శ్రీ వేంకటేశ్వర వైభవం

శ్రీ వేంకటేశ్వర వైభవం


ప్రసన్న వెంకటదాసుల సంకీర్తనలలో శ్రీనివాస వైభవం


                                 - ఆచార్య కె.సర్వోత్తమరావు కె.సర్వోత్తమరావ


|


ఆంధ్ర వాగ్గేయకారులలో తాళ్ళపాక అన్నమయ్య, పెదతిరుమలయ్య, చినతిరుమలయ్యక్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య ప్రసిద్ధులు.అలాగే కన్నడ కీర్తనకారులలో పురందరదాసుకనకదాసు, విజయదాసు, ప్రసన్నవేంకటదాసు, గోపాలదాసు, జగన్నాథదాసు సుప్రసిద్ధులుతాళ్ళపాక పదవులకుకన్నడ కీర్తనకారులకు అనేకసామ్యాలున్నాయి. వీరు విశ్వసించి సేవించిన మూర్తిశ్రీ వేంకటేశ్వరుడు కావడం విశేషం. 'దేవరందరె తిమ్మప్ప' అని కన్నడ కీర్తనకారుల చెదరని కదలని నమ్మకం. అందుకే వీరందరు తిరుమలేశునిపై పదుల కొలదిపాటలు పాడారువారిలో ప్రసన్న వేంకటదాసుతీ నివాస సంకీర్తనలను పరిశీలించడం ఈ వ్యాస ప్రధానాంశం.


| అన్నమయ్యకు ప్రసన్న వేంకటదాసులకు ఎన్నో సామ్మాలు కనిపిస్తాయి. అన్నమయ్య రాయలసీమ నివాసి. ఇంచుమించు రాయలసీమవంటిబాగలకోటలో వేంకటదాసుబాల్యంసాగిందిఅన్నమయ్య క్రీ.శ 1408-1503 వాడయితే వేంకటదాసుక్రీ.శ 1680 - 1752 నాటివాడు. ఇద్దరూ వేంకటేశ్వరానుగ్రహంతో జన్మించడం మరో ప్రత్యేకత. వైష్ణవ స్వీకారానికి అన్నమయ్యకు ఘనవిష్ణువు కారణమయితే సాక్షాత్ స్వామి దాసరూపంలో వచ్చి వేంకటదాసులకు 'దీక్ష' ఇప్పించాడని ఐతిహ్యం. అన్నమయ్యది శ్రీ వైష్ణవమైతే దాసుల వారిది ద్వైతమతం. వివిధ క్షేత్రదర్శనంనైతికతా ప్రబోధం, నిర్మల జీవితం, శేషాచలాధీశ్వర సేవనం - లాంటివి కొన్ని సామ్యాలు. అయినా అన్నమయ్యకున్నంత ఆలయ అనుబంధం ప్రసన్న వేంకటదాసులకు లేదు. అన్నమయ్యను నుతించిన వాగ్గేయకారులు లేరుగాని, వేంకటదాసులను కీర్తించిన రమాపతి విఠలదాసాదుల రచనలున్నాయిఅన్నమయ్య రచనలు 12 శతకాలు, 32 వేల కీర్తనలుసంకీర్తన లక్షణం, రామాయణం, శృంగారమంజరి అయితే ప్రసన్నవేంకటదాసులవారు భాగవతం, సమస్త నామమణిగణ షట్చరణ పద్యమాల, నారదరు కురవంజియ వేష తాళచతై నవవిధ భక్తియపద్యగళశ్రీ కృష్ణపారిజాత, నారాయణ పంజరమూడువందల దేవర నామాలున్నాయి. వాటిలో సుమారు 70 శ్రీ నివాస సంకీర్తనలు, ఇరువురి జీవితాలలోను మహిమలు కోకొల్లలు కూడా. ప్రస్తుతాంశం వేంకటదాసుల సంకీర్తనలలోని | ప్రాదేశిక వైభవం, మూర్తివైభవం, ఉత్సవాది వైభవాలను చర్చించడం మాత్రమే. క్రీ.శ. 17, 18 శతాబ్దాలనాటి తిరుమల వైభవం తెలుసుకోవడానికి కన్నడదాస సాహిత్యం కరదీపిక.


ప్రాదేశిక వైభవం 'తిరుమల' ప్రసిద్ధక్షేత్రం. తమిళ సంగ వాజ్మయంలోనే తిరుమల ప్రశస్తి ఉంది. ఆళ్వారుల పాశురాలలో తిరుమల ప్రకృతి రమణీయంగా వర్ణితం. తాళ్ళపాక కవుల రచనలలో చెప్పేపని లేదు. ప్రసన్న వేంకటదాసులు తిరుమలను 'భూవైకుంఠావిడెందు', వైకుంఠ సదనా, వైకుంఠకర్తా అని ప్రశంసించాడు. ప్రత్యేకించి స్వామి పుష్కరిణిని ఇతర తీర్థాలను అనేక సందర్భాలలో ఘనంగా కీర్తించాడు. స్వామిపుష్కర తీర నిలయనమో, సువర్ణముఖరియా తీరది, స్వామిపుష్కరిణెంబ తీర్థద నామదా మహిమేనెంబ, స్వామిపుష్కరవాస శుభమంద స్మితహాస - అని ఉల్లేఖించాడు. ఇంకా సప్తగిరులలో వెంకటాద్రి, అంజనగిరి, శేషాద్రి, గరుడాద్రి కొండలను భక్తితో కొనియాడినాడు. ప్రస్తుతం లభ్యమవుతున్న తాళ్ళపాక పదకవులలో కనిపించని వరాహమూర్తి వర్ణనలు ప్రసన్న వేంకటదాసులరచనలల్లో కనిపిస్తాయి.శరణుభూవరాహదేవనెస్వామివరాహ వెంకటనాయకా, శ్వేతవరాహ వెంకటనాయకా అని కీర్తించాడు. 'భూవరాహస్వామియ సన్నిధిలి' అంటూ వరాహస్వామి ఆలయ సేవావిధానాన్ని స్పష్టంగా చెప్పాడు.


మూర్తివైభవం


విజయనగర రాజుల కాలంలో తిరుమల వెలిగిన అంశం జగద్విదితమే. రాయలవారు ఏడుమార్లు తిరుమలకు వేంచేసి స్వామికి ఎన్నో కైంకర్యాలు నిర్వహించారనడానికి శాసన సాక్ష్యాలున్నాయి. ఆ బాటలోనే అచ్యుతదేవరాయ, సదాశివరాయలు నడిచారు. అయితే తురకల దండయాత్రల వల్ల, విజయనగర సామ్రాజ్య విచ్ఛిన్నతవల్ల కొంత క్షీణత ఉన్నా ప్రసన్న వేంకటదాసుల రచనలను బట్టిశ్రీ నివాసుని వైభవానికి 'లోటు' ఏమీ లేదని స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఆ మూర్తిని ఎన్నో కీర్తనలలో అనుభూతితో వర్ణించారు. 'వెంకటేశనమోహిమెయా' అనే కీర్తనలో కిరీట కుండల విట్టను తిమ్మయ్యా, అరిశంఖవను ధరిసిద, హారకేయూర కౌస్తుభ దొప్పిద, తోళబందియు కంకణముద్రికే, కీలుకడగా వడ్యాణ నీలమాణిక పచ్చద ముత్తిన మాలెగళిందొప్పిద, మణిమయద కవచతొగట్టు గళదలి మినుగువాభరణవిట్టు కనక పీతాంబరట్టు కటియల్లి అణుఘంటెగళైసదవు, రన్నదందుగ నిట్టహపాదకె, పొన్నావుగే మెట్టహ అని స్వామి ఆకారాన్ని మనముందు నిలిపినాడు. 'సలహు వెంకటరమణ దయాంబుధి' కీర్తనలో మాణిక్యకిరీటాన్ని, కస్తూరినామాన్ని, వనమాలికను,వైజయంతి పతకాన్ని, ముత్యాలహారాలను, భుజకీర్తులనుకంకణముద్రికలతో శోభించే అభయ వరదహస్తాన్ని, నడుమున ధరించిన ఖడ్గాన్ని, హారభూషితుని వర్ణించాడు. ఈ వర్ణనవల్ల .శ 17, 18శతాబ్దాలలో స్వామినగలేవీ అపహరింపబడలేదని స్పష్టం.


ఉత్సవవైభవం


సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగించేది ఉత్సవం. ఆలయాలలో ఉత్సవాలు అనేకరకాలు. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులు. తిరుమలలో అన్ని ఉత్సవాలకంటె బ్రహ్మూత్సవం ప్రసిద్ధం. హరిదాసులందరు ఈ ఉత్సవాలను దర్శించినవారే. అనుభూతితో వర్ణించినవారే. అన్నమయ్య 'వానలలోనె వత్తురు కదలి' అన్నట్లు ప్రసన్న వేంకటదాసులు 'బణ్ణసాలమ్మనానూ - వర్ణించలేనయ్యా నేనూ' అనే కీర్తనలో 'పరుషల సొబగు'ను కనులకు కట్టినాడు. కదలి వచ్చే యాత్రిక సందోహం. గుంపుగా ఛత్రచామరాదులు ధరించినవారు,కుచ్చుదండములు, పతాకములతో కదలువారు, శంఖకాహళనాదాలు చేసేవారు. తాళ తంబూరాలను పట్టి నర్తించే హరిదాసులు, కానుకల సమర్పణకోసం ఉయ్యాల, మంచాలు తెచ్చేవారు. తుమ్మెదలలాగా వచ్చే ఐదేండ్ల బాలురు, యువతులు, నడివయసులవారు, ముదుసలులను వర్ణించాడు. ప్రత్యేకించి దాసులవారు హనుమ, గరుడ వాహనాలను పేర్కొనడంలో మతానురక్తి కూడా లేకపోలేదు.


ఇతరాంశాలు


వైష్ణవములో ఉత్సవాదులు అలంకరణల తరువాత 'ప్రసాద వైభోగం' గుర్తింపదగ్గ అంశం. తిరుమల ఆలయంలో రకరకాల ప్రసాద నివేదనలున్నాయి. అన్నమయ్య వీటిని అనురక్తితో వర్ణించినాడు.పురందరదాసు 'అతిరసమెద్ద' అన్నాడు.కనకదాసు ప్రసాదాలను అమ్ముకొనే తీరును వర్ణించినాడు. ప్రసన్న వేంకటదాసులవారుకూడా తళగీయదధ్యాన్నబలురుచి అప్పాలు బకుళన్న పొంగాలు నలెమృదుభరిగే శిఖినుండెల్లూరిగే పుళితిక్తమధుమిశ్రపులసుపాలినదోసెహలవుపరియఘృతపక్వ పంచామృత పాలత్తెంతో మనోహరాప్రసాద ఉండుకళి' అని దధ్యోదనాదులను ప్రశంసించినాడు. | ప్రసన్న వేంకటదాసు ప్రస్తావించిన మరో అంశం 'నీరాజనం' స్వామి ఊరేగింపువేళ భక్తులు సభక్తికంగా అర్పించే సేవలలో ఇది ఒకటి. 'నీరాజనవనెత్తారో తిమ్మయ్యగె'లో నీరాజనాన్ని మంగళ మహిమగెలో 'ఆరతీయ బెళగిరె' అని హారతిని, జయమంగళం మహాశుభమంగళం లోనూ మంగళ అంజనగిరిపతి మంగళం మకరకుండల మండితాదవ7, మంగళమందిరగే మంగళ మురారిగె-లో మంగళాన్ని చెప్పాడు. ఉత్సవ సమయాలలో 'సాసముఖా'లాగా పరాకు చెప్పే సంప్రదాయాన్ని శ్రీ పతిపరాకుస్వామి మహీపతిపరాకు' కీర్తనలోనూ, జయభో జయభో జయ వేంకటేశ ప్రభో, జయకర్తా భయహర్తా అభయదాయకమూర్తీలో జయ జయ ధ్వానాలు చేశారు. దాసులవారు. | తాళ్ళపాక పెదతిరుమలయ్య లాగా సంకీర్తనలను కన్నడ హరిదాసులు రాగిరేకులలో భద్రపరచి ఉంటే తిరుమల వైభవం, నివాస వైభవం ఇంకా బాగా తెలియడానికి వీలుండేది. నామసార్థక్యంతో వేంకటదాసుల వారు వేంకటేశ్వరుని వైభవం కీర్తించడంలో సఫలుడయ్యాడనడంలో సందేహం లేదు.