శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంలోని ఉత్సవాలు - ప్రాముఖ్యత
శ్రీ వేంకటేశ్వర వైభవం
"వేదములే శిలలై వెలసినదీ కొండ - యేదెస ఋణ్యరాసులే యేరులైన దీ కొండ గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ - శ్రీదేవుడుండేటి శేషాద్రి యీ కొండ" అంటూ తిరుమల క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక తేజోవైభవాన్ని అన్నమాచార్యులు ఆవిష్కరించాడు.
"స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్ట వర్షిణమ్ దర్శనా న్ముక్తిదం చేశశ్రీ నివాసం భజే2నిశమ్" ఆ స్వామిని స్మరిస్తే చాలట! పాపాలన్నీ పోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలట! కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది. అటువంటిశ్రీ నివాస భగవానుణ్ణి నిరంతరం భజిస్తాను.
దేవాలయ పరిచయం శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చామూర్తియై స్వయంభువుగా వెలసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ ఆనందనిలయుని ఆలయ ప్రాంగణంలో అనేక దివ్యస్థలాలు, మండపాలు, అద్భుతశైలీ విన్యాసములతో విరాజిల్లడంతో పాటు, తిరుమలేశునితో పెనవేసుకున్న ఎంతోమంది భక్తుల మధుర జీవిత ఘట్టాల్నీ, తద్వారాఠీ నివాసుని భక్తవాత్సల్యాన్నీ, లీలలను నిక్షిప్తం చేసుకొని ఉన్నాయి. "తిరుమల" అనే పదం తిరుమలై అను తమిళ పదానికి రూపాంతరం. తిరు అనగశ్రీ అని, మలై అనగా శైలమని, తిరుమలై అనే శబ్దశ్రీ శైలం అనే అర్థంలో ప్రయోగింపబడుతోందని తెలుస్తున్నది. - శ్రీ వేంకటాద్రిని తిరు వేంకటాద్రి అని, తిరు వేంగడమని, శ్రీ వేంకటనాథుణ్ణి తిరు వేంకటనాథుడని, తిరు వేంగడనాథుడని పిలుస్తున్నారు. దక్షిణదేశంలో కన్యాకుమారి నుండి ఉత్తరాన తిరువేంగడం వరకు తమిళదేశమని క్రీ.శ.1వ శతాబ్దం నాటికే సంగమ వాజ్మయంలో సుప్రసిద్ధమైన లక్షణ గ్రంథం "తొల్కాప్పియమ్" పేర్కొంటున్నది. " ఋగ్వేదంలో దశమ మండలంలో వేంకటగిరి ప్రస్తావన ఉందని పెద్దలు చెబుతారు. బ్రహ్మపురాణం వేంకటాద్రి క్షేత్రం అత్యుత్తమమైందని, అచట అవతరించిన స్వామి వేంకటేశ్వరుడని పేర్కొంటున్నది. బ్రహ్మాండ-ఆదిత్య పురాణాలు వేంకటాద్రితో సమానమైన స్థానం ఈ బ్రహ్మాండం లోనే లేదని, వేంకటేశ్వరునితో సమానమైన దేవుడు ఇంతవరకు లేడు. ఇకముందు కూడా ఉండబోడని ప్రతిపాదిస్తున్నాయి.
సంహితలలో ఉత్సవ ప్రసక్తి వైదిక వాజ్మయంలో దేవాలయ పూజావిధానాలను గూర్చి విశదీకరించే గ్రంథాలలో పాద్మసంహితశ్రీ ప్రశ్న సంహిత, ఈశ్వర సంహిత, విష్వక్సేన సంహిత, మరీచి సంహితలు ప్రధానాలు. ఈ గ్రంథాలన్నింటిలోను ఉత్సవ శబ్ద స్వరూప వివరణ ఉంది. పాద్మసంహిత ఉత్+సవః = ఉత్సవః "సవ" అంటే సంసారికమయిన దుఃఖసముద్రం. ఆ దుఃఖసాగరాన్ని తరింపజేసేది ఉత్సవం. భగవద్భక్తులు ఉత్సవం ద్వారా దుఃఖాన్ని మరిచిపోయి ఆనంద సముద్రంలో మునిగి తేలియాడుతారు. ఈ విషయ వివరణే "సవఃసాంసారిక దుఃఖముత్తరనితదం భుగమ్ యష్టార ఇతి విద్యాంసో నిర్భువన్యుత్స వాహ్వయమ్" శ్లోకంలో కనిపిస్తుంది (10-67). శ్రీ ప్రసన్న సంహిత నిత్యారాధన కంటే భగవంతునికి సంతోషదాయకం అయింది ఉత్సవంప్రీ తిపాత్రుడయిన ఆ స్వామి అప్పుడే తన యొక్క అనుగ్రహ వీక్షణాలను భక్తాదుల మీద ప్రసరిస్తాడు. ఈ అంశం వివరణ. ఉత్సూతే హర్షం భగవతః ఇతి ఉత్సవం (30-8) అన్న వాక్యంలో వివరింపబడింది (10). ఈశ్వర సంహితలో "సవ" అంటే దుఃఖం. ఆ దుఃఖాన్ని పోగొట్టేదాన్ని ఉత్సవం అంటారు. . 'ఉ' అనగా ఉత్కృష్టమయినది. 'సవం' అనగా యజ్ఞం. పెద్దదైన యజ్ఞం ఉత్సవం అని మరీచి సంహితలో తెలపబడింది. స్వామికి సన్రీ తికరంగా భక్తాదుల అనుగ్రహ వీక్షణానికి ఆస్కారం కలిగించే ఉత్సవాలు ప్రతి ఆలయంలో జరుగుతుంటాయి. అవి రెండు రకాలు.
1. సామాన్య ఉత్సవాలు
2. సంవత్సరోత్సవాలు
నిర్దిష్ట దినాలలో చేయాలనే నియమం లేకుండా ఎప్పుడంటే అప్పుడు చేసే ఉత్సవాలు సామాన్య ఉత్సవాలు. ఈ ఉత్సవాలు మూడు రకాలు. అవి నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలు. నిత్యోత్సవమంటే ప్రతిరోజు ఆలయంలో జరిగే దేవతారాధన. ఒక కారణాన్ని ఉద్దేశించి జరుపబడే ఉత్సవం నైమిత్తికోత్సవం. "కామ" అంటే కోరిక. ఒక ధ్యేయాన్ని ఉద్దేశించి కోరి చేసే ఉత్సవం కామ్యోత్సవం అంటారు. సంవత్సర కాలంలో ఒకసారి జరుపబడే ఉత్సవాలు. ఇవేకాకుండా రోజుల్ని బట్టి ఉత్సవాన్ని పరిగణించే పద్ధతి కూడా ఉంది. పాద్మసంహితలో మాసోత్సవ, పక్షోత్సవ, ద్వాదశోత్సవ, నవరాత్రోత్సవ, పంచాహోత్సవ నిత్యోత్సవం అని దినసంఖ్యను బట్టి వివరణ ఉంది (10-22-23). అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైశ్రీ మన్నారాయణుడు అన్యజనులను అనుగ్రహించుటకు గానశ్రీ వేంకటాద్రి యందు శ్రీ నివాసునిగా స్వయం వ్యక్తమై విరాజిల్లుచున్నాడుశ్రీ స్వామి వారి సన్నిధిలో నిత్యకళ్యాణ పచ్చతోరణములుగా జరుగు ఉత్సవాదులు ఎన్నో ఎన్నెన్నో. స్వామివారి సన్నిధిలో జరుగు కొన్ని ఉత్సవ విశేషములను గూర్చి ఇక్కడ పేర్కొనబడుచున్నది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో వైఖానస ఆగమోక్త ప్రకారము అర్చనాది కైంకర్యములు, ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి.
"కలౌ వేంకట నాయకః" అన్న ప్రసిద్ధిని పొందిన దేవదేవుడు జగత్కళ్యాణ చక్రవర్తి తిరుమల గోవిందుడు. తిరుమల శ్రీ నివాసునికి ప్రతినిత్యమూ జరిగే ఎన్నో సేవల్లో... మరెన్నో ఉత్సవాల్లో వారి వైభవాన్ని తిలకించిన వారికి ఒక్కొక్క సేవలో ఒక్కొక్క సంతృప్తి. ఒక్కొక్క ఉత్సవంలో ఒక ఉత్సాహం. ఒక్కొక్క ఊరేగింపులో ఒక్కొక్క దివ్యానుభూతి. ఒక మైమరపు. ఒక తన్మయత్వం కలుగుతుంది. ఇలా భక్తులకు వింత వింతలుగా అనుభవాలను,అనుభూతులనుదివ్యాతిదివ్యంగా పంచుతూ ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవాలు, సేవలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. కనుకనే తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతితో పండుగనే. ప్రతిపూటా పాయసాలే. పరమాన్నాలే. సంవత్సరం పొడవునా అంటే 365 రోజుల్లో తిరుమలలో 450కి పైబడే ఉత్సవాలు, ఊరేగింపులు జరుపబడుతున్నాయి. వీటి సంఖ్య ఎప్పటికప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది. వీటిలో కొన్ని సేవలశ్రీ నివాసుని మూలమూర్తికి జరుగుతూ ఉండగా, అత్యధికంగాశ్రీ వారి ఉత్సవమూర్తి అయిశ్రీ మలయప్ప స్వామి వారికే నిర్వహింపబడడం విశేషం. - ప్రస్తుతం ఏడాది పొడవునార్రీ దేవి భూదేవులతో కూడివున్న శ్రీ మలయప్పస్వామివారికి జరుగుతూ ఉన్న అన్ని సేవలనుగూర్చి ఏకరువు పెట్టడం కూడా అంత సులభం కాదు. అయినా వాటిలో అతి ముఖ్యమైన వాటిని గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం.
నిత్య కళ్యాణోత్సవం
భక్తులు కోరిన సంతానం, వివాహాలు, ఉద్యోగాలు, గృహ నిర్మాణాది సర్వ శుభకార్యాలను సంపూర్ణంగా నెరవేర్చి, వారిచేత తనకు నిత్యకళ్యాణం చేయించుకోవడశ్రీ వేంకటేశ్వరస్వామికి భలే ఇష్టం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ దేవి, భూదేవులతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నిత్యమూ కళ్యాణోత్సవం జరుగుతుంది. 15వ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమయ్య ఏర్పాటు చేసిన ఈ నిత్య కళ్యాణోత్సవం నేటికీ నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది. తిరుమల క్షేత్రంలో భక్తులు అత్యధికంగా పాల్గొనే సేవ కూడా నిత్య కళ్యాణోత్సవం ఒక్కటే. కూటికే గడవని అతి పేదవారు మొదలుకొని, కోట్లకు పడగెత్తిన ధనవంతుల వరకూ అందరూ పాల్గొనే ఈ నిత్య కళ్యాణోత్సవంలో భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారికి ప్రతి సంవత్సరం ఉగాది నుంచి ఉత్సవాలు, ఊరేగింపులు ప్రారంభమవుతాయి. తెలుగు సంవత్సరాది పండుగను, తెలుగువారి ఇలవేలుపు అయినశ్రీ వేంకటేశ్వరుడు తెలుగువారి సంప్రదాయ రీతిలోనే జరుపుకుంటారు. ఉగాది రోజునశ్రీ వారి ఆలయంలో జరిగే వేడుకను "ఉగాది ఆస్థానం" అంటారు.
ఉగాది ఆస్థానం వగైరా ఉత్సవాలు
ఉగాది ఆస్థానం రోజుశ్రీ మలయప్పస్వావిశ్రీ దేవి భూదేవి సమేతంగా సర్వ శోభాయమానంగా వజ్ర వైఢూర్యాది అనేకమైన నగలతో అలంకరించుకొని బంగారు వాకిలి ముందున్న గంట మండపంలో తూర్పుముఖంగా సర్వభూపాల వాహనంలో వేంచేస్తారు. ఆ ప్రక్కనే మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా శ్రీ వారి సేనాపతి వస్తాడు. నివేదనాదులు అన్నీ అయిన తరువాత శ్రీ స్వామివారికి అర్చక స్వాములు పంచాంగ శ్రవణం శోభాయమానంగా చేయిస్తారు. సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, ఆదాయ వ్యయాలు వగైరా విషయాలన్నీ పంచాంగ శ్రవణం ద్వారాశ్రీ నివాసుడు తెలుసుకుంటాడు. ఆ తర్వాతశ్రీ స్వామి వారికి అక్షతారోపణ, కర్పూరహారతులు జరుగుతాయి. ఇదే ఉగాది ఆస్థానం. ఇంచుమించు ఇదే రీతిలో దక్షిణాయన పుణ్యకాలమైన కర్కాటక సంక్రాంతి (జులై 16) నాడు ఆణివార ఆస్థానం, దీపావళినాడు బంగారు వాకిలి ముందటశ్రీ మలయప్ప స్వామివారికి ఆస్థాన సేవలు జరుగుతాయి. ఇలా తొలిగా ఆస్థానం మొదలుశ్రీ మలయప్ప స్వామివారికి ప్రతిరోజు నిత్య కళ్యాణోత్సవం, వాహనసేవలు, సహస్ర దీపాలంకార సేవ వంటి నిత్యోత్సవాలు, విశేషపూజ, శ్రవణం, ఆరుద్ర వంటి నక్షత్రోత్సవాలు (మాసోత్సవాలు), వసంతోత్సవం, తెప్పోత్సవాలు వంటి వార్షిక ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఏడాదిపాటు ప్రతితో జరిగే అన్ని సేవలు, ఉత్సవాలు ఊరేగింపుల కంటె సంవత్సరంలో ప్రతి కన్యామాసంలో తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవ వైభవం మాత్రం తిరుమల పుణ్యక్షేత్ర చరిత్రలోనే పరాకాష్ఠ..