భగవంతుడు సర్వాంతర్యామి. ఎందు వెదకిన అందందే కలడని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునికి చెప్పగానే హిరణ్యకశిపుడు "అయితే ఈ స్తంభంలో నీవు కొలిచేత్రీ హరి పగలవా?" అంటూ గదతో గట్టిగా స్తంభాన్ని ఛేదించాడు. ఉగ్రనరసింహావతారంలో శ్రీ మన్నారాయణుడు స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించాడు. అందుకే హిందువులు దైవం ప్రతిచోట ఉంటాడని చెట్లను, పుట్టలను, రాళ్ళను, నీళ్ళను, చివరకు కొందరు మనుషులు భగవదవతారమని వారిని భక్తితో పూజిస్తారు. భగవంతుడు భక్త రక్షణకు, దుష్ట శిక్షణకు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడే భగవద్గీతలో ఈ విషయం స్వయంగా తెలియజేశాడుశ్రీ మన్నారాయణుని దశావతారాల లక్ష్యం దుష్టశిక్షణే. భూలోకంలో రాక్షసులుగా జన్మించి యజ్ఞయాగాలను ధ్వంసం చేయడం, దేవతలను, మానవులను, మహర్షులను తరచు పీడించడంతో హరి లోక కళ్యాణం కోసం దశావతారాలు దాల్చి రాక్షసులను మట్టుపెట్టాడు.
భూలోకంలో ధర్మాన్ని నిలపడానికి, నైతిక విలువలు పెంపొందించడానికి భగవంతుడు తాను అవతరించకుండా తన అంశతో కొందరు దూతలను ఈ ప్రపంచానికి పంపుతాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు శ్రీ రామకృష్ణ పరమహంసశ్రీ రమణ మహర్షి, సద్గురు సాయిబాబా, వివేకానందస్వామిత్రీ సత్యసాయి బాబా మున్నగు వారిని పేర్కొనవచ్చు. ఈ మహాత్ములందరూ తమ బోధలతో, గ్రంథరచనలతో నైతిక విలువలు పెంపొందించి, మానవులు పతనం కాకుండా ఆధ్యాత్మిక బాట పట్టడానికి ఎనలేని కృషి చేశారు. మానవులకు భగవంతునిపై నమ్మకం కలగడానికి విగ్రహారాధన ప్రోత్సహించారు. అందుకే నేడు ప్రపంచమంతటా అనేక దేవాలయాలు నిర్మించి ఇష్ట దైవాన్ని పూజిస్తున్నారు. భగవంతునికి ఒక రూపు లేదు. ఏ రూపంలో తలచుకుంటే ఆ రూపంతో దర్శనమిస్తాడని చెప్పి మహర్షులు దర్శించిన రూపాన్ని తెలియచేస్తే చిత్రకారులు బొమ్మలు గీశారు. శిల్పులు శిల్పాలు చెక్కారు.
అందుకే ఈ రోజు మనకు అనేక దేవాలయాలలో వివిధ దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. ఒకనాడు శివుడు గొప్ప,మహావిష్ణువు గొప్ప,జగదంబగొప్ప, సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం, గణపతే ముఖ్యదైవమంటూ కొందరు మూర్ఖులు తర ఘర్షణలు పడేవారు. ఆదిశంకరులు ఈ ఘర్షణలూ సినారాయణుడు, శంకరుడు, భగవతి అందరూ ఒకటే. వారు సఖ్యంగానే ఉంటారు. ఒకరినొకరు పొగుడుకుంటారు కూడా. మధ్యలో మీరెందుకు ఇలా పోట్లాడుకుంటారని వారికి నచ్చచెప్పి పంచాయతన పూజ అలవాటు చేశారుశ్రీ శంకరాచార్యులు వారు ఒకే పీఠంపై ఇష్టదైవాన్ని మధ్య ప్రతిష్టించుకుని నాలుగు మూలలా మిగతా దైవాల్ని ప్రతిష్టించి పూజించుకోవచ్చని చెప్పి పంచాయతన పూజకు నాంది పలికారు. మధ్యలో శివుణ్ణి ప్రతిష్టిస్తే నాలుగు మూలలా గణపతి, భగవతి, సూర్యనారాయణుడుశ్రీ మహావిష్ణువుని ఒకే పీఠంపై ప్రతిష్టించి పూజించడమే పంచాయతన పూజ. ఎవరి ఇష్టదైవాన్ని వారు మధ్యలో పెట్టుకుని అందరి దేవతలను పూజించమని, ఘర్షణల వల్ల మోక్షం రాకుండా నరకం ప్రాప్తిస్తుందని చెప్పి అందరినీ శాంతింపచేశారు. అందుకే నేడు అనేకచోట్ల ఒకే దేవాలయ ప్రాంగణంలో అందరి ఇష్టదేవతలమడగలుగుతున్నాము. సృష్టిలో అనేక వింతలు మనకు గోచరిస్తాయి. రకరకాల పక్షులు, జంతువులు,మానవులు వివిధరంగులలో, ఆకారాలలో, అందంగా, వికారంగా ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తాయి. మానవులు నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా, కొందరు అంగవైకల్యంతో పుట్టుకతో బాధపడుతూ ఉంటే మరి కొందరు మధ్యలో ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు పోగొట్టుకునేవారు తారసపడుతూ ఉంటారు. కొందరు మంచివారికి, ధర్మాత్ములకుసంతానం లేకపోవడమో పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం, తెలివి తక్కువ వారిగా మారి చదువు అబ్బకపోవడం ఇవన శాక నాలో భగవదన్వేషణ ప్రారంభమైంది. సృష్టికి మూలం ఒకశక్తి ఉంది. అదే ప్రపంచాన్ని నడిపిస్తోంది. ప్రకృతి విలయ తాండవాలుచూస్తున్నాం. భూభారం తగ్గించడానికి భూకంపాలు, తుపాన్లు, వరదలు, యుద్దాలు, రకరకాల రోగాలు సోకి మానవులు మృత్యువాత పడతారు. పుట్టినవాడు గిట్టక మానడు. కొందరు ధనవంతుల ఇంట్లో పుట్టి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటే మరికొందరు దరిద్రుల ఇంట్లో పుట్టి అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఇవమా నీ పూర్వజన్మ అనేది ఒకటి ఉంది. దానివల్లనే మానవులు కష్టసుఖాలు అనుభవిస్తున్నారు. ఈ జన్మలో మంచివారుగా మంచిపనులు చేస్తున్న వారికి అంగవైకల్యం గల పిల్లలు పుట్టారంటే అది వారి పూర్వజన్మ ప్రభావమే. కొన్ని పెంపుడు జంతువులు కొందరు మానవుల కన్నా సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాయి. చాలా కుక్కలు, పిల్లులు, ఆవులు మున్నగు జంతువులు ఆదరణ, అవి తినే ఆహారము, వాటికిచ్చే గౌరవరూ స్తూ వుంటే అవి జంతువులుగా పుట్టినా పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన సుఖాల్ని పొందుతున్నాయి.శ్రీ రామకృష్ణ పరమహంస,శ్రీ రమణ మహర్షిశ్రీ సత్యసాయిబాబా వారు తపోధనులైనా చివరి దశలో పీడితులై వాధిపీడితులై శివైక్యం పొందారు.
ఎంతో డబ్బున్నా కొందరికి కుటుంబ సౌఖ్యం ఉండదు. రోగాలు పీడిస్తూ ఉంటాయి. కొందరికి తగినంత ధనం లేకపోయినా తృప్తిగా జీవితం గడుపుతారు. వారు మామూలు తిండి తిన్నా వారికి అనారోగ్యం సోకదు. ఇవన్నీ భగవంతుని లీలలు.