కర్తవ్య నిర్వహణే మన లక్ష్యం
2002వ సంవత్సరం విజయదశమి రోజున శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పీఠము"ను స్థాపించి తిరుమలశ్రీ వేంకటేశ్వరునికి ప్రతి సంవత్సరము భక్తులందరిచే ధ్రా యించిన 7 కోట్ల జపమును సమర్పించుచున్నాము. 23-08-2019 నాడుశ్రీ వారికి 17వ పర్యాయముగ 7 కోట్ల జపమును సమర్పించి 18వ పర్యాయముగా 7 కోట్ల జప పుస్తకములను కోరిన భక్తలకు పంచుతున్నాము. ఈ కార్యక్రమానికి శక్తి, సాయము, సంకల్పము, సర్వము మా ప్రభు తిరుమల తిరుపతిశ్రీ వేంకటేశ్వరుడేనని మరొక్కమారు తెలియచేయుచున్నాము. నిమిత్తమాత్రులమైన మాచే ఆ దేవదేవుని సేవను తానే స్వయంగా చేయించుకొనుచున్నాడు. పీఠానిష్ణా రంభించిన 17 సంవత్సరములలో 17 పర్యాయములు 7 కోట్ల జపమును సమర్పించే శక్తిని ప్రసాదించినందులకు మా ప్రభువుశ్రీ వేంకటేశ్వరునికి శతకోటి ప్రణామాలను అర్పించుచున్నాము. మరియు మా జీవితాంతము ఈ సేవాభాగ్యాన్ని ఆటంకము లేకుండా ప్రసాదించవలసినదిగా ఫ్రార్థించుచున్నాము.
మానవునిగా పుట్టిన మనము ఏదేదో చేయాలని, ఏదో సాధించాలని, గొప్ప స్థాయికి ఎదగాలనే కోరికలు ఎన్నో ఉంటాయి. కాని అవి అన్నీ నిజజీవితములో సాధ్యపడవు. అనుకున్నది ఒకటి అయితే జరిగేది మరొక్కటి అవుతుంది. కొందరికి అనుకున్నట్లుగా జరిగితే మరి కొందరికి వ్యతిరేకంగా, మరికొందరికి సామాన్యంగా జరిగిపోతుంది జీవనం. ప్రతి సమయంలో మానవుడు చేయవలసింది ఒక్కటే. అదే ఆయా సమయాన తన ముందున్న కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించుట మాత్రమే. దాని ఫలము అతడు అనుభవించగలడు. ఆ ఫలము మన ఇష్టానుసారం కాకుండా ఆ భగవంతుని ఇష్టానుసారంగానే ఉంటుంది. ఇడ్రి యమైనా, @ యమైనా బాధపడక సంతోషంతో స్వీకరించుటే మన కర్తవ్యము. క్షణ క్షణానికి పరిస్థితులు మారుచుండును. నేడు మంచిగా కనిపించిన పని రేపు చెడ్డదిగా తోచును. ఏది మంచో ఏది చెడ్డదో తెలుసుకోలేని వారిని కాబట్టి పరిస్థితులను బట్టి ఆయా సమయాలలో ధర్మబద్దమైన నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించుటే మన కర్తవ్యం. ఇంతకు మించి మరేమి చేయలేము. ఎందుకంటే పరమాత్మని మనం అర్థం చేసుకోలేము. మన నావికుడు ఆయనే కాబట్టి మన ఎదురుగా ఉన్న కర్తవ్యాన్ని స్వయంగా ఆయనే నిర్ధారించారని ఆత్మసాక్షిగా నమ్మి ఆయన ఆజ్ఞను శిరసా వహించువాడు గొప్పవాడు. మానవుడు జన్మించునప్పటికే వాడు చేయుపని నిర్ధారించి ఉండునని పెద్దలు అంటారు. కాబట్టి ఏనాడూ జీవితం పట్ల అసహనము నొందక ఆనందముతో తృప్తిగా జీవించువాడే ధన్యుడు. లక్ష్మణుడు, రామానుజుడు ఇద్దరు ఆయా యుగాలలో పుట్టిన ఒకే అవతారం. కాని లక్ష్మణునికి భార్యయగు ఊర్మిళ, భర్తకు అనుగుణంగా ప్రవర్తించి ఆయన నిద్రను తాను ఆవహింపచేసుకుని లక్ష్మణునికి 14 సంవత్సరాలశ్రీ రామునికి సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించింది. ఇలా నిద్ర లేకుండా సేవ చేసే భాగ్యాన్ని పొందుటలో ఊర్మిళ పాత్ర తోడ్పడింది. ఇక రామానుజ అవతారములో ఈయన ఒక సన్యాసి కావలసి ఉంది. కావున ఈయన భార్య గయ్యాళిలాగ, ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో పోట్లాడునదిగ, చివరికి రామానుజునికి ఆమెను వదిలించుకోవాలనే స్థితికి తీసుకువచ్చి, భార్యను వదిలేసి సన్యాసాశ్రమమును స్వీకరించారు. తద్వారా లోకాన్ని రక్షించారు. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండునో మనమెరుగము. కావున తక్షణ కర్తవ్యమును ధర్మబద్ధంగా ఫలము ఆశించక నిర్వర్తించుట మన విధి.
వినా వేంకటేశం న నాథో న నాథః | సదా వేంకటేశం స్మరామి స్మరామి||
శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు పుల్లగూర్ల సాయిరెడ్డి (గోవిందదాసు)