భాగవతము


శ్రీ కృష్ణా ! పరంధామా! ఇంతవరకు నాకు భాగవతుల ధర్మాలను, లక్షణాలను ఎన్నిటినో చెప్పావు. మోక్ష సిద్ధిని పొందగోరిన నరులు చేయవలసిన విధులన్నీ వివరించావు. యోగమార్గాన్ని బోధించావు. భక్తియోగ ప్రాధాన్యాన్ని స్పష్టపరిచావు. ధ్యానక్రియను ఆమూలాగ్రం తెలియబటిచావు. ఎవరెవరు, ఏవేవి, నీ విభూతులుగా ప్రకాశిస్తాయో ఎఱుకపరిచావు. మరికొన్ని విశేషాలు చెప్పమని ప్రార్థిస్తున్నాను. అమృతప్రాయమైన నీ పలుకులు వింటుంటే అజ్ఞానాంధకారం పటాపంచలవుతోంది. ఎప్పుడూ నీతోనే ఉండాలనే కోరిక బలీయమౌతోంది. నీ సాహచర్యం మోక్ష సమానం కదా!


భక్తవత్సలా! వాసుదేవా! నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పావు. తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఎన్ని ఉన్నాయో! వాటన్నిటినీ వివరించి చెప్పు. వాటినన్నిటినీ తెలుసుకొని కృతార్థుడనౌతాను. నేను మరిపోయాననుకొన్న ఒక ప్రశ్న అడుగుతాను. కూలంకషంగా చెప్పు. తరువాత మానవుడు పద్దర్మయుక్తుడై, పరమాత్ముడవైన నిన్ను పొందటానికి ఆచరించవలసిన కర్మలనన్నిటినీ మరొక్కసారి వివరించమని వేడుకొంటున్నాను. నీ భక్తుడనైన నన్ను కరుణించి సక్రమ మార్గంలో పెట్టు. ప్రతిక్షణం నిన్నే ఆరాధించే సద్బుద్ధిని కలిగించు" అని ఉద్దవుడు వినయ వినమితోత్తమాంగుడైనాడు.


శ్రీ కృష్ణుడా తమా సి చిరునవ్వుతో "ఇందాక, ఏదో ప్రశ్న అడుగుతానన్నావు. ఏమా ప్రశ్న! అడుగు మరి?" అన్నాడుఉద్ధవుడప్పుడు భక్తి పారవశ్యం నుంచి కొద్దిగా తేరుకొని శ్రీ కృష్ణుని వైపూ శాడు.


"ఉద్దవా! 'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ'


అని నేను మునుపు అర్జునుడికి చెప్పి ఉన్నాను. ఉపనిషత్తుల్యాలైన ఈ నా పలుకులను - 'ధర్మాలనన్నిటిని విడిచిపెట్టి నన్నొక్కడినే శరణు పొందు" అన్నదానిని ఎవడైతే పాటించి, నా మీద మనస్సు నిల్పి ప్రవర్తిస్తాడో - అటువంటివాడు - నేనని చెప్పబడతాడు. అంటే భగవత్తుల్యుడౌతాడన్నమాట! ఇన్ని మాటలెందుకు? దేనిమీదా నీ మనసును నిలవనివ్వకుండా, నా మీదనే ఉంచి పుణ్యుడివికా. , "ఉద్దవా! ఇంతకుముందు నీవు నన్ను ఎన్నో ప్రశ్నలడిగావు. అవి - 'నియమం, శమ దమాదులు, తపస్సు, సుఖదుఃఖాలు, స్వర్గనరకాలు' - అంటే ఏమిటి? ఎటుంటివాడు దరిద్రుడనబడతాడు? ఈశ్వరుడెవరు?' - వీటన్నిటికీ విడి విడిగా సమాధానాలు చెబుతాను. జాగ్రత్తగా విని తెలుసుకో.


మౌనవ్రతం, బ్రహ్మచర్యం, సహనం, జపము, తపము, అతిథులను సత్కరించటం, ఇతరులకు మేలు చేయటం, దొంగతనం చేయకుండా ఉండటం మొదలైన లక్షణాలను - నియమాలంటారు. ఇంద్రియ నిగ్రహము; శత్రువులయందు, మిత్రులయందు ఒకే రకమైన సమభావం - ఉంటే దానిని 'శమ'మంటారు. ఇక 'విద్య' అంటే - మూడులకు జ్ఞానాన్ని ఉపదేశించటం, కోరికలను త్యజించటం, అందరినీ, అన్నిటినీ ఒక్క సమంటూ డటం, వైష్ణవుల పట్ల భక్తి కలిగి ఉండటం, ప్రాణాయామం, మనో నిర్మలత్వం - అనేవి. శమ దమాది సద్గుణాలు లేనివాడయితే, నాయందు భక్తి లేనివాడయితే - అటువంటి వాడిది - 'అవిద్య' అవుతుంది - చిత్తశుద్ధితో, నిత్యం తృప్తితో ఉంటే అది 'దమ' గుణంగా చెప్పబడుతుంది. ఇప్పటివరకు చెప్పానే - అటువంటి నియమాది సద్గుణాలు కలిగి నా పట్ల నిశ్చల భక్తితో నన్నర్చిచటం - అనేదే 'సుఖం'. నన్ను తెలుసుకోలేక అజ్ఞానంతో ఉండటమే దుఃఖం'. బంధువుల పట్లా, గురువుల పట్లా భేదబుద్ధిని పొంది, శరీరమే తన గృహంగా భావించేవాడు 'దరిద్రుడ'నబడతాడు. ఇంద్రియ సుఖాలను వర్ణించి, గుణసంగమాలలో విరక్తుడైతే - అటువంటివాడు 'ఈశ్వరుడు'. ఉద్దవా! నా యందు మనస్సును లగ్నం చేసి, కర్మయోగంలో, భక్తియోగంలో ఇష్టం కలిగి, అర్చించిన జనక మహారాజు మొదలైనవారు కైవల్యాన్ని పొందారు. ప్రహ్లాదుడు, బలి, ముచుకుందుడు మున్నగువారు భక్తియోగాన్ని అనుసరించి, ఎల్లప్పుడూశ్రీ హరి పాదపద్మాలనే ధ్యానిస్తూ ముక్తులైనారు. కాబట్టి భక్తియోగమే అన్ని యోగాలలో అధికమైనదని గుర్తించి భక్తి నిష్ఠుడవు కా. ఇంకో విషయం చెబుతాను విను. మట్టికుండకు ఎక్కడైనా రంధ్రం పడితే ఆ కుండలోని నీరు కారిపోయే విధంగా రోజు రోజుకూ ఆయువు క్షీణిస్తుంటే మరణం దగ్గరపడుతుంటుంది. ఈ విషయం గ్రహించి నన్ను ఏమరుపాటు చెందకుండా ప్రతిక్షణం స్మరిస్తూ ఉండేవాడు నాకు ప్రియభక్తుడు.


"గర్భమున పరిజ్ఞానము నిర్భరమై యుండు జీవునికి తుదినతడా విర్భూతుడైన చెడునం తర్భావంబైన బోధ మంతయుననఘా!" - 110 ప - ఏకాదశ స్కంధం - భాగవతము


- ''జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడతనికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. కాని ఆ శిశువు భూమిపై పడగానే అప్పటివరకు ఉన్న జ్ఞానమంతా నశించిపోతుంది. అందుచేత ఆ జీవుడు పసితనంలో గాని, పిల్లవాని దశలో గాని, యువకుడైన సమయంలో గాని, వయసులో పెద్దవాడైన తరవాత గాని నన్ను తెలుసుకొంటే వాడి జన్మధన్యమౌతుంది. సంపదల వల్ల గర్వంతో అంధుడైతే అతడు చీకటి బావిలో పడతాడు. అటువంటి వాడిని దరిద్రుడిగా చేస్తే, ఆ బాధల వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞాని అయిన కారణంతో ఆ జీవుడు నా పాదపద్మాలకు నమస్కరించాలనే కోరికతో, నన్నర్చిస్తూ, చివరకు ముక్తిని పొందుతాడు. అందుచేత దేహంపట్ల అభిమానాన్ని వదలి ఐహికాముష్మిక సుఖాలను వేటినీ కోరక మనస్సును అదుపులో పెట్టుకొని ఎల్లవేళలా నన్నే తలచేవాడు వైకుంఠపదంలో నివసిస్తాడు. నేను కూడా అటువంటి భక్తుని విడువను. ఎప్పుడూ వానివెంటే వెళుతుంటాను. మరో విషయం. నారదుడు మొదలైన మహర్షులు అచంచలమైన భక్తిభావాన్ని కలిగి ఉండటం వల్లనే నా రూపాన్ని పొందారు" అని కృష్ణుడు ఉద్దవుడికి పరమార్థాన్ని బోధించాడు. అంతా విన్న ఉద్దవుడు సంతృప్తి చెంది, సృష్టికర్తను ఎవరు నడిపిస్తారో, ఎవరివల్ల బ్రహ్మ సృష్టిని చేయగలుగుతున్నాడో చెప్పవలసిందని కృష్ణుని ప్రార్థిస్తాడు. పరీక్షిన్మహారాజాశ్రీ కృష్ణుడు ప్రసన్నుడై, ఉదవుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పసాగాడు. . ఉద్దవా! నీ కుతూహలం నాకు నచ్చింది. సృష్టిక్రమం చెబుతాను విను.నాచేత రితాలైన మహత్తు మొదలైనగుణాలన్నీ కలిసి ఏకమై ఒక అండంగా రూపుదిద్దుకున్నాయి. ఆ అండంలో నుంచే నేను ఉద్భవించాను. తరవాత నా నాభి వివరంలో నుంచి బ్రహ్మ జనించాడు. బ్రహ్మవల్ల సముద్రాలు, నదులు, నదములు, అరణ్యాలు మొదలైన వాటితో నేను జగత్తును నిర్మింపజేశాను. బ్రహ్మకు నూరు సంవత్సరాలు నిండిన తరువాత భూమి గంధ రూపంగా మారిపోతుంది. ఆ గంధం నీళ్ళలో కలిసిపోతుంది. ఆ నీళ్ళు రసంలో లీనమవుతాయి. అప్పుడా రసం తేజస్సుగా మారి, తన తేజో రూపాన్ని వాయువులో విలీనమయ్యేటట్లు చేస్తుంది. వాయువు స్పర్శ గుణంగా భాసిస్తుంది. స్పర్శగుణం ఆకాశంలో లయమైపోతుంది. ఆకాశం - శబ్ద తన్మాత్ర చేత గ్రహింపబడుతుంది. ఇక ఇంద్రియాలు మనో వికార గుణాలను తమలో కలుపుకొని ఈశ్వరుడిలో ఉండిపోయి 'ఈశ్వర' రూపాన్ని ధరిస్తాయి. అప్పుడు నేను రజోగుణం, సత్త్వగుణం, తమోగుణం అనే మూడు గుణాలతో కూడి మూడు రూపాలు ధరిస్తాను. ఆ మూడు రూపాలలో ఉన్న నేనే జగత్తు యొక్క ఉత్పత్తికి, మనుగడకు, నాశనానికి కారణభూతుడనై వర్తిస్తాను. ఈ సృష్టి రహస్యాన్ని నీకు ఉపదేశించాను. నా ఈ ఉపదేశంతో పరమపావనుడిగా, పరమభక్తుడిగా ప్రవర్తించు"అశ్రీ కృష్ణుడు చెప్పటంతో ఉద్దవుడు మరో ప్రశ్న అడుగుతాడు భగవంతుని. "పరమాత్మా! నీకు రూపం లేదు గదా! అయినా యోగులు నీకో రూపాన్ని కల్పించి, అచంచల భక్తితో కొలుస్తుంటారే! ఏవిధంగా వాళ్ళ కోర్కెలను తీరుస్తున్నావయ్యా? నాకు అర్ధమయ్యేలాగున చెప్పు" అని అడగగానే కృష్ణుడు పరితృప్తుడై చెప్పసాగాడు. -


"ఉద్దవా! నీవడిగిన ప్రశ్న అందరికీ తెలియడానికి అడగవలసినదే. చెబుతాను విను. అన్ని వర్ణాల వారికి సమానమైన పూజా పద్ధతిని వివరిస్తాను విను. మానవులు తమ తమ ఆచారాలననుసరించి, పద్ధతులను బట్టి, నా రూపాన్ని వారి ఇష్టానుసారం మలచుకొంటారు. రాతితో కొందరు, మట్టితో మరికొందరు, కొయ్యతో ఇంకొందరు, నా ఆకారాన్ని తయారు చేసి, ఆ రూపానికి ఒక పేరు పెట్టుకొని పూజలు చేస్తారు.కంచుతో, సీసంతో, వెండితో, సువర్ణంతో చేసిన ప్రతిమలత్రే ష్టమైనవి. ఏదో ఒకరకంగా నా విగ్రహాన్ని తయారు చేసుకొని, నా ప్రతిరూపంలో నేనే ఉన్నానని భావించి శ్రద్ధాభక్తులతో నన్ను కొలిచేవారికి నేను తప్పక ప్రసన్నుడినవులాను. కాకపోతే, ఈ లోకంలో మానవులకు భగవంతుడిపైన ధ్యానం నిలవదు. అందుచేతనే వివిధాలైన నా ప్రతిమలు అనేకం వెలశాయి. వాటిలో వారి మనస్సు నిలవగలిగే అందమైన ప్రతిమలలో నేను కరుణాత్ముడనై ఉంటాను. ఉద్దవా! నన్ను క్షీరసాగర శయనునిగా భావించి తెల్లని, నిర్మలమైన వస్త్రాలను నాకర్పించి, ఆభరణాలతో అలంకరించి, మైపూతలు అలది, పూలదండలతో కైసేసి, తదేక దృష్టితో ననేళ్లూ సేవాడంటే నాకెంతో ప్రియం. పదహారు రకాలైన ఉపచారాలతో, రాజోపచారాలతో నన్ను సేవించి, రుచిరములైన పదార్థాలతో అన్నపానాదులర్పించి, ప్రతినిత్యం బాహ్య పూజావిధానంతో గాని, మానసిక పూజా పద్దతులతో గాని నన్ను సంతృప్తి పరచే భక్తులంటే ఇష్టపడతాను. అంతేకాదు. దివ్యమైన వస్త్రాభరణాలతో, పూలమాలలతో ప్రకాశించేవాడిని, శంఖ చక్రాది ఆయుధాలను ధరించి తేజోమూర్తిగా విలసిల్లేవాడిని, కిరీటాది భుజకీర్తులతో అలంకరింపబడినవాడిని అయిన నా రూపాన్ని, ఆ నా దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో భావించి ధ్యానపరవశుడైతే, అటువంటి నా భక్తుడు నాలో కలుస్తాడు ఉద్దవా! ఈ ప్రకారంగా నీవు నిష్ఠాగరిష్టుడవై, యోగనిష్ఠతో బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ ఇంతవరకూ నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని అంతరంగంలో నిల్పుకొని నన్ను ధ్యానించు. కలియుగం అంతమయ్యేదాకా బదరికాశ్రమంలో తపోనిష్టుడవై పరమాత్మ చింతనతో తరించు" అనిశ్రీ కృష్ణుడు ఆనతిచ్చాడు. పరమాత్ముని ఆదేశానికి పరమానందభరితుడైన ఉద్దవుడుశ్రీ కృష్ణుని పాదారవిందాలను తన హృదయంలో స్థిరంగా నిల్పుకొని పరమ పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళి యోగనిష్టలో నిమగ్నుడైనాడు" అని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పడంతో పరీక్షిత్తు తన్మయుశ్రీ కృష్ణుని ధ్యానంతో కొద్దిసేపు మౌనం వహించాడు. "పరీక్షిన్మహారాజా!" అని శుకుడు పిలవడంతో తేరుకొని మహర్షి వైకూ శాడు.


"మహాత్మా! మీరు చెప్పే విధానం అద్భుతం. ఇక కృష్ణుని మహిమలంటారా? అవి అత్యద్భుతాలు. ఆ దేవ దేవుని చరిత్రను ఎంత విన్నా తనివితీరదు. యోగీంద్రులు మెచ్చే, దర్శించే ఆ పరమాత్ముడి దివ్యమంగళ స్వరూపం ఎంత భావించినా కన్నుల నుండి వైదొలగదు. స్వామీ! నాదొక చిన్న సందేహం. సందేహం తీర్చి నన్ను కృతార్థుణ్ణి చేయండి. -


"అంతటను గృష్ణుడేమయ్యె? నద! డ యదువులెట్టులు వర్తించిరేర్పడంగ? ద్వారకా పట్టణంబెవ్విధముననుండె? మునిషత్రీ ప! యానతీ ముదముతోడ"


వైకుంఠానికి వెళ్ళడం శ్రీకృష్ణ బలరాములు


శుకమహర్షి పరీక్షిత్తును వాత్సల్య దృక్కులతోచూ స్తూ "మహారాజా!' బలరామ కృష్ణులు ఎక్కడకు వెళ్ళారు? యాదవులేమైనారని ఉత్సుకతతో అడిగావు. చెబుతాను సావధానంగా విను" అని చెప్పడం మొదలుపెట్టాడు. "ఆ విధంగాశ్రీ కృష్ణ పరమాత్ముడు క్రూరాత్ములు, అన్యాయ ప్రవర్తకులైన దుష్టులనందరినీ సంహరించి, న్యాయమార్గ ప్రవర్తకులు, నిర్మలాత్మకులు అయిన శిష్టులను సంరక్షించాడు. దుష్టశిక్షణ పూర్తి అయినందుశ్రీ కృష్ణుడు బలరామ సమేతుడై ద్వారకను వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అదూ శారు యాదవులు. స్వేచ్ఛా ప్రవర్తకులై మదిరను త్రాగి మత్తులై, మాత్సర్యం వహించి ఒకరితో ఒకరు కలహానికి దిగారు. మొదట్లో ఆకలహంసరదాగా సాగింది. రాను రాను నిజమైన యుద్దంగానే మారిపోయింది. రెండు పక్షాలుగా మారిపోయిన యాదవులు రథ గజ తురగ పదాతి బలాలతో అడ్డూ ఆపూ లేకుండా, కాలపరిమిత సుకోకుండా యుద్ధం చేయసాగారు. మహర్షి శాపబలం వల్ల బాగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలు తీసుకొని ఒకరినొకరు పొడుచుకోసాగారు. ఆ తుంగబెత్తాలు ప్రతిపక్ష వీరులను తాకేటప్పుడు, అవి వజ్రాయుధపు దెబ్బలై కఠినంగా తగులుతుండేసరికి యాదవులందరూ ఒకరి తరువాత మరొకరు నేలపై ఒరిగి పడిపోసాగారు. యుద్ధభూమి అంతా భీభత్సంగా తయారయింది. ఎక్కడమా సినా ముక్కలు ముక్కలుగా విరిగిపడిన మొండేలు, చీలిపోయి పడిపోయిన శరీరభాగాలు, కూలిపోయిన రథాలు, ఒరిగిపోయిన ఏనుగులు, వ్రాలిపడ్డ గుజ్జాలు, ప్రాణాలు కోల్పోయిన కాల్బలం, ఆయుధాలతో అసువులర్పించిన వీరాధి వీరులు - ఆ దృశ్యానిష్ఠూ సిన బలరామకృష్ణులు అందరూ మృతులైనందుకు నవ్వుకుంటూ ముందుకు నడక సాగించారు. అలా వాళ్ళిద్దరూ కొంతదూరం వెళ్ళిన తరవాత బలరాముడు, దారి మళ్ళించి తానొక్కడే ఒక త్రోవలో పోయి, యోగమార్గంలో ఆదిశేషుడిలో కలిసిపోయాడు. శ్రీ కృష్ణుడు మరోమార్గంలో వెళ్ళి కొంతసేపయిన తరవాత ఒక పొదమాటున విశ్రమించాడు. అలా పడుకొన్నవేళలో కృష్ణుడు ఒక కాలిమీద మరోకాలు పెట్టి అలా అలా ఆడిస్తూ వినోదిస్తుండగా ఒక వేటగాడు అటు పోతూ పోతూ దూరం నుంశ్రీ కృష్ణుని కాలు చూ సి అది లేడి యొక్క చెవి కాబోలని భ్రమచెందాడు. వేటాడటం వాడి లక్షణం కావటంతో కృష్ణుని కాలీ లు, లేడిచెవే అనుకొని వేటగాడు విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించాడు. వాడిగా ఉన్న బాణ తగలటంతో తల్లడిల్లిశ్రీ కృష్ణుడు హాహాకారం చేశాడు. ఆ శబ్దం విన్న లుబ్ధకుడశ్రీ కృష్ణుని చెంతకు వచ్చి తాను కొట్టింది. పరమాత్ముని అని తెలుసుకొని భయపడ్డాడు ముందు. తరవాత బాధపడ్డాడు. పశ్చాత్తాపంతో విలవిల్లాడాడు. అశ్రుధారలు ఆగటం లేదు. కారుతూనే ఉన్నాయి. తన పాపకార్యానికి ఎంతగానో చింతించాడు.శ్రీ కృష్ణుమా సి "ప్రభూ! నేను మహాపరాధం చేశాను. కుటిల వర్తనతో పాపకార్యాలు చేసే పాపాత్ముడిని. నన్ను మన్నిస్తావా దేవా?" అని అనేక విధాల ఆ దేవ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాడు. ఆ వేటగాడూ సి దీనబాంధవుడై శ్రీ కృష్ణ పరమాత్ముడు కరుణించి "లుబ్దకా! నీ వెందుకు దుఃఖిస్తున్నావు. ఇది నీ వృత్తి ధర్మం కదా! పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఎంత గొప్పవారికైనా అనుభవించ తప్పదు. చేసిన పాపం ఊరకనే పోదయ్యా! నన్ను బాధించటంలో నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. బాధపడకు" అని ఎంత చెప్పినా, ఆ వేటగాడి మనసు ఊరట చెందలేదు. "దైవం పట్ల మహాపరాధం చేసినవారు ఊరికే పోతారా? వారికి మంచి జరుగుతుందా? జరగదు. అంతేకాక దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నీడ దొరకదు. నేను ప్రాయోపవేశం చేయటమే ధర్మం" అని భావించి వేటగాడు పవిత్రమైన మనసుతో భగవంతుని ధ్యానిస్తూ, ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలాడు. అతని పవిత్ర భావానికి, అకుంఠిత భక్తికి మెచ్చిన శ్రీ కృష్ణుడు ఆ లుకుడికి మోక్షాన్ని ప్రసాదించాడు.


కొంత సమయం గడిచిన తరువాతశ్రీ కృష్ణుని రథసారథి అయిన దారుకుడు తన స్వామిని వెదుకుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. సర్వజుడు, మేరుపర్వతమంత ధైర్యం గలవాడు, క్రూర రాక్షస సంహారకుడు, మోహన సుందరాకారుడు అయిన శ్రీ కృష్ణుడు ఏకాగ్రచిత్తంతో ఏకాంతంగా ఉండటాన్ల శాడు. దారుకుని మనసులో కృష్ణుచూ డగానే అత్యంత భయ భక్తి విశ్వాసాలు నెలకొన్నాయి. ఆ పరమాత్ముని ఇంకా ఇంకా చూ డాలని క్షణకాలం తదేకంచూ శాడు. వినయంతో రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. దారుకుని భక్తి దారుకుని


కళ్ళల్లో కనబడింది దేవదేవుడికి. దారుకుడు ద్వారకాధీశుడికి మళ్ళీ ప్రణామాలు చేసి తన మనసులో మాట తన ప్రభువుకు విన్నవించాడు.


"నిన్ను డని కన్నులు నిష్ఫలములు నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు నిన్ను కానని దినములు నింద్యములగు కన్నులడూ చిమమ్మును గారవింపు" - 121 ప - ఏకాదశ స్కంధం - భాగవతము


"దేవా! నా బాధను వర్ణించలేను. నిన్ను దర్శించలేకపోయిన కళ్ళు - అవి ఎందుకు? నిష్ఫలాలు కదా! అలాగే నీ నామాన్ని పలకని నాలుక రసహీనమైనదనే చెప్పాలి. నిన్ను వర్ణించకపోతే ఆ నోరెందుకయ్యా? నీరసమైనది సుమా! నినుఛూ డని రోజులున్నాయే - అవి నింద్యాలు. ఆ దినాలను ఎంత తిట్టుకున్నా ఫలితం ఉండదు కదాశ్రీ కృష్ణా! నీ కళ్ళు పెద్దవి చేసి మమ్మల్ని దయత సి, మమ్మల్ని కాపాడు తండ్రి. - నాకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియటం లేదు. నా నోరు మూగపోయిందా అనిపిస్తోంది. ఈ దుఃఖాన్ని ఎవరాపగలరు ప్రభూ నీవు తప్ప! సముద్రమంత పెద్దదయిన యాదవ కులమంతా అంతరించిపోయింది. బంధువులు, గురువులు, పెద్దలు, స్నేహితులు - ఒకరేమిటి? అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ద్వారకకు పోయి, అక్కడ మిగిలి ఉన్న స్నేహితులతో ఏమని చెప్పగలను? వారినేమని ఓదార్చగలను?" అని దారుకుడు అంటూ ఉండగానే శ్రీ కృష్ణుని రథంలో ఉన్న దివ్యమైన ఆయుధాలు, రథానికి కట్టబడిన దివ్యమైన గుర్రలూ మాయమైపోయాయిశ్రీ కృష్ణుడు దారుకుని వైమా సి "దారుకా! నీవు వెళ్ళి అక్రూరునికి, విదురుడికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ వివరంగా తెలియజేయి. తరవాత అర్జునుడి దగ్గరకు వెళ్ళు. వెళ్ళి స్త్రీ జనాన్ని, బాలురను, పెద్దవాళ్ళను, వృద్ధులను తీసుకొని అతనిని హస్తినాపురానికి వెళ్ళమని చెప్పు. అక్కడ వారినందరినీ సురక్షితంగా ఉండేటట్లు డమని నామాటగా అర్జునునితో చెప్పు. వెళ్ళు" అని పంపించి వేశాడు శ్రీ కృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి హస్తినాపురానికి వెళ్ళమని చెప్పు. అక్కడ వారినందరినీ సురక్షితంగా ఉండేటట్లు డమని నామాటగా అర్జునునితో చెప్పు. వెళ్ళు" అని పంపించి వేశాడు శ్రీ కృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి, అర్జునుడికి కృష్ణుడు చెప్పమన్న మాటలన్నీ తెలియజెప్పాడు. తిరిగి ద్వారకకు వచ్చి అక్రూరుడితో జరిగినదంతా చెప్పాడు. అంతలోపలే ద్వారకా నగరమంతా జలంతో నిండి, మునిగిపోయింది. ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించలేని స్థితి ఏర్పడింది. ఎక్కరూ సినా జలమే. ఎటు సినా జలమే. సర్వం నీటిలో కూరుకుపోయింది. అప్పుడు పరమేశ్వరుడైశ్రీ కృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోయాడు. ఆ పరమాత్ముడు - నారదుడు మొదలైన దేవర్షి బ్రహ్మర్షి గణాలు, బ్రహ్మ రుద్రాది దేవతలు జయ జయ ధ్వానాలతో వెంటనంటి కదలి వస్తుండగా, నిజస్థానమైన వైకుంఠానికి కదలి వెళ్ళాడు. ఆ పరీక్షిన్మహారాజా! శ్రీ మన్నారాయణుని మహిమాన్వితమైన దివ్యవిగ్రహం సముద్ర ప్రాంతంలో జగన్నాథుని స్వరూపంగా ప్రకాశించింది" అని శుకమహర్షి చెప్పగా శ్రీ కృష్ణుని వైకుంఠ గమనం గురించి ఆలోచిస్తూ ఆ భగవానుని దివ్య పాదపద్మములకు మనసులోనే ప్రణమిల్లాడు పరీక్షిత్తు..


"నగుమొగమున్ సుమధ్యమునునల్లని మేనును లచ్చి కాటప టగునురమున్ మహాభుజములంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియుకలు వెన్నుడి మ్ముగ పొడసూపుఁగాత కనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్" - 124 ప - ఏకాదశ స్కంధం - భాగవతము


"చిరునవ్వులు చిందిస్తున్న ముఖము, ఆకర్షణీయంగా ఉన్న చక్కని సన్నని నడుము, మేఘ దీప్తులను విరజిమ్మే నల్లని శరీరముశ్రీ మహాలక్ష్మికి ఆటపట్టయిన సుందర వక్షస్థలము, మళ్ళీ మళ్ళీ్ళూ డాలనిపించే ఆజానుబాహువుల సోయగము, మెరుగులీనుతున్న కుండలాలతో ఒప్పుతున్న చెవుల కాంతి, మదపుటేనుగు నడకలోని సౌందర్యము, నిగనిగలాడే నల్లని కురులు, దయతో నిండిన చల్లకూ పులు కలిగి ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువు కళ్ళు మూసినా, తెరిచినా కనిపించుగాత!" స్థితికారుడై, సర్వజనులకు వరప్రదాతై, భక్తజనుల పాలిట కల్పవృక్షమై, యోగిజన హృదయారవింద నిలయుడై, ముక్తిదాతై విలసిల్లి శ్రీ కృష్ణపరమాత్ముని -


"ఈ కథ విన్నను వ్రాసిన ప్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం జేకొనియాయువు ఘనుడై లోకములోనుండు నరుడు లోకులు పొగడన్" - 123 ప - ఏకాదశ స్కంధం - భాగవతము


ఈ కథను విన్నా, వ్రాసినా సిరిసంపదలు కలుగుతాయి. యశస్సు లభిస్తుంది. అదృష్టం వెన్నంటి ఉంటుంది. దీర్ఘాయుష్మంతులవుతారు. వారి ఘనతను లోకులందరు పొగుడుతుండగా మహానుభావులై విరాజిల్లుతారు.


                                                    ఏకాదశస్కంధం సమాప్తం (సశేషం)