. అందుకు మహాలక్ష్మి వచ్చి నా వెంట ఉండాలి పద్మావతీ!" అన్నాడ నివాసుడు. పద్మావతి అంగీకరించింది.