శ్రీ విష్ణు మహాపురాణం


శ్రీ విష్ణు మహాపురాణం                          - కిడాంబి నరసింహాచార్య |


చతుర్థాంశము - తృతీయ అధ్యాయః


ఇకనుండి మాంధాత పుత్ర సంతతిని గూర్చి చెబుతున్నాము. మాంధాత తనయుడు అంబరీషుడు - అతనికి యవనాశ్వుడు - అతనికి హారీతుడు. అందువలన ఆ అంగీరసులంతా హారీత గోత్రులు. పాతాళంలో మానేయులనే గంధర్వులు ఆరు కోట్లు ఉండిరి. వారు సమస్త నాగ కులముల దగ్గర ఉండే ప్రధాన రత్నములన్నీ అపహరించి నాగులకు రత్నాధిపత్యం లేకుండా చేశారు. ఆ గంధర్వుల బలంతో అవమానింపబడ్డ నాగులు, వారి నాయకులు అశేష దేవతలకు ప్రభువైన భగవంతుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతిని విని తామరల వంటి కనులు గల పరమాత్మ జలశాయి కళ్ళు తెరచి, నిద్ర ముగించుకోగా, పాములన్నీ నమస్కరించి చెప్పాయి. ఓ భగవన్, మాకు ఈ గంధర్వులతో భయమేర్పడింది. ఈ భయం పోయేది ఎట్లాగో చెప్పండి అని. భగవంతుడున్నాడు. ఆయన ఆది అంతములు లేనివాడు. పురుషోత్తముడు గదా అన్నాడిలా. మాంధాతకు చెందిన యౌవనాశ్వుడు, ఆతని పుత్రుడు, పురుకుత్సుడు, ఆతనిలో నేను ప్రవేశించి ఆ దుష్ట గంధర్వులను అందరినీ నశింపచేస్తాను అని. దానిని విని పాములు జలశాయి అయిన భగవంతుడు విష్ణువుకు నమస్కరించి తిరిగి నాగలోకానికి వెళ్ళారు. నాగాధిపతులు పురుకుత్సుని రప్పించటానికి నర్మద అను తమ చెల్లెలిని పురుకుత్సునికిచ్చారు. ఆ నర్మద ఈతనిని రసాతలానికి తీసుకెళ్ళింది. ఈ పురుకుత్సుడు రసాతలానికి వెళ్ళి భగవంతుని తేజస్సుతో తన పరాక్రమాన్ని వృద్ధి పొందించుకున్నాడు కనుక ఆ గంధర్వులందరినీ సంహరించాడు. తిరిగి తన రాజ్యానికి చేరాడు. ఆ నాగాధిపతులంతా నర్మదకు వరమిచ్చారు. నర్మదను స్మరిస్తూ ఆహారాదులు భుజించినవానికి సర్పవిష భయముండదు అని. ఇక్కడ నర్మదా స్తుతి శ్లోకము - నర్మదకు ప్రొద్దున నమస్కారము.


నర్మదకు రాత్రి నమస్కారము. ఓ నర్మదా! నీకు నమస్కారము. నన్ను విష సర్పాలనుండి రక్షించు అని అంటూ రాత్రి పగలు భుజించినవానికి, అట్లా పలికి రాత్రి పగలు చీకటిలోకి ప్రవేశించిన వానికి సర్పములు కనిపించవు. తిన్న ఆహారంలో విషం ఉన్నా అది అతనిని చంపదు. పురుకుత్సునకు సంతతి విచ్చేదము ఉండదని ఉరగపతులు నర్మదకు వరమిచ్చారు.


పురుకుత్సుడు నర్మదయందు త్రసదస్యుడనేవాణ్ణి పొందాడు. ఆతని పుత్రుడు అనరణ్యుడు. రావణుడు దిగ్విజయ యాత్రలో వీనిని చంపాడు. అనరణ్యుడి పుత్రుడు పృషదశ్వుడు. వానికి హర్యశ్వుడు పుత్రుడు. వానికి హస్తుడు - వానికి సుమనుడు - వానికి త్రిధన్వుడు. వానికి త్రయ్యారుచి. వానికి సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతునికే త్రిశంకుడని పేరు. పన్నెండు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడితే ఆ సందర్భంలో విశ్వామిత్రుని భార్యను, పిల్లలను పోషించటానికి, ఛండాలుర నుండి ఎలాంటి దానాలు తీసుకోకుండా ఉండడానికి, గంగాతీరంలో మర్రిచెట్టుకు మృగమాంసాన్ని ప్రతిరోజు కట్టేవాడు. అందుకు సంతసించి విశ్వామిత్రుడు త్రిశంకువు సశరీరంగా (ఈ దేహంతోనే) స్వరానికి పంపాడు. త్రిశంకువునకు హరిశ్చంద్రుడు పుత్రుడు. అతనికి లోహితాస్యుడు. అతనికి హరితుడు. వానికి చంచువు. చంచువునకు విజయ వసుదేవులని పుత్రులు కలిగారు. విజయునకు రురుకుడు, వానికి వృకుడు సంతానము. వృకునకు బాహువు. ఈ బాహువు హైహయతాల జంఘువుల చేతులలో యుద్ధంలో ఓడిపోయి, గర్భిణి యైన భార్యతో కూడి వనానికి వెళ్ళాడు. ఆమెకు, ఆమె సవతి గర్భం అట్లే నిలిచి ఉండుట కొరకు (సంతానం కలగకుండా ఉండాలని) విషాన్ని ఇచ్చింది. అందువల్ల ఆమె గర్భం ఏడు సంవత్సరాలు అలాగే ఉండిపోయింది.ప్రసవించలేదు.ఆ రాజు బాహువుడు పెద్దవయసు వాడై ఔర్వుని ఆశ్రమ సమీపంలో చనిపోయాడు. ఆతని భార్య చితిని పేర్చుకుని భర్తతో పాటు ఆ చితిలో సహగమనం చేయదలచింది. అప్పుడు గడిచిన, గడుస్తున్న, రాబోయే అనగా త్రికాలవేదియైన, భగవత్స్వరూపుడైన ఔర్వుడు తన ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఇట్లా అన్నాడు.


చాలు చాలు ఈ చెడు పని చేయటం. అఖిల భూమండలానికి పతియైనవాడు, చాలా వీర్య పరాక్రమములు కలవాడు, అనేక యుద్ధాలు చేయబోయేవాడు, శత్రుపక్షాన్ని నాశనం చేసేవాడు అట్టి చక్రవర్తి నీ గర్భంలో ఉన్నాడు. ఇట్లాంటి అతి సాహసమైన పనిని నీవు చేయరాదు అని పలికినాడు. అప్పుడు ఆమె సహగమనం చేయటం ఆపింది. ఆ మహరియే ఆమెను తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు. అక్కడ కొద్దిరోజుల్లోనే, ఆ విషంతోనే అతి తేజస్వి యైన పిల్లవాడు జన్మించాడు. అతనికి ఔర్వముని, జాతక కర్మాది క్రియలు చేసి సగరుడని పేరు పెట్టాడు. ఆ పిల్లవానికి ఉపనయనం చేసి వానికి వేద శాస్త్రాలను, ఆగ్నేయాస్త్రాన్ని, భార్గవాస్త్రాన్ని నేర్పాడు. తెలివి కలిగినాక తల్లిని అడిగాడు. అమ్మా! మనం ఇక్కడ ఉండడమేమిటి? నా తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తుంటే తల్లి అంతా చెప్పింది.


అప్పుడు తండ్రి రాజ్యాన్ని అపహరించారని కోపంతో హైహయ తాలసంఘులను చంపాడు. శక, యవన, కాంభోజ, పారద, పప్లవులు చంపబడుతుంటే వారు తమ కులగురువైన వసిష్ఠుని శరణు వేడారు. వసిష్ఠుడు వారిని బ్రతికుండగా చచ్చినవారిగా చేసి సగరునితో అన్నాడు. ఓ వత్సా! ఈ బ్రతికి చచ్చిన వాళ్ళను తిరిగి చంపటం అనవసరం. వీరిని నేనే నీ ప్రతిజ్ఞ నెరవేరేందుకు తమ ధర్మమైన బ్రాహ్మణ సంగం (సహవాసం) లేకుండా చేశాను. సరే అని ఆ గురువు మాటకు సంతోషించి వారి వేషాన్ని మార్చేశాడు. యవనులకు తల గొరిగించి, శకులకు సగం తల గొరిగించి, పారదులక్రమే లాడే వెంట్రుకలు ఉండేటట్లు చేసి పప్లవులకు మీసాలు ఉండేట్టు చేసి వేదాధ్యయనం లేకుండా, హోమాధికారం ఉండేట్టు చేసి, వారిని ఇంకా ఇతరులను అట్లే చేసినాడు. వారు తమ ధర్మాన్ని వదిలినందువలన బ్రాహ్మణులు వీరిని విడిచారు. వీరు మ్లేచ్చులైనారు. సగరుడు కూడా తన స్థానానికి వచ్చి తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఏడు దీవులు గల ఈ భూమండలాన్ని చక్కగా పాలించాడు.


విష్ణుపురాణం చతుర్థాంశలో మూడవ అధ్యాయము సమాప్తం చతుర్థాంశము నాల్గవ అధ్యాయము


శ్రీ పరాశరులు చెబుతున్నారు - సగరునకు ఇద్దరు భార్యలు. ఒకరు కాశ్యపుని కూతురు సుమతి, రెండవవారు విదర్భరాజు కూతురు కేశిని. వారలు సంతానాన్ని పొందటానికి తలచి ఔర్వుడు గొప్ప సమాధిలో ధ్యానం చేస్తూ వారితో ఆరాధింపబడి వారలకు వరమిచ్చాడు. ఒకతె వంశాన్ని నిలిపే ఒక కొడుకును వరంగా పొందింది. మరొకతె ఆరువేల మంది కంటుంది అని ఇద్దరిలో ఎవరికి ఏది ఇష్టమో దానిని తమ ఇష్టపూర్తిగా పొందవచ్చునని పలుకగా కేశిని ఒక పుత్రుని కోరింది. సుమతి ఆరువేల మంది పుత్రులను కోరింది. అలాగే అని అన్నాడు ఔర్వుడు. కొద్దిరోజుల్లోనే కేశిని అసమంజసుడు అనే ఒక పుత్రుని కన్నది. కాశ్యపుని బిడ్డకు సుమతికి అరువది వేల మంది పుత్రులు జన్మించారు. అసమంజసుని నుండి అంశుమంతుడు జన్మించాడు. అసమంజసుడు బాలుడు. చిన్నతనం నుండే చెడు నడవడి కలవాడు. తండ్రి వీడు చిన్నపిల్లవాడు. పెద్దవాడైతే బుద్ధిమంతుడౌతాడని అనుకున్నాడు. అట్లా కూడా వయసు పెరిగినా దుర్మారుడైనరదువల్ల తండ్రి వానిని విడిచిపెట్టాడు. ఆ అరవైవేల పుత్రులు అసమంజసుని అనుసరించి ఈ సగరులు యజ్ఞాలకు దూరమైనవారు. దేవతలు లోకంలో సన్మార్గం కొరకు సకల విద్యా స్వరూపుడైన ఏ దోషములు లేని భగవంతుడైన పురుషోత్తముని అంశ యైన కపిల మహరిని ఆశ్రయించి అందుకై అర్థించారు.


ఓ భగవన్! ఈ సగర తనయులు అసమంజసునిలా ప్రవర్తిస్తున్నారు. చెడు నడవడికను అనుసరించే వీరితో లోకం నిలుస్తుంది. బాగా బాధింపబడి లోకరక్షణ కొరకు భగవంతుడు ఈ లోకంలో జన్మించాలి అనగా విని ఆ కపిలుడు వీరు త్వరలోనే నశిస్తారని అన్నాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగాన్ని ఆరంభించాడు. అశ్వమేధ అశ్వాన్ని సగరపుత్రులు వెంటనంటి ఉండగా ఎవడో దొంగిలించి భూ రంధ్రంలోనికి ప్రవేశించాడు. పిదప ఆ సగర పుత్రులు గుర్రపు గిట్టల గమనాన్ని తెలుసుకోవటానికి భూమిని ఒక్కొక్క యోజనాన్ని తవ్వారు. పాతాళంలో తిరుగుతున్న గుర్రాన్ని ఆ రాకుమారుడూ శారు. అక్కడ ఉన్న భగవంతుడైన, మేఘాలు లేని శరత్కాలంలోని సూర్యునిలా వెలుగొందుతున్న వానిని, తల వంచుకున్న వానిని కింద అన్ని దిక్కులను ప్రకాశింప చేస్తున్న గుర్రాన్ని దొంగిలించిన కపిల మహరినూ చారు. వారు ఆయుధాలు ధరించి, దుర్మార్తులు "వీడుమాగుర్రాన్ని దొంగిలించిన అపకారి. యజ్ఞాన్ని విఘ్నమొనర్చినవాడు, చంపండి ఈ దొంగను చంపండి" అని అంటూ పరిగెత్తారు. పిదప ఆ భగవాన్ కపిల మహర్షి కొద్దిగా కొద్దిగా వంకర పులతూ డబడగా, తమ శరీరం నుండి పుట్టిన అగ్నితో కాల్చబడుతూ ఆ సగరులు మరణించారు. సగరుడు కూడా తెలుసుకొని, గుర్రాన్ని అనుసరించిన పుత్రుల బలాన్ని తెలుసుకొని కపిలుని తేజస్సుతో వారు దగ్గమగుట తెలుసుకొని అసమంజసుని పుత్రుడైన అంశుమంతుని గుజ్రాన్ని తేవటానికి నియోగించాడు.


ఆతడు సగర తనయులు తవ్విన మార్గంలో వెళ్ళి కపిలుని చేరి భక్తితో తలవంచి కపిలుని స్తుతించాడు. అప్పుడు ఆ కపిలుడు అతనితో అన్నాడు. వెళ్ళు మీ తాతగారికి ఈ గుజ్రాన్ని ఇవ్వు. వరమడుగు. నీ పుత్రుని పౌత్రులు స్వర్గం నుండి గంగను భూమికి చేరుస్తారు అని. అంశుమంతుడు కూడా చనిపోయిన బ్రహ్మదండంతో హతులైన నాపితరులకు, స్వరం వెళ్ళే యోగ్యత లేనివారికి, స్వర్గాన్నికూర్చే వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. ఆ మాట విని అతనితో మహర్షి అన్నాడు. ఇప్పుడు చెప్పా కదా నీ పౌత్రులు స్వర్గం నుండి గంగను తెస్తారని, ఆ నీటితో వీరి ఎముకలు బూడిదను తాకితే వీరు స్వర్గానికి పోతారు. విష్ణు పాదాంగుష్ఠము నుండి వెల్వడిన జలానికి ఈ మాహాత్మ్యముంది. అది స్నానం మొదలైన అనుభవాల్లో ఇష్టంగా తగలటం మాత్రమే ఉపకారకం కాకుండా ప్రాణం పోయాక కూడా తం యొక్క బొక్కలు, చర్మము, కేశాదులు తగిలితే శరీరంలో పుట్టినవైనా గంగలో పడితే ఆ శరీరంగల ఆత్మను స్వర్గానికి తీసుకువెళ్తుంది వెంటనే అని అన్నాడు. ఆతడు నమస్కరించి గుజ్రాన్ని తీసుకొని తాతగారి యజ్ఞానికి వచ్చారు. సగరుడు అశ్వాన్ని పొంది ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. సాగరుడైన ఆత్మజునిప్రీ తితో పుత్రునిగా రాజ్యంలో ఉంచాడు. ఆ అంశుమంతునికి దిలీపుడు పుత్రుడు. దిలీపునకు భగీరథుడు. ఈతడు గంగను స్వర్గం నుండి భూమిపైకి తెచ్చి గంగకు భాగీరథి అనే పేరు వచ్చేట్టు చేశాడు. భగీరథునకు సుహోత్రుడు, వానికి శ్రుతుడు, అతనికి నాగుడు - పిదప అంబరీషుడు, ఆతని పుత్రుడు సింధుద్వీపుడు, అతనికి అయుతాయువు. అతనికి ఋతుపర్లుడు. ఈతడు నలునికి సహాయపడి పాచికల హృదయాన్ని తెలుసుకొనువాడైనాడు. ఋతుపర్లుని పుత్రుడు సర్వకాముడు. తర్వాత సుదాసుడు. ఆతని పుత్రుడు సౌదాసుడు. ఈతనికే మిత్ర సహుడని పేరు. ఆతడు అడవిలో వేటకై తిరుగుతూ రెండు పులులమా చాడు. అవి ఆ వనంలో మృగాలు (లేళ్ళు) లేకుండా చేశాయని తలచి రెంటిలో ఒకదానిని చంపాడు. అది మరణిస్తూ భయంకరాకారంతో, భయంకరమైన ముఖంతో రాక్షసుడుగా మారింది. రెండవవాడు నీకు ప్రతిక్రియ చేస్తానని వాడు కన్పించకుండా పోయాడు. కొంతకాలం గడువగా సౌదాసుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక ఆచార్యుడు వసిష్ఠుడు వెళ్ళిపోయాక ఆ రాక్షసుడు వసిష్ఠుని రూపంలో వచ్చి నాకు నరమాంస భోజనం కావాలని, దాన్ని ఏర్పాటు చేయమని క్షణంలో వస్తానని ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. తిరిగి వంటవాని వేషంలో వచ్చిరాజాజ్ఞతో మనిషి మాంసాన్ని సంస్కరించి రాజుకు ఇచ్చాడు. ఆ రాజు బంగారు పాత్రలో మాంసాన్ని తెచ్చి వసిష్ఠుని రాకకై ఎదురు డసాగాడు. వచ్చిన అసలు వసిష్ఠునకు ఆ మాంసాన్ని సమర్పించాడు. ఆతడు ఆలోచించాడు - ఈ రాజు చెడు నడవడి ఎంతటిది. ఈతడు ఈ మాంసాన్ని నాకిస్తున్నాడు. ఇది దేనికి చెందినది అని ధ్యానంతో చాడుఅది నరమాంసమని తెలుసుకున్నాడు అందువల్ల కోపంతో వసిష్ఠుడు రాజును శపించాడు. మాలాంటివారు ఇట్టిదానిని తినకూడదు. తపస్వులకు పెట్టకూడదని తెలిసి, నాకు నరమాంసం పెట్టావు కనుక నీకు దీనియందే కోరిక కల్గుగాక అని శపించాడు. రాక్షసులకే నరమాంసఖీ తికదా. పిదప ఆ రాజు కూడా మీరే చెప్పారు కదా అని అనగా, ఏమి నేను చెప్పానా? అని వసిష్ఠుడు అనగా తిరిగి సమాధినంది, సమాధిలోని జ్ఞానంతో జరిగింది తెలుసుకున్నాడు.                      సశేషం....