మధుర రాజధానిగా పాండ్యదేశమును పాలించిన రాజులు ప్రతిభావంతులు. వారిలో నరసింహరాజు తన శేషజీవితాన్ని పుణ్యకార్యములకు వినియోగించాలని తలచెను. కాని అది ఎలా వినియోగించుకోవాలో తనకు చెప్పే ఒక ఆళ్వారును కలుసుకోవాలని కోరిక కలిగింది.
మతపరమైనది, దైవపరమైనది గల సందేహాలను తీర్చగల పండితుడు కావాలని, వారికి గొప్పగా బహుమతులు కూడా ఇస్తానని రాజ్యములో ప్రకటన చేసెను. అందుకు తగినట్లు దర్బారులో ఒక స్తంభాన్ని నిర్మించి దాని పైభాగమున చివర బంగారు వరహాలు, నాణేలు, వజ్ర వైడూర్యములు మూటగా కట్టినాడు. ఈ బహుమతి వార్త విన్న పలువురు శాస్త్ర పండితులు దర్బారుకువచ్చిఎన్నోవిషయాలు తెలిపెను.కాని అవి అన్నియును రాజు మనసునకు సంతోషమును కలిగించకపోవుటచే ఓడిపోవసాగిరి. విష్ణుచిత్తుడు అను నిరాడంబరుడు, వృద్ధ వైష్ణవ పండితుడు శ్రీ విల్లిపుత్తూరు నుండి మధురకు వచ్చి రాజదర్బారులో అద్భుతముగా "జీవితములో జరిగే అన్ని సంఘటనలకు శ్రీ మన్నారాయణుడే మూల కారణము. ఆయనపై విశ్వాసము ఉంచి భక్తితో ప్రార్థించినా, మతో కీర్తించినా ఆ దేవదేవుడు తన భక్తులను ఆదుకొని కష్టాలు తీర్చును అని పలికెను.
సభలోని వారందరూ ఆ మాటలు విన్నారు. జడత్వము కలిగిన అక్కడి స్తంభము దానియంతట అదే విష్ణుచిత్తుని దగ్గరకు వచ్చి వంగి ఆ బంగారు వరహాల మూటను ఆయన పాదాల దగ్గర పడవైచెను. జడత్వము గలస్తంభానికి విష్ణుచిత్తుని వాక్యములు ఎంతో సంతోషింప చేసినందులకు రాజు కూడా ఎంతో సంతోషించెను. - ఈ అద్భుత సంఘటన తరువాత విష్ణుచిత్తునికి పెరియాళ్వార్ అన్న పేరు వచ్చింది. పెరియాళ్వార్ గొప్పతనమును గుర్తించిన పాండ్యరాజు గజారోహణము, కనకాభిషేకము మొదలగు సత్కారములు చేసిరి.శ్రీ మన్నారాయణుడే భక్తుల పాలిట కల్పవృక్షము. ఆయనను శరణు వేడండి అని తన దేశ ప్రజలకు రాజు హితము పలికెను. ఆ విధముగా రాజు, పెరియాళ్వారు బోధించు సమయాన సూర్యోదయము అయినట్లుగా ఆకాశములో ఒక అద్భుత తేజస్సు కనిపించింది. శంఖము, చక్రము ధరించిశ్రీ మన్నారాయణుడు ప్రత్యక్షమై పాండ్యరాజును, పెరియాళ్వారును అనుగ్రహించెను.
ఆ కమనీయ సౌందర్యముచ చి ఆనంద పారవశ్యముతో చేతులు జోడించి నమస్కరిస్తూ పెరియాళ్వార్ "స్వామీ! ఈ విధముగా ఆరుబయలు ప్రదేశములందు కనిపించవలదు. మాకు దృష్టి దోషము తగులుతుంది" అని వేడుకొనెను. భగవంతుని పట్ల భక్తునకు గల మానురాగాలు అలాంటివి. ఆయన భక్తితో...
"పట్టణాలు నగరాలు అఖిల జగత్తు నమో నారాయణ స్వరముతో ప్రతిధ్వనించుగాక, పరమాత్ముని యందు మానురాగాలతో భక్తులు పరమానందము పొందెదదరు గాక" "నామమ్ నగరమ్........ పల్లాణ కూరునినే" అని కీర్తించిరి.
అంత పాండ్యరాజునకు ఆశీస్సులిచ్చి పెరియాళ్వారు శ్రీ విల్లిపుత్తూరుకు వచ్చి అక్కడ ఉన్న వటపత్రశాయిని యథాప్రకారముగా సేవించసాగెను. వీరుశ్రీ నివాసుని ఏడు పాశురములతో స్తుతించిన మధురములైనవి. అవి మన హృదయములను భక్తితో కరిగించును. ఆయన శ్రీ వేంకటేశ్వరునిలో రాముని, కృష్ణుని దర్శించినట్లుగా తెలిపెను. పెరియాళ్వారు అసలుపేరు విష్ణుచిత్తుడు. ఆయన వంశానుగతంగా వేదమూర్తులైన "వేయర్" కుటుంబానికి చెందినవారు. వీరుముకుందాచార్యులు, పద్మ అను దంపతులకు మిథున మాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు జన్మించిరి. చిన్నతనము నుండి వేదాధ్యయనము చేసి నిరంతరము భగవంతుని కైంకర్యము చేస్తూ బ్రహ్మచర్య వృత్తి చేపట్టి జీవించసాగిరి. ఆజన్మబ్రహ్మచారిగా జీవించసాగిరి.
పెరియాళ్వారు తులసి వనాన్ని ఏర్పాటు చేసి తులసి మొక్కలోని తులసిని మాలలుగా కట్టి వటపత్రశాయికి సమర్పించుకుంటూ తన జీవితమును గడపసాగిరి. ఆ వనములో ఇంకా అనేక పుష్పములను పెంచి వాటిని మాలలుగా కట్టి వటపత్రశాయికి తులసిమాలలే గాక, పుష్పములతో కూడిన మాలలు కూడా అర్పించెను. వీరశ్రీ కృష్ణుని స్తుతియా భక్తిలో మైమరచి ఆ దేవదేవుని గురించి పాడేవారు. ఆయన పాడిన పాశురములు అన్నియును శ్రీ కృష్ణుని బాల్యక్రీడలను అభివర్ణిస్తుంది. ఆయన తన "తిరువాల్యమొయి"లో బాలకృష్ణుని చిలిపి చేష్టలను కనులకు కట్టినట్లుగా వర్ణించిరి. సాధారణముగా బాల్యము అనునది ప్రతి వ్యక్తి జీవితములోను అతి మధురమైనది.
చూడి కొడుత్త నాచ్చి య - గోదాదేవి
పెరియాళ్వార్ వటపత్రశాయిని ఆరాధించటంలోనే మనసును లగ్నం చేశారు. రోజులు గడిచిన కొలది వారి ఆరాధన, ఏకాగ్రత పరమభక్తిగా మారినది. తులసివనంలో నానా పుష్పాల మొక్కలను పెంచుతూ వాటిని కోసి జాగ్రత్తగా మాలలుగా గ్రుచ్చి వాటి పరిమళాలతోశ్రీ వటపత్రశాయిని అలంకరించి సంతోషించేవారు. .
ఇలా జరుగుతుండగా ఒకనాటి ఉదయాన తులసివనంలో ఒక కాంతిహ శారు పెరియాళ్వారు. ఆ కాంతి దగ్గరకు వెళ్ళి డగా ఒక అందమైన శిశువు కనిపించినది. ఒక్క క్షణం ఆ అందమైన బాలికమూ చి చేతిలోకి తీసుకొని అక్కున చేర్చుకొని ఆనందముతో ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా పెంచసాగెను. - ఇలా విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్) ఇది కూడా దైవానుగ్రహం అని ఆ శిశువును అల్లారుముద్దుగా పెంచసాగెను. భగవంతుని లీలలు అనేకము తెలిపే కథలను శ్రీ కృష్ణుని బాల్యక్రీడలను ఆ ముగ్గమోహనాకారుని అందము గురించి తన కుమార్తెకు ప్రతిరోజు వివరముగా చెప్పసాగెను. - అమ్మాయి పేరు గోదాదేవి. ఇలా సంవత్సరములు గడచినవి. దైవ సంకల్పము రహస్యమైనది కదా! ఆ శిశు పోషణకై తాను గృహస్థ విధులను నిర్వహించాలని భగవంతుని అభిలాష. ఆ పుత్రిక కూడా యుక్తవయస్కురాలై అద్భుత సౌందర్యరాశిగా పేరు పొందినది.
పెరియాళ్వార్ తన నందనోద్యానవనములో కోసిన పూలను మాలలుగా గ్రుచ్చి, వటపత్రశాయి ఆలయానికి తీసుకువెళ్ళేవారు. గోదాదేవి కూడా అందమైన మాలలు కట్టేది. అయితే కట్టిన మాలలు భగవంతునికి తగినవా కాదా అని పరీక్షించే నిమిత్తము తాను వాటిని ధరించూ చుకునేది. ఒకరోజు ఆ మాలలను పరీక్షించే నిమిత్తము తాను ధరించి, వటపత్రశాయికి తగినదా కాదా! అని అద్దములో సుకొను సమయాన పెరియాళ్వారు తన కుమార్తె మెడలో పూలహారాన్ని చి నిశ్చేష్టుడయ్యెను. అతడు ఆ హారాన్ని భగవానునకు సమర్పించకూడదు అనుకున్నాడు. గోదాదేవి కూడా భయంతో తాను ధరించిన పూలమాలను తీసి ఇచ్చినది. ఆ మాలలో ఆమె వెంట్రుకలు కొన్ని ఉండుటను గమనించాడు పెరియాళ్వారు. వెంటనే వడివడిగా నందనవనానికి వెళ్ళి కొన్ని పువ్వులను కోసి మాలలుగా గ్రుచ్చి ఆలయములోని నిత్యపూజాదులు కాకముందే స్వామివారికి సమర్పించెను. ఆ హారాన్ని స్వామి మెడలో ధరింపచేయగా వెంటనే రంగు మారిపోయి, వాడి తెగిపోయి కిందపడ్డది. ఈ సంఘటనచూ చిన పెరియాళ్వారు అనుకోకుండా జరిగిన వాస్తవాలు అర్థము చేసుకోలేకపోయారు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. బలవంతాన కళ్ళు మూసుకుని పెరియాళ్వారు నిద్రపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా వటపత్రశాయి అయిన శ్రీ మహావిష్ణువు ఆయనకు కలలో కనిపించి "గోదాదేవి ధరించిన పుష్పహారములను నాకు తెచ్చి సమర్పించుము. వాటిని నేను ధరిస్తాను" అని పలికెను. పెరియాళ్వార్ వెంటనే లేచి తన కుమార్తెకు ఈ విషయము తెలిపి ఆమె ధరించిన పాత హారాలను తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించెను. ఆ హారములను స్వామివారు ధరించిన వెంటనే పుష్పముల పరిమళాలు అంతటా వ్యాపించినవి. ఆ పూల హారాలు కూడా అప్పుడే మాలలు కట్టినట్టు, అందమైనవిగాను సువాసనలతోను ఉండినవి. ఆ దృశ్యమూ చిన గోదాదేవి సంతోషమునకు అవధులు లేకుండా పోయినవి. ఆ కారణముగా ఆమెకమా డికొడుత్త నాచ్చియార్" అన్న పేరు కలిగినది. పెరియాళ్వార్ పెంపుడు కుమార్తె అయిన గోదాదేవి వటపత్రశాయికీ తిపాత్రురాలు అయినది. తాను కట్టిన పూల మాలలను మొదట తాను ధరించి దర్పణముయా సుకొని మసందేశముగా మాలలు స్వామివారికి పంపుచుండెడిది. గోదాదేవి భక్తి ఇతర దేశములకు కూడా వ్యాపించినది. అందులో తిరువేంగడమందలి శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యానికి ప్రతిరోజు ఆరాటపడసాగేది. "స్వామీ నీళ్ళను మోసుకొని వచ్చే మేఘములు నీ చుట్టూ ఉన్నవి. అవి ఉరుములు మెరుపులతో వర్తించబోవు నీరము బరువైనవి. నన్ను నీ దగ్గరకు రప్పించుకోవాలని కోరుతూ ఈ నిండైన మేఘముల ద్వారా నా మనసులోని సందేశాలను తెలుపుచున్నాను. ఇంక ఎంతకాలము నీ గురించి ఎదురు చూ డాలి? దయచేసి నీ మానురాగాలు నాకు అందజేసి నీ కోసం పరితపించే నా ఆవేదనను తగ్గించవా దేవా!" అని వేడుకున్నది గోదాదేవి. అనేక పర్యాయములు మనసారా ప్రార్ధించిన ఆండాళ్ ను శ్రీ రంగ క్షేత్రమునకు పిలుచుకువచ్చి తనతో పరిణయము జరిపించవలసినదిగా శ్రీ రంగనాథుడే ఆదేశించినట్లు పెరియాళ్వార్ కల కన్నాడు. మరుసటిరోజు ఆయన ఆమెను శ్రీ రంగమునకు తీసుకువెళ్ళగా గర్బాలయములోకి ప్రవేశించగానే "ఆండాళ్" ఒక దివ్యతేజోమూర్తిగా ప్రకాశిక శ్రీ రంగనాథునిలో లీనమైపోయినది. అందరికీప్రీ తిపాత్రముగా, ఆశ్చర్యంగా ఈ ప్రపంచంలో అవతరించినది. ఆమె రచించిన "తిరుప్పావై' యందు 30 శ్లోకములు రచించి తానును ఒక ఆళ్వార్ గా కీర్తి గాంచినది.. ఒక మహాభక్తురాలి చరిత్ర "నాచ్చియార్ తిరుమొళి" లోని ఆండాళ్ పాశురములు మధురమైన భక్తిరసముగా మన హృదయములను ఆకర్షింపజేయుచున్నవి. పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ ఈమె రచించిన తిరుప్పావై భక్తులను శతాబ్దకాలముగా పరవశింప చేయా , అందరి మనసులలోనూ శాశ్వతముగా నిలిచిపోయినవి. ఆండాళ్ గొప్పతనమును, ఆమె ప్రియమైన పువ్వులను కోసి మాలలుగా కూర్చినపువ్వులలోను వటపత్రశాయికి పంపే ముందు ఆమె ధరించిన పూలమాలలలోను భక్తిభావముకనిపించుచున్నవి. , ఆండాళ్ నిజంగా భూమాత పుత్రిక. ఆమె జీవించినదని, నేటికీ జీవిస్తున్నదని, ఇకముందు కూడా కలకాలం జీవిస్తూనే ఉంటుందని భక్తుల నమ్మిక.శ్రీ ఆండాళ్ పాశురములలో (తిరుప్పావై) ముఖ్యమైన విషయాలు. -
భావము: ఆ దామోదరుని, మనమందరమూ నీరాదిది శరీరములను హరినామ సంకీర్తనము చేత వాచిక మలములను తొలగించుకొని, పవిత్రమైన మనస్సు చేత తదేక చిత్తులమై చింతించుచు, నోటితో కీర్తించుచు పవిత్రములగు పూలచే నర్పించితి మేని త్రికరణ శుద్ధి గల మనకు ముక్తి ప్రతిబంధకములైన కర్మలు (కర్మలు - వంచితములు, ఆగాములు, ప్రారబ్దములు - అని మూడు కర్మలు) తొలగి, నిప్పున బడిన దూదివలె నాశనమగును. మానవులకు భక్తిని కలిగించును. 2. మామేకం శరణం వ్రజ : నన్ను శరణు వేడుము. అది నీ ముఖ్యమైన పని. నీవు అట్లు చేసిన నీ మోక్ష ప్రతిబంధకములైన అన్ని పాపములను పారద్రోలి నిన్ను భవబంధముల నుండి విముక్తునిగా చేయుదును. అది నా వంతు అని భగవంతుడు తెలిపెను.