భక్తి యొక్క శక్తి


భక్తి యొక్క శక్తి _                                                                                                                              - యర్రమిల్లి విజయలక్ష్మి -


పూర్వం చంద్రభాగా నదీతీరంలో ఉన్న పవిత్ర పండరి క్షేత్రంలో దామాజీ, గుణాబాయి అనే దంపతులు నివసించేవారు. ఆ దంపతులిద్దరూ పండరినాథుని భక్తులు. సదా పాండురంగని చింతనలోనే కాలం గడిపేవారు. వారికి సంపదలు లేకపోయినా బాధపడేవారు కాదు. కాని సంతానభాగ్యం లేకపోవటం మాత్రం ఎంతో బాధించేది. నిత్యం భగవత్సేవలో బతికే తమని భగవంతుడెప్పటికైనా దయ చూపకపోతాడా అని ఆయన అనుగ్రహం కోసం నమ్రతతో ఎదురు చూడసాగారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు నదీతీరంలో వారికి ముత్యపుచిప్పలో చిన్న శిశువు లభించాడు. వారా అద్బుతబాలుని భగవంతుని ప్రసాదంగా భావించి అమితానందంతో నామదేవుడు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ పుణ్యమూర్తుల శిక్షణలో నామదేవునికి బాల్యం నుండీ పాండురంగని పట్ల భక్తి పెరగసాగింది.


ఒకరోజు దామాజీ పనిమీద పొరుగుగ్రామం వెళ్ళవలసి వచ్చింది. కొడుకుతో "నాయనా నేను పనిమీద పొరుగు గ్రామం వెడుతున్నాను. ఈరోజుకి పాండురంగడి పూజ నువ్వే చేయాలి. కావలసిన పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని భక్తిశ్రద్ధలతో దేవుని పూజచెయ్యి. లో చూ స్తున్నావుగా నేను ఎట్లా చేస్తున్నానో. అలాగే చెయ్యాలి. పూజలో ఏ విధీ మరువకూడదు సుమా" అని హెచ్చరించి వెళ్ళాడు. తండ్రి పూజ చేస్తుంటే శుచిగా పక్కన కూర్చుని చూడటమే తప్ప - నామదేవుడు తాను స్వయంగా ఎప్పుడూ పూజ చెయ్యలేదు. ఈ రోజు నాన్నగారు తనకా పని అప్పగించినందుకు ఆ బాలుడెంతో సంబరపడ్డాడు. తెల్లవారు ఝామునే వేచి స్నానాదికాలు ముగించుకుని శుచిర్భూతుడై పూజకుపక్రమించాడు. చక్కగా కావలసినంత సామగ్రినంతా ఏర్పాటు చేసుకుని తండ్రి చేసే పూజావిధానాన్ని అనుసరిస్తూ భక్తితో చక్కగా షోడశోపచారాలతో పూజ చేశాడు. నివేదనగా పాత్రలో మధురమైన పాయసాన్ని స్వామికెదురుగా పీఠం పైన ఉంచి ఆరగించమని ప్రార్థించాడు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ప్రార్థించినా స్వామి అట్లే నుంచున్నాడు. కాని ఎంతసేపటికీ స్వామి నివేదన వంక కన్నెత్తూ డనైచూ డటం లేదు.


"ఆహారం తీసుకో స్వామీ... తిను స్వామీ" అని చెప్పి పసివాడు అలసిపోయాడు. తనవల్ల ఏదో తప్పు జరిగింది. పూజలో ఏదో అపచారం జరిగింది. అందువల్లే స్వామి కోపగించాడు. తను అర్పించింది ఆరగించటం లేదు అన్న ఆవేదనతో "స్వామీ! నేనేమైనా తప్పు చేస్తే మన్నించు. ఆహారం భుజించు స్వామీ... నువ్వు తినకపోతే నా పూజలో ఏదో లోపముందని నా తండ్రి నన్ను దండిస్తాడు" అంటూ స్వామి పాదాల మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడవసాగాడు. "తీను స్వామీ... తిను స్వామీ" అని మతో ప్రాధేయపడి - ప్రార్థించి - ప్రార్థించి అలసి సొలిసిపోయిన పసివాణ్ణిచూ సి స్వామి కరుణతో చలించిపోయాడు. నిజరూపంతో వచ్చి బాలుణ్ణి ఆలింగనం చేసుకుని కన్నీరు తుడిచి మతో భక్తితో అతడిచ్చిన నైవేద్యాన్ని తృప్తిగా భుజించాడు. ఈ విషయం తెలుసుకున్న దామాజీ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ ప్రహ్లాదుడిలాగ నిర్మలమైన భక్తితో ఆ భక్తవరదుని ప్రసన్నం చేసుకుని ప్రత్యక్షం చేసుకున్నాడని ఆనందభరితుడయ్యాడు.


నామదేవుడు ఎదుగుతున్న కొద్దీ అతని భక్తి కూడా అనన్యంగా పెరుగుతూ వస్తోంది. అతనికి పాండురంగడు తప్ప అన్యదైవం తెలియదు. తీర్థ, క్షేత్ర, దైవప్రాశస్త్యం కలిగిన పండరీపురం తప్ప మరో క్షేత్రం తెలియదు. నిత్యం ఉభయ సంధ్యలలో భీమరథిలో స్నానం చేసి - రుక్మిణీ సమేతుడై, కటిహస్తుడై నిలిచి ఉన్నశ్రీ రంగని సేవించటం తప్ప మరో వ్యాపకం తెలియని పరమభక్తుడాయన. ఒకసారి జ్ఞానదేవుడనే భక్తుడువచ్చిపరమభాగవతోత్తముడైన నామదేవునితో కలిసి తీర్థయాత్రలు చెయ్యాలని కోరుకున్నాడు. రుక్మిణీ పాండురంగణ్ణి విడిచి తానెక్కడికీ రాలేనని నామదేవుడు ఆ విగ్రహాలను కౌగిలించుకుని భోరున ఏడ్చాడు. నామదేవుడు, జ్ఞానదేవులిద్దరూ కూడా తన అనన్యభక్తులే. "జ్ఞానదేవా... నామదేవుడు అమాయక భక్తుడు. నన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడకు వెళ్ళినవాడు కాదు. మా సంబంధం తల్లీబిడ్డల వాత్సల్యం. ఒకర్ని వదిలి మరొకరం ఉండలేము. నామదేవుని నీతో యాత్రలకు తీసుకువెళ్ళు. కానీ జాగ్రత్త సుమా అని చెప్పి రంగనాథుడే నామదేవుని జ్ఞానదేవునికి అప్పగించి వెళ్ళి రమ్మన్నాడు. కానీ నామదేవుడు తన సన్నిధి నుంచి వెళ్ళిన తరువాత పాండురంగడు నామదేవునిపై బెంగపెట్టుకుని దీనంగా ఉండటరూ సిన లక్ష్మీదేవి "స్వామీ! ఇదేమిటి? ఒక భక్తుని కోసం ఇలా దిగులు పడుతున్నారే... ఆశ్చర్యంగా ఉంది" అంది. "దేవీ! నా పరమ భక్తుడు నామదేవుడు. తన సర్వం నేనే అని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు. అతనికి అన్ని బాంధవ్యాలూ నేనే. అతడు నాకత్యంత మమయుడు. నా అంతరంగ భక్తుడు. అతడెట్లా ఉన్నాడో నన్ను వదిలి. నేను మాత్రం అతణ్ణి వదిలి ఆనందంగా ఎలా ఉండగలను చెప్పు?" అన్నాడు. -


జ్ఞానదేవ్, నామదేవులిద్దరూ తీర్థయాత్రలు చేస్తున్నారు. ఏ తీర్థాన్ని సేవించినా, ఏ క్షేత్రాన్ని సందర్శించినా నామదేవుడి కదంతా పండరిపురమే. పండరీనాథ దర్శనమే. అతని భావమంతా తన స్వామిపైనే. అలా యాత్రలు సాగిస్తుండగా మార్గమధ్యంలో ఒకచోట వారికి దాహం వేసింది. నీటికోసం సమీపంలో కనిపించిన బావి దగ్గరకు వెళ్ళారిద్దరూ. కానీ బావిలో నీరు అగాధంలో ఉంది. అందుబాటులో లేదు. లోపలికి దిగటానికి మెట్లు కూడా లేవు. జ్ఞానదేవుడు యోగమహిమ కలవాడు కనుక వెంటనే పక్షిరూపం ధరించి బావిలోకి వెళ్ళి నీరు తాగి వచ్చాడు. "నామదేవా నా యోగశక్తితో నిన్ను కూడా పక్షిగా మారుస్తాను. వెళ్ళి కావలసినన్ని నీళ్ళు త్రాగిరా" అన్నాడు. నామదేవుడు నవ్వి "మిత్రమా! నా పాండురంగడు నాతో ఉండగా నేను పక్షిగానో, పిట్టగానో ఎందుకు కావాలి? నాకు కావల్సిందేదో నా దేవుడే ఇస్తాడు. నన్ను మనిషిగానే ఉండనియ్యి " అని ఆర్తితో భగవన్నామ సంకీర్తన చేయసాగాడు. తన్మయావస్థలో కనులరమోడ్చి భక్తితో సంకీర్తనం చేస్తుండగా బావిలో అట్టడుగు అగాథంలో ఉన్న నీరు పైకి ఉబికి పొంగి వచ్చిందిచూ డు జ్ఞానదేవా! నా పండరీ ప్రభువు దయ! కావలసినన్ని నీరు త్రాగు. పక్షిగానో, పిట్టగానో మారవలసిన పనిలేదు" అన్నాడు నామదేవుడు.


జ్ఞానదేవుడికి నామదేవుడి భక్తి యొక్క శక్తి అర్ధమైంది. "నామదేవా! నీ పేరుని సార్థకం చేసుకున్నావు. నా జ్ఞానం కన్నా నీ నామమే మహిమాన్వితమైనది" అని ప్రశంసించాడు. అదే నిజమైన భక్తి. తన్మయస్థితి. భగవద్భక్తులు విశ్వాసంతో ఆత్మనివేదన చేసుకోవాలి. ఆత్మనివేదనమంటే తనకు తాను ఏ షరతులు కోరికలు లేకుండా భగవంతునికి సమర్పణమవటం. ఇదే అనన్య - అన్యమెరుగని భక్తి. అటువంటి భక్తుల యెడ భగవంతుడు కూడా వారి మనోగతంతో పాటు నడుస్తాడు. అందుకే పరమ భాగవతోత్తముడు నామదేవుడు భక్తులందరికీ ఆదర్శప్రాయుడు. .     


                                          నా పాండురంగడు నాతో ఉండగా నేను పక్షిగానో, పిట్టగానో  ఎందుకు కావాలినాకు కావల్సిందేదో నాదే డే ఇస్తాడునన్ను మనిషిగానే ఉండనియ్యి" అని ఆర్తితో భగవన్నామ సంకీర్తన చేయసాగాడు.


. .