భగవానుడు అన్వేషించే మూడు రకాల సుకృతములు

భగవానుడు అన్వేషించే మూడు రకాల సుకృతములు


                                                                    శ్రీ భాష్యం అప్పలాచార్యులు


పరమాత్మ మూడు రకములైన సుకృతములచూ చి గుణదోషము కలవారిని రక్షిస్తాడట.


1. అనుషంగిక సుకృతము: అనుకోకుండా వచ్చే పుణ్యము. దూడ తప్పిపోయినప్పుడు దానికోసం వెదుకుతూ ఆలయానికి వెళ్ళి దాని వెంట పరిగెడుతూ మూడుసార్లు ప్రదక్షిణం చేసిన యజమానికి కలిగే సుకృతము. ఇది ఆ యజమాని పుణ్యముగా చేయడు. కానీ పుణ్యమైన పని జరిగింది కాబట్టి భగవానుడు లెక్కలోకి తీసుకుంటాడు.


2. ప్రాసంగిక సుకృతము: మాటలలో శ్రీ రామ, నారాయణశ్రీ రంగము, వేంకటాచలము మొదలైన పేర్లు అనుకోకుండా వేరొక పనిమీద పలికినను పుణ్యనామముల కీర్తించిన సుకృతము క్రింద భగవానుడు లెక్కలోకి తీసుకుంటాడు.


3. యాదృచ్చిక సుకృతము: తన వస్తువులను తాను కాపాడుకోవటానికి కూర్చుని ఉన్నప్పుడు భగవద్భక్తుల యొక్క వస్తువులు కూడా కాపాడబడినచో అది యాదృచ్ఛిక సుకృతము.


ఈ విధంగా మూడు సుకృతములచూ చి పరమాత్మ మనలను రక్షించే ఉదార హృదయుడు. దోషములలో కూడా గుణముతుమే చెడి అనసూయకుడు పరమాత్మ. . E రాముడు ఈ విధంగా ప్రజలను కాపాడినవాడు. అందుకే అనసూయకుడు. అనగా గుణములను దోషములుగా ఎత్తి చూ పనివాడు. అంటే దోషములను కూడా గుణములుగా భావించేవాడు. ఎలా? అడవికి వెళ్ళే సమయంలో తండ్రి యందు కానీ, రేపించిన కైకయందు కానీ ఒక్క దోషము కూడ తలపని వాడశ్రీ రాముడు. పరబ్రహ్మ స్వరూపము కాబట్టే రాముడు అలా ఉండగలిగాడు. భగవానునికి విముఖుడై ఉన్న జీవుడు చేయుచున్న పనులలో సుకృతముగా పేర్కొనదగినవి తానే ఏరి వారిని రక్షిస్తాడు. చెడ్డపనులే తప్ప మంచి పనులు చేసే అలవాటు లేనివానిని రక్షించుట ఎలా అని భగవానుడు పై మూడు సుకృతాలుగా అన్వేషిస్తాడు.