గురువు శిష్యుడు


 


గురువు శిష్యుడు


మొదట గురుని జూపి తుదకు తానగుపించి నిలను భక్తతతికి నీశ్వరుండు గురువే దైవమంచు నరుడు భావించిన వాంఛితార్ధమెల్ల బడయగలడు


వేదభూమి, జ్ఞానభూమి యైన భారతదేశంలో జన్మించిన ప్రతి బుద్ధిజీవి ఆముష్మికానందానికై తపన పడుతుంటాడు. భగవవంతుని సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుజ్యము అను నాల్గింటిలో ఒక దానిని పొందడమే నిజమైన ఆనందాన్ని పొందడం. పరమాత్మ నుండి విడివడి జీవాత్మగా ఆవిర్భవించిన లక్షలాది జీవులలో బుద్ధిజీవి మానవుడు. జన్మతః అతని బుద్ధిని అజ్ఞానమనే అంధకారము (మాయ) ఆవరించి యుంటుంది. ఆ మాయ పొరను తొలగించి జ్ఞానాంజనముతో చక్కని దృష్టినిచ్చి సత్యదర్శనం చేయించగలవాడు సద్గురువు. అందుకే పరమాత్మ ముందుగా పరబ్రహ్మ స్వరూపుడైన గురువును మనకూ పించి తరువాత మాత్రమే తా మానవుని జీవితంలో తల్లి తండ్రి తరువాత స్థానాన్ని గురువుకే ఇచ్చారు విజ్ఞులు. భగవంతుని స్థానం కూడా గురువు తర్వాతనే. ఒకవేళ శివుడు మనపై కోపగిస్తే, ఆ కోపాన్ని అణచివేసేమార్గాన్ని గురువు మనకు చెప్పగలడు. కాని దురదృష్టవశాత్తు మనలను గురువు కోపగిస్తే దానిని శమింపచేయడం శివునికి కూడా సాధ్యం కాదని ఆర్యోక్తి. గురుశిష్యుల సంబంధాలు ఉన్నతోన్నతంగా ఉండాలి. అపోహలు, అసత్యాలు, అక్రమ సంబంధాలు, అనైతిక వ్యవహారాలకు గురుశిష్యుల మధ్య తావు ఉండకూడదు.


పూర్వం ముల్లోకాలలోని ఐశ్వర్యం కోసం దేవదానవులకు పరస్పరం ఘర్షణ జరిగింది. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఇద్దరు పరస్పర వైరం కలిగినవారు. సురాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను శుక్రుడు తన వద్దగల మృతసంజీవినీ విద్యతో పునర్జీవితులను చేస్తున్నాడు. అందువల్ల రాక్షస యోధులు మళ్ళీ లేచి యుద్ధం చేసేవారు. అప్పటికి దేవతలు అమృతపానం చేయలేదు. బృహస్పతికి మృతసంజీవనీ విద్య తెలియదు. అందువల్ల దేవతలు మిక్కిలి విషాదాన్ని పొంది బృహస్పతి కొడుకైన కచుని వద్దకు వెళ్ళి "మన వద్ద మృత సంజీవనీ విద్య లేని కారనంగా మన వారంతా యుద్ధంలో మరణిస్తున్నారు.


కావున మృత సంజీవని దేవలయును శుక్రువలన ధృతి బడసి తప శీ విభవ! దాని బలమున గావంగా వలయు సురనికాయ బలంబున్


అని ప్రార్థన చేశారు. అంతేకాక నీవు బాలుడవు. నియవ్రత శీలుడవు. శుక్రాచార్యుని సేవించడానికి సమర్థుడవు. నీనడవడిక, దయ, ఆచారం, తీయని మాటలు, ఇంద్రియ నిగ్రహం వీటన్నింటి చేత శుక్రుని కుమార్తెయైన దేవయానిని సంతుష్టురాలిని చేస్తే ఆ విద్యను నిశ్చయంగా పొందగలవు" అన్నారు. శుక్రాచార్యుడు తన తండ్రికి విరోధి అని తెలిసినా దేవజాతి హితం కోసం కచుడు శుక్రుని వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి అంటూ తాను ఎవరో చెప్పాడు. "గురువైన మీ పట్ల నేను వేయి సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నన్ను శిష్యునిగా అంగీకరించగోరుతున్నాను" అన్నాడు. . వచ్చినవాడు తన శత్రువు కుమారుడని తెలిసి కూడా శుక్రుడు కాదనలేదు. పైగా కచుని వినయసంపదకు అచ్చెరువు చెందాడు. "నిన్ను నేను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే" అన్నాడు. కచుని తన శిష్యునిగా అంగీకరించాడు. కచుడు బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి శుక్రుని, దేవయానిని నిత్యము సేవిస్తూ తన గురు శుశ్రూషా కౌశలంతో వారిని మెప్పించి గురువుకు] తిపాత్రుడైన శిష్యుడైనాడు. దానవులు అతని గురించి తెలుసుకొని, బృహస్పతి పైన ఉన్న ద్వేషం వల్ల, మృతసంజీవనీ విద్యను రక్షించడం కోసం చేసిన ప్రయత్నంగా అడవిలో ఒంటరిగా గోవులను రక్షిస్తున్న కచుని చంపి, ముక్కలు ముక్కలుగా చేసి తోడేళ్ళకు వేశారు. సాయంకాలానికి కచుడు లేకుండానే గోవులు ఇంటికి రావడం చి దేవయాని కంగారుపడ్డది. కచుడు లేకుండా తాను జీవించలేనని తండ్రికి చెప్పింది. కూతురు మాటలను మన్నించిన శుక్రుడు దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని, సంజీవినీవిద్య ప్రయోగించి కచుడ్ని బ్రతికించాడు.


అటు తరువాత కొంతకాలానికి దేవయాని ఒకనాడు కచుణ్ణి పూలు తెమ్మని పంపింది. వనాలలో ఒంటరిగా తిరుగుతున్న కచుడిని దానవులు చంపి సముద్రజలాలలో కలిపారు. దేవయాని కోరికపైన శుక్రుడు మళ్ళీ కచుణ్ణి బ్రతికించాడు. మూడవసారి రాక్షసులు కచుణ్ణి చంపి తగులబెట్టి పొడిచేసి, మద్యంలో కలిపి శుక్రాచార్యునిచే త్రాగించారు. కచుని కోసం వెతికి వేసారిన దేవయాని కోరికపై మళ్ళీ మృతసంజీవనిని ప్రయోగించి అతడిని ఆహ్వానించాడు. గురువు పిలుపు అందుకొన్న కచుడు ఆయన ఉదరంలో ఉండి "పూజ్యుడా! నన్ను చంపి, దహించి, పొడిచేసిన దానవులు సురలో కలిపి నీచేత త్రాగించారు. నేను ప్రస్తుతం నీ ఉదరంలో ఉన్నాను. నన్ను రక్షించు" అని ప్రార్థించాడు. సురాపానం చేసినందువల్ల కలిగిన అనర్థాన్ని గుర్తించిన శుక్రుడు -


"పూర్వజన్మలో చేసిన పుణ్యము, మంచి చెడ్డలను గుర్తించు విచక్షణా జ్ఞానము మద్యపానం వలన నాశనమవుతుంది. కనుక నేటినుండి ఎవరైనా మద్యపానం చేస్తే పాపాసక్తి పెరిగి పతితులవుతారు" అని చెప్పి సురాపానాన్ని శపించిన శుక్రుడు "కచుడా! నీవు కచరూపంలో ఉన్న ఇంద్రుడవు కాకపోతే, ఈ సంజీవనీ విద్య పొందు. నా శరీరం నుండి బయటకు వచ్చి పుత్రతుల్యుడవై నన్ను మరల జీవింపచేయి. గురువునుండి విద్య పొందిన తరువాత కూడా శిష్యుడు ధర్మబద్ధమైన దృష్టిలో డాలి" అని ఉపదేశించి, కచునకు సంజీవినీ విద్య బోధించాడు. శుక్రుని ఉదరం చీల్చుకొని వచ్చాడు కచుడు. తాను నేర్చిన విద్యచే శుక్రుని పునర్జీవితునిగా చేశాడు. అటు తర్వాత శుక్రుని వద్ద దీర్ఘకాలం ఉండి పరిచర్యలు చేసి ఆయనను సంతోషపెట్టిన కచుడు గురువు అనుమతితో స్వర్గానికి వెళ్ళడానికి బయలుదేరాడు.


దేవయాని కచునితో "నీవు బ్రహ్మచారివి. నడవడి చేత, తపస్సు చేత, వంశం చేత, విద్య చేత, ఇంద్రియ నిగ్రహం చేత ప్రకాశిస్తున్నవాడివి. రాక్షసులు మాటిమాటికీ నిన్ను చంపుతుంటే నేను నీ పట్లూ పిన మను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నన్ను వివాహమాడి నాకు తి చేకూర్చు" అన్నది. ఆమెతో కచుడిలా అన్నాడు "నియోగింపరాని కార్యంలో నీవు నన్ను నియోగిస్తున్నావు. శుక్రుని గర్భంలో నీవు ఉన్నట్లే నేను కూడా ఉన్నాను. నీవు నాకు సహోదరివి అవుతావు. ఇట్లా మాట్లాడటం నీకు తగినది కాదు.


"లోకధర్మం ప్రకారం సిన శిష్యులు గురువులకు పుత్రులు. నీవు నాకు గురుపుత్రివి. అనగా సోదరివి. కనుక మనకు వివాహ బంధము తగినది కాదు. నాకు స్నేహపూర్వకంగా సెలవు ఇవ్వు" అన్నాడు. కచుని మాటలకు కోపించిన దేవయాని "ధర్మబద్దమైన కామ పురుషార్థాన్ని యాచించిన నన్ను నీవు నిరాకరిస్తే నీవు నేర్చిన విద్య నీకు పని చేయకుండును గాక" అని శపించింది. - అందుకు కచుడు "నేను ధర్మం తప్పనివాడను, నీ మాట ప్రకారం సంజీవని నాకు పనిచేయక పోయినప్పటికిని, నాచేత ఉపదేశం పొందినవారికి పనిచేయు గాక. నీవు ధర్మవిరుద్ధమైన ఆలోచన చేసిన దానవు కనుక నిన్ను బ్రాహ్మణుడు వివాహమాడకుండుగాక" అని దేవయానిని శపించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ తాను పొందిన మృతసంజీవనీ విద్యను దేవతలకు బోధించిన కచుడు దేవజాతికి ఉపకారి అయినాడు. అధర్మవర్తనురాలు, కాముకి అయిన దేవయాని కచుని శాపఫలితంగా యయాతి మహారాజును వివాహమాడింది. 


తాను పొందిన మృతసంజీవనీ విద్యను దేవతలకు బోధించిన కచుడు దేవజాతికి ఉపకారి అయినాడు. అధర్మవర్తనురాలు, కాముకి అయిన దేవయాని కచుని శాపఫలితంగా యయాతి మహారాజును వివాహమాడింది. ఈ తానెవరో సత్యాన్ని చెప్పి, వినయ సంపదచే గురువును మెప్పించిన కచుడు, తానెవరో సత్యాన్ని చెప్పక పరశురాముని వద్ద విద్యలు నేర్చుకొన్న తరువాత కర్ణుడు క్షత్రియుడనే విషయం తెలిసికొన్న పరశురాముడు కర్ణుని శపించాడు. నిజం చెప్పిన తన శత్రువు కుమారుని ఆదరించాడు శుక్రుడు. విద్య నేర్పిన బృహస్పతి భార్యను కామదృష్టితో కూడిన చంద్రుడు శాశ్వతంగా కళంకితుడైనాడు. గురుపుత్రి తనకు సోదరితో సమానమని దృఢనిశ్చయంతో ఉన్న కచుడు చిరకీర్తిని సంపాదించుకున్నాడు. నేటి సమాజంలో దిగజారిపోతున్న గురుశిష్య సంబంధాలు వినాశనానికి పరాకాష్ఠ. అందుకే బాల్యం నుండి నైతిక విద్య పేరిట భారత భాగవత రామాయణాదులను విద్యార్థులకు నేర్పాలి. గురువులు కూడా తమ శిష్యులను బిడ్డలలాగా భావించాలి.