శ్రీ వేంకటాచలపతి ధ్రువబేరం వర్ణన

శ్రీ వేంకటాచలపతి  విగ్రహం ధ్రువబేరం వర్ణన


- వేముల సురేశ్ (స్థపతి) II


విష్ణు ప్రతిమలు


విష్ణు ప్రతిమలు సాధారణంగా స్థానక, ఆసన, శయన మూర్తులుగా ఉంటాయి. స్థానక ముద్రయందు ప్రతిమ నిలబడున్నట్లు మలచబడుతుంది. ఆసన ముద్రయందు ప్రతిమ కూర్చున్నట్లుంటుంది. శయన ముద్రయందు ప్రతిమ శయనించినట్లు మలచబడుతుంది. మరీచ సంహిత ననుసరించి విష్ణు ప్రతిమలను తొమ్మిది రకాలుగా విభజించవచ్చు. స్థానక, ఆసన, శయన మూర్తులు మూడు ముఖ్యమైన వర్గాలకు సంబంధించినవి. ప్రతి వర్గమునకు ఉత్తమ, మధ్యమ, అధమ అని మూడు ఉపవర్గాలుంటాయి. ఈ విధంగా తొమ్మిది రకాలవుతాయి. ఒక సంహిత ననుసరించి 84 లక్షల ఆసనములున్నట్లు మనకు తెలుస్తుంది. వీటిలో ముఖ్యమైన 32 ముద్రలు గమనార్హములు. వీటిలో సిద్ధ, పద్మ, యోగాసన, స్వస్తికాసన, వరాసన మొదలగు ఆసనాలుంటాయి. వర్గాన్ని బట్టి, ముద్రను బట్టి ప్రతిమలను వివిధ భంగిమలలో మలచడానికి వీలున్నది.


శిల్పశాస్త్ర వివరములు మనకు ఆగమ శాస్త్రములు, పురాణములు సంహితలు తెలుపుతాయి. , ఆగమ శాస్త్రములు వైష్ణవ ఆగమ శాస్త్రాలని, శైవసంబంధ ఆగమ శాస్త్రాలని రెండు వర్గాలకు చెందినవి కూడా ఉన్నాయి. వైష్ణవ ఆగమాలలో పంచరాత్ర, వైఖానస ఆగమాలున్నాయి. పంచరాత్ర ఆగములలో సుమారు 150 సంహితలున్నాయి. ఆగమాలు కాక శిల్ప శాస్త్రానికి సంబంధించిన విషయాలు వరాహ మిహిరుని బృహత్ సంహిత, శుక్రనీతిసారము వంటి గ్రంథాలు మనకు తెలుపుతాయి. ప్రతిమ సంబంధమైన విషయాలు, పురాణాలలో మయమత, మనసార, కుమారతంత్ర లక్షణ సముచ్చయం వంటి గ్రంథాలలో కూడ దొరుకుతాయి. ఉదాహరణకు అగ్నిపురాణంలో ప్రతిమాలక్షణం, ప్రతిమావిధి, దేవగృహ నిర్మాణము మొదలగు విషయాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా మత్స్య, పద్మ, విష్ణుపురాణాలు కూడ ఈ విషయాన్ని చర్చించాయి. విష్ణుపురాణంలోని విష్ణు ధర్మోత్తరం హిందూ ప్రతిమా లక్షణాలన్నిటిని కూడ చక్కగా వివరిస్తుంది.


శ్రీ మహావిష్ణువు హిందూ మతస్థులు కొలిచే త్రిమూర్తులలో ఒరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కారకులన్న విషయము కూడ అందరికీ తెలిసిందేశ్రీ విష్ణువు వేదకాలం నాటి దేవతగా నాలుగు వేదాలలో కూడా వర్ణింపబడి ఉన్నాడు. సూర్యుడిగా గుర్తింపబడి ప్రపంచాన్నంతా త్రివిక్రముడిగా ఆక్రమించి, ఆరాధింపబడిన మూశ్రీ మహవిష్ణువు. వేదకాలం నాటి దేవతలతో శ్రీ మహావిష్ణువుకు ఆరాధ్య దేవతగా ఇప్పటికున్న ప్రాధాన్యత లేదేమో; ఆ కాలంలో, "సదా సవితృ మండల" నివాసిగా ఉదాహరింపబడ్డాడు. వేదాలలో అదితి కుమారులు - ఆదిత్యుల ప్రస్తావన ఉన్నది. "శతపథ బ్రాహ్మణం"లో ఆదిత్యులు ఎనిమిది లేక పర్రె ండుగురుగా గుర్తింపబడ్డారు. వీరిలో శ్రీ విష్ణువు ఒకరుట. మహాభారతంలో పన్నెండవ ఆదిత్యుడు శ్రీ విష్ణువుగా గుర్తింపబడ్డాడు. ఇతిహాసాలు, పురాణాల కాలం నాటిశ్రీ మహావిష్ణువు యొక్క ప్రాధాన్యత వాజ్మయంలో బాగా గుర్తింపబడింది. సరే! పోనీయండి. విష్ణు ప్రతిమల ప్రశంస కొద్దాశ్రీ విష్ణుదేవుని ప్రతిమలు సాధారణముగా మనకు మూడు తీరులలో కనిపిస్తాయి. అవి స్థానక, ఆసన, శయనమూర్తులు - సాన ముద్రయందు నిలుచున్నట్లుగా మలచబడి ఉంటుందని అప్పుడే తెలుసుకొన్నాం కదా! శ్రీ మహావిష్ణువు యొక్క ధ్రువబేరములు లేక మూలవిరాట్టు ప్రతిమలు 1. యోగ 2. భోగ 3. వీర 4. ఆభిచారిక వర్గాలకు సంబంధించినవిగా నాలురకాలుగా ఉంటాయి. ఈ మూర్తులలో గూడ స్థానక, ఆసన, శయన మూర్తుల తేడాలు ఉంటాయి. వివిధ రకాల విష్ణుప్రతిమలు వివిధ రకాల ఫలాలనిస్తాయి అంటారు. మన పెద్దలు, యోగులు, యోగ మూర్తులను పూజిస్తే, భోగాలను కోరే భోగులు భోగమూర్తులను గృహస్తులు ఐహిక ఫలాల కోసం పూజిస్తారు. వీరమూర్తులను శక్తి కోసం పూజిస్తాము. ఆభిచారిక మూర్తులను కొలిస్తే శత్రు సంహారము జరుగుతుందిట. కావున రాజులు తదితరులు ఇలాంటి పూజలు చేస్తారు. ఇంతేగాక ఈ మూర్తులలో ఉత్తమ, మధ్య, అధమ మూర్తులని వేర్వేరు విభాగములున్నవి. ఈ విధముగా లెక్కిస్తే విష్ణు ప్రతిమలు 31413 = 36 రకములని తేలుతాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం విష్ణుమూర్తులు సర్వ సాధారణముగా ఉత్తమదశ తాళమునందే మలచబడుతాయి. విష్ణుమూర్తులకు సాధారణముగా చతుర్భుజాలుంటాయి. ఈ భుజాలలో ప్రదర్శింపబడే ఆయుధాలు సాధారణముగా ఇలా ఉంటాయి : చక్రము; శంఖము, ధనుస్సు లేక సారంగము, బాణములు, గద లేక కౌమోదశ్రీ మహావిష్ణువు యొక్క ఇతర ఆయుధములు ఇలా ఉంటాయి :కేతకము, పరశువు లేక గండ్రగొడ్డలి, కటారి లేక కత్తి, హలము లేక నాగలి, కొరడా లేక ఛలకోల వంటివి. విష్ణుదేవుని హస్తములు సాధరణముగా అభయ, వరద, కట్యవలంబిత మూర్తులందు ఉంటాయి. యోగశాస్త్రం ప్రకారం మూర్తులకు 25 రకపు ముద్రలు ఉంటే జరాండ సంహిత ప్రకారము మహాముద్ర, నభోముద్ర ఇత్యాది ముద్రలు ఎన్నో ఉన్నవట. అభయహస్త ముద్ర యందు స్వామివారి చేయి ఎత్తబడి ఉంటుంది. అరచేయి భక్తులవైపు త్రిప్పబడి ఉంటుంది. చేతిలో ళ్ళు పైవైపుకు తిరిగి ఉంటాయి. ఈ ముద్రయందు స్వామివారు భక్తుల భయమును తొలగించి అభయాన్ని ప్రసాదిస్తారు. వరద హస్త ముద్ర యందు చేత్రీ ళ్ళు క్రింది వైపుకు (పాదాల వైపుకు) తిరిగి ఉంటాయి.


అరచేయి భక్తులవైపు తిరిగి ఉంటుంది. సాధారణంగా వామహస్తము వరదహస్త భంగిమలో ఉంటుంది. ఈ ముద్రయందు స్వామివారు వరాలిచ్చే వరదమూర్తిగా ఉంటారు. కట్యవలంబిత హస్తమునందు స్వామివారు వామహస్తమును తన కటి లేక నడుము మీద ఉంచుకున్నట్లు ఉంటుంది. ఈ ముద్రయందు స్వామివారి సంపూర్ణ కటాక్షం తనను భక్తితో కొలిచేవారికి ఎల్లప్పుడు ఉన్నదని తెలుపుతుంది. మరొక పాఠాన్ననుసరించి స్వామివారి భక్తులకు సంసార సాగరము లోతులేని సముద్రమని, లోతున్నా అది మొలలోతు మాత్రమేనని భక్తులను ఈ సాగరము నుండి దరిచేర్చే స్వామిని నేను అని తెలియజేసే హస్తమట ఇది. ఇంతేకాక విష్ణుమూర్తి ప్రతిమలకు పద్మము, కిరీటము, మకర కుండలాలు, కేయూరములు, కంకణ బంధనములు, ఉదర బంధనములు, కటి బంధనములు, యజ్ఞోపవీతము మొదలగు ఆభరణములుంటాయి. వక్షస్థలమునందు కుడివైపుశ్రీ వత్సమని పిలువబడే పుట్టుమచ్చ ఉంటుంది. మోకాళ్ళ వరకు వేలాడే పొడుగాటి వైజయంతీ మాల ఉంటుందిశ్రీ కౌస్తుభమనే ఆభరణము విష్ణుమూర్తి వక్షస్థలం మీద అలంకరింపబడి ఉంటుంది. రఖీ కౌస్తుభం లక్ష్మీదేవికి అతి ప్రియమైన ఆభరణము. లక్ష్మీదేవి సాధారణముగా విష్ణు వక్ష స్థలమందశ్రీ వత్స కౌస్తుభములకు దగ్గరగా వెలసి ఉంటుంది. ఇకపోతే వివిధ యోగ భోగమూర్తుల యొక్క ముద్రల గురించి తెలుసుకుందాము.


యోగమూర్తులు : యోగముద్ర యందున్న యోగమూర్తులు సాధారణంగా శ్రీ దేవి భూదేవుల సహితంగా ఉంటాయి. యోగసానక ప్రతిమలు "దేవేశం శ్యామాభాం చతుర్భుజం, శంఖ చక్రధరంచా భయకర దక్షిణహస్తం వరదం కట్యవలంబిత వామహస్తం" అన్నట్లు చతుర్భుజములు కలిగి శ్యామవర్ణములో ఉంటాయి. వెనుకనున్న కుడిభుజం చక్రం ధరిస్తే ముందునున్న కుడిభుజం అభయ లేక వరదహస్త ముద్రలో ఉంటాయి. ముందున్నవామహస్తం కట్యవలంబిత హస్తయైకటి లేక నడుము మీద ఉంటుంది. వెనుకవైపు నున్న వామహస్తం శంఖాన్ని ధరించి ఉంటుంది. ఇంతేకాక భృగు మార్కండేయ ఋషులు భూదేవి, మార్కండేయులు ఉంటారు. 'పార్శ్వే శ్వేతాభం చతుర్భుజం మృగపరశుధర మభయ కట్యవలంబిత హస్తం శంకరం దక్షిణాభిముఖం స్థితిమేవకారయేత్' అన్నట్లు శంకరుని ప్రతిమ మందిరమునకు ఉత్తరము వైపున దక్షిణాభిముఖంగా చతుర్భుజములు కలిగి మలచబడాలి. బ్రహ్మ కూడా అక్షమాలా కమండలధారియై ఉంటాడుశ్రీ మహావిష్ణువు పైన చెప్పబడిన దేవతలతోనూ, ఋషులతోనూ ఉన్నప్పుడు ఉత్తమయోగాస్థానక మూర్తిగా ఉంటాడు. బ్రహ్మ, మహేశ్వరుల ప్రతిమలు లేనట్టయితే శ్రీ విష్ణుమూర్తి ప్రతిమ మధ్యమ తరగతికి చెందినదవుతుంది. పూజక మునులు పూర్తిగా లోపించినపుడు అధమ వర్గానికి చెందిన ప్రతిమ అవుతుంది.


భోగస్థానకమూర్తి : "ద్వితీయం భోగసానకం చతుర్భుజం శ్యామాభం, శంఖచక్రధర మభయ వరద దక్షిణ హస్తం కట్యవలంబిత సింహకర్ణ వామహస్తం బ్రహ్మేశౌ దక్షిణే దేవిం, రుక్మాంబా...." అన్నట్లు భోగస్థానకమూర్తి చతుర్భుజములు కలిగి శంఖచక్రములు ధరించిన మూర్తియై ఉండాలి. ముందున్న దక్షిణహస్తం అభయ వరద హస్తాల ముద్రలలో ఉంటే ముందున్న వామహస్తం కటిమీద ఉంటుంది. ఈ ప్రతిమలు శ్యామవర్ణంలో ఉంటాయి.శ్రీ దేవి ప్రతిమ విష్ణుప్రతిమకు కుడివైపున ఉండాలి. ఇంతేగాక భృగు మార్కండేయ మునులు, ఉత్కుటికాసన ముద్రయందు ఉంటారు. మధ్యనున్న విష్ణు ప్రతిమ చుట్టు, మాయ సంహ్లాదినీ కామినీ వ్యజనీ వంటి దేవీ ప్రతిమలు, తుంబుర, నారదమునులు, కిన్నరులు, యక్షుడు, విద్యాధరుడు, సనక సనత్కుమార ఋషులు, సూర్యచంద్రులు ఉంటారు. బ్రహ్మ, మహేశ్వరులు కూడా ఉండాలి. దేవతల పరివారంతో ఉన్న విష్ణువుమూర్తి ఉత్తమ తరగతికి చెందినదైతే, యక్షుడు, విద్యాధరుడు, నారదుడు, తుంబురుడు లోపించిన ప్రతిమ మధ్యమ తరగతికి చెందినదౌతుంది. ఇంతేగాక సనక సనత్కుమారులు, సూర్యుడు, చంద్రుడు పూజక మునులు లోపించినట్లయితే అధమ తరగతికి చెందిన ప్రతిమ అవుతుంది. (ఇంకా ఉంది)