5. సుమేరు శిఖరంపై యజ్ఞ వరాహస్వామి దర్శనం
అప్పుడు భరద్వాజ మహర్షి అర్జునా ! పూర్వం కృతయుగంలో ముర్రే ష్ఠుడైన నారదుడు నానావిధ పత్రాలతో విరాజిల్లుతున్న సుమేరు శిఖరానికి వెళ్ళి దాని మధ్యలో ప్రకాశించే విశాలమైన బ్రహ్మదేవుని దివ్యాలయాన్ని, దానికి ఉత్తరదిక్కున పెద్ద అశ్వత్థ వృక్షాస్తూ చాడు. సహస్ర యోజనాల నీడ కలిగి, దానికి రెట్టింపుగా విస్తరించిన ఆ వృక్షమూలంలో నానావిధ రత్నాలతో శోభిస్తున్న అనేక పద్మరాగ మణిస్తంభాలతో నిర్మించబడిన, వైడూర్యాలతో - ముత్యాలతో - స్వస్తికమాలలతో అలంకరించబడిన నవరత్నాలు పొదగబడిన దివ్యతోరణాలచే శోభించే, శుభంకరాలు - నవరత్నమయాలు అయిన మృగ పక్షులతో కూడిన, పుష్యరాగాలతో చేసిన మహద్వారం కల, సప్త భూమికలతో కూడిన గోపురం కల, ప్రకాశిస్తున్న వజ్రాలతో చేసిన రెండు కవాటాలతో (కిటికీలతో) శోభిల్లుతున్న మహాద్వారాన్ని ప్రవేశించి, అక్కడ దివ్యమైన ముత్యాల మండపామా చి ఉన్నతమైన వైడూర్య వేదికను ఎక్కాడు. ఆ మధ్యలో కొండవలెనున్న వసుపాద విరాజితమైన ముత్యాలతో కూడిన ఉత్తమ సింహాసనానిచూ శాడు. దాని మధ్యలో సహస్రదళ శోభితమైన వేయి చంద్రుల ప్రకాశంతో కూడిన తెల్లని కర్ణిక కేసరాలతో ప్రకాశిస్తున్న దివ్యపద్మామా శాడు. దాని మధ్యలో కూర్చున్న పూర్ణ చంద్రునివలె ప్రకాశిస్తున్న కైలాస పర్వతాకారుడైన సుందరుడైన మహాపురుషుని దర్శించాడు. చతుర్భుజుడు, ఉన్నత శరీరుడు, వరాహ వదనుడు, శంఖ చక్రాభయ ముద్రలను ధరించిన పురుషోత్తముడు, పీతాంబరధారి, పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, పూర్ణచంద్రుని వంటి ముఖము గలవాడు, ధూపగంధంతో కూడిన ముఖపద్మం గలవాడు, సామధ్వని చేస్తున్నవాడు, యజ్ఞమూర్తి, సృక్కే ముఖమైనవాడు, సృవం నాసికగా కలవాడు, క్షీరసాగర సమానుడు, కిరీటంతో ప్రకాశిస్తున్న ముఖం కలవాడు, వక్షఃస్థలంలోశ్రీ వత్సం కలవాడు, యజ్ఞోపవీతం ధరించినవాడు, కౌస్తుభకాంతితో ప్రకాశించేవాడు, సమున్నత మహోరస్కుడు, వామపాదాన్ని పాదపీఠంపై ఉంచినవాడు, కటకాంగద కేయూర కుండలాలతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నవాడు, బ్రహ్మదేవుడు మరియు వసిష్ఠుడు - అత్రి - మార్కండేయుడు - భృగువు మొదలైన అనేకమంది మహర్షులచే రాత్రింబవళ్ళు సేవించబడుతున్నవాడు, ఇంద్రాది లోకపాలకుల చేత - గంధర్వాప్సరస గణాల చేత సేవించబడుతున్న దేవదేవుడైన వరాహ స్వామిని సమీపించి, నమస్కరించి, భూమినుద్దరించిన ఆ భగవంతుని దివ్యాలైన ఉపనిషద్భాగాలచే స్తుతించి నారద మహర్షి ఆ దేవుని సమక్షంలో పరమ సంతోషంతో ఉన్నాడు. ఇంతలో దివ్య దుందుభి ధ్వానాలు వినబడ్డాయి. అప్పుడు భూదేవి ఇడ, పింగళ అనే తన సఖులతో కూడి అక్కడకు వచ్చింది. ఆమె రత్నాలతో కూడిన సముద్రం వలె దివ్య వస్త్రాలంకృతయై మేరు మందర పర్వతాల వలె ఉన్నత స్తనభాగంచే కొంచెం వంగినదైక్రొత్త గరికవలె శ్యామవర్ణం కలదై, సర్వాభరణ భూషితురాలై ఉంది. భూదేవి ఆ సఖులు తెచ్చిన పుష్పాలను వరాహస్వామి పాదాలపై చల్లి ఆ దేవదేవునికి నమస్కరించి అంజలి బద్దురాలై నిలబడింది. వరాహస్వామి ఆమెను ఆలింగనం చేసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుని సంతుష్టాంతరంగుడై కుశలమడిగాడు. .
"భూదేవీ! నిన్ను సుఖావహమైన ఆదిశేషుని శిరస్సుపైన ఉంచి, లోకాలను నీపైన ఉంచి, నీకు సహాయంగా పర్వతాల నుంచి నేను ఇక్కడకు వచ్చాను. దేవీ! నీవు ఇక్కడికెందుకు వచ్చావు?" అని వరాహస్వామి అడుగగా భూదేవి "స్వామీ! మీరు పాతాళం నుండి నన్ను ఉద్దరించి, వేయిపడగలతో శోభిల్లుతున్న రత్నపీఠం వలె ఉన్నతమైన రత్నాలతో కూడిన ఆదిశేషుని శిరసుపై సుస్థిరంగా ఉంచి, నన్ను నిలుపుటకై సమర్థాలైన పవిత్ర పర్వతాలను ఉంచారు. వాటిల్లో ముఖ్యమై, నాకాధారభూతాలైన, సహాయకారులైన వాటిని చెప్పండి" అని అడిగింది.
6. శ్రీవేంకటాచలం వాసుదేవాలయం
అప్పుడు వరాహస్వామి ఈ విధంగా చెప్పాడు - "సుమేరువు, హిమవంతం, వింధ్య, మందరం, గంధమాదనం, సాలగ్రామం, చిత్రకూటం, మాల్యవంతం, పాలియాత్రికం, మహేంద్రం, మలయం, సహ్యం, సింహాద్రి, రైవతం, మేరుపుత్రుడైన స్వర్ణమయమైన అంజన పర్వతం శ్రీ షాలైన ఈ పర్వతాలన్నీ నీకు ఆధారాలు. ఇవి నా చేత, ఋషి సంఘాలచేత సేవించబడుతున్నాయి. ముఖ్యమైన పర్వతాల పేర్లు - సాలగ్రామం, సింహాద్రి, ఉత్తమమైన గంధమాదనం. ఇవి ఉత్తర దిక్కులో ఉన్నాయి. దక్షిణ దిక్కులో ప్రసిద్ధాలైన అరుణాచలం, హస్తిశైలం, గరుడాద్రి, ఘటికాచలం, క్షీరనది సమీపంలో ఉన్నాయి. హస్తిశైలానికి ఉత్తరాన ఐదు యోజనాల దూరంలో నదుల్లో శ్రీ భ్రమైన సువర్ణముఖరీ ఉంది. దానికి ఉత్తరాన పద్మసరోవరం ఉంది. దాని ఒడ్డున శుకమహర్షిని అనుగ్రహించిన నారాయణావతారుడైన శ్రీ కృష్ణభగవానుడు, భక్తార్తినాశనుడు, బలభద్రునితో కూడి విరాజిల్లుతున్నాడు. ఆయనను పరిశుద్ధులైన వైఖానసమునులునిత్యం ఆరాధిస్తూ ఉంటారు.పద్మసరోవరానికి ఉత్తర తీరాన ఉన్న అరణ్యంలో రెండున్నర క్రోసుల దూరంలో హరిచందన వృక్షాలతో ప్రకాశిస్తున్న శ్రీ వేంకటాచలమనే మహత్తర పర్వతం ఉంది. అది వాసుదేవుని ఆలయం (నిలయం) నివాస స్థానం. అది ఏడు యోజనాలు విస్తీర్ణం, ఒక యోజనం వెడల్పు ఉంది. అది స్వర్ణమయమై, రత్నసానువులతూ కూడింది. ఇంద్రాది దేవగణాలు, వసిష్ఠాది మహర్పులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, దానవులు, దైత్యరాక్షసులు, రంభాది అప్సరస్సంఘాలశ్రీ వేంకటాచలంపై నిత్య నివాసం చేస్తున్నారు. అక్కడ నాగులు, గరుడులు, కిన్నరులు తపస్సు చేస్తున్నారు. వీరంతా అధిష్ఠించిన ఆ పర్వతంపై పుణ్యదర్శనాలైన నదులు, అనేక విధాలైన దివ్యసరస్సులు ఉన్నాయి.
7. ధరణీకృత వరాహస్తుతి
అంతట భూదేవి వరాహస్వామిని ఈ విధంగా ప్రార్థించింది - "దేవాదిదేవా! వరాహవదనా! క్షీరసాగర వర్ణా! వజ్రశృంగా! మహాబాహూ! నీకు నమస్కారం. దేవా! కల్పాదిలో సముద్రజలం నుండి నీవు నన్ను సహస్ర బాహువులతో ఉద్దరించావు. అప్పటినుండి ఈ జగత్తును మోస్తున్నాను. ఉదయించే సూర్యుని వంటి పాదపద్మాలు కల నీకు నమస్కరిస్తున్నాను. బాలచంద్రుని వంటి కాంతి గల దంష్టాగ్రం కలవాడా! మహాబలపరాక్రమం కలవాడా! వజ్రాలవంటి దంష్ట్రాగ్రాలతో హిరణ్యాక్షుని చంపిన ఓ స్వామీ!మహాబలా! పద్మపత్రాలవంటి విశాలనేత్రాలుకలవాడా! మనోహరమైన సామస్వనం చేసేవాడా! సకల విద్యాస్వరూపా! లౌకిక శబ్దాతీతా! ఆనందప్రదా! నిగ్రహానుగ్రహరూపా! అనంతా! కాలకాలా! నీకు మరల మరల నమస్కారం" అని స్తుతించి భూదేవి తన భర్తయైశ్రీ మన్నారాయణుని పాదాలకు నమస్కరించింది.
8. భూవరాహస్వామి రాక
తనకు నమస్కరిస్తున్న భూదేవినూ చి వరాహస్వామి ప్రీ తితో వికసించిన నేత్రాలు కలవాడై ఆమెను పైకిలేపి తన బాహువులతో ఆలింగనం చేసుకొన్నాడు. భూదేవి ముఖాన్ని మతో ఆఘ్రాణించి (మూర్కొని), తన ఎడమ తొడపై కూర్చొనబెట్టుకొని, గరుత్మంతుని అధిష్ఠించి వృషభాచలానికి వెళ్ళాడు. అప్పటినుండి సర్వలోకాలు పూజించే స్వామిపుష్కరిణికి పశ్చిమతీరంలో నారదాది మునీంద్రులు, వైఖానస ముశ్రీ ష్ఠులు బ్రహ్మసమానులైన మహాత్ములు వరాహస్వామిని పూజిస్తున్నారు.
9. శ్రీ వరాహ మంత్రారాధన విధి
నారాయణాద్రిపై నివసిస్తున్న ఎఱ్ఱని పద్మాలవంటి నేత్రాలు కలవాడు, భూ భర్తయైన వరాహస్వామికి భూదేవి తన సఖులతో కూడి నమస్కరించి కుతూహలంతో "ఓ స్వామీ! మిమ్మల్ని ఏ మంత్రంతో ఆరాధిస్తే మీకుమీ తికలుగుతుంది? మీకు ఎల్లప్పుడు ప్రీ తిపాత్రుడెవరు? ఏ మంత్రం జపించేవారికి సర్వసంపదలు, పుత్ర పౌత్రాదులు, సార్వభౌమత్వం సిద్ధిస్తాయి? ఏ మంత్రం కోరిన కోర్కెలు తీర్చి, అంత్యకాలంలో మీ పరమపదాన్ని ప్రసాదిస్తుంది? ఈ విషయాలను నాయందప్రీ తితో చెప్పండి" అని అడుగగా వరాహస్వామి మందస్మిత వదనుడై ఈ విధంగా చెప్పసాగాడు - "పరమ రహస్యమైనది, వెంటనే సంపదలనిచ్చేది, భూమినిచ్చేది, సంతానప్రదమైనది, ఒకప్పుడు కూడా పైకి చెప్పరాని మంత్రాన్ని చెబుతాను విను. ఈ మంత్రాన్ని జితేంద్రియుడు. గురు శుశ్రూష (సేవ) యందు ఆసక్తి కలవాడు, భక్తుడు అయినవానికే చెప్పాలి. - "ఓం నమశ్రీ వరాహాయ ధరణ్యుదరణాయచ | వహ్నిజయా సమాయుక్తాయ నమః" || ఈ మంత్రాన్ని ముముక్షువులు ఎల్లప్పుడు జపించాలి. ఈ మంత్రం సర్వసిద్ధిప్రదం. ఈ మంత్రానికి సంకరుణుడు ఋషి. దేవత నేనే. ఛందస్సు పంక్తిశ్రీ బీజమని చెప్పబడింది. సద్గురువు నుండి మంత్రోపదేశాన్ని పొంది దానిని నాలుగు లక్షలు జపించాలి. తేనె, నేతులతో కూడిన పాయసాన్నాన్ని హోమం చేయాలి. తరువాత మనస్సుకు నిర్మలత్వాన్ని ప్రసాదించే ధ్యానాన్ని చెబుతున్నాను విను.
10. శ్రీ వరాహస్వామి ధ్యానం
తెల్లనిస్ఫటికపర్వతం వంటికాంతికలిగిన,ఎఱ్ఱతామరరేకుల వంటి నేత్రాలు గల, వరాహముఖం కల, సౌమ్యరూపం గల, చతుర్భుజాలు గల, కిరీటాన్ని ధరించిన, వక్షఃస్థలంలో శ్రీ వత్సం కల, చేతుల్లో శంఖ – చక్ర - అభయముద్రలు గల, భూదేవిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని, ఎఱ్ఱని పీతాంబరాన్ని ధరించి, ఎఱ్ఱని ఆభరణాలు అలంకరించుకొని, ఆదికూర్మం వీపుమధ్య శేషరూపంలో నున్న తామరపూవునందున్న నా రూపాన్ని (వరాహ రూపాన్ని) ధ్యానం చేసి పై మంత్రాన్ని 108 పర్యాయాలు జపించాలి. ఈ విధంగా చేసినట్లయితే కోరికలన్నీ తీరి మరణానంతరం తప్పక మోక్షాన్ని పొందుతారు. ఓ భూదేవీ! నీవడిగినదంతా చెప్పాను. ఇంకేమి కావాలో అడుగు అని వరాహస్వామి భూదేవితో అన్నాడు. ఈ అది విని భూదేవి మరల వరాహస్వామిని "దేవా! పూర్వం ఎవరు ఈ మంత్రాన్ని అనుష్టించారు? వారు ఏమి ఫలాన్ని పొందారు? అని అడుగగా వరాహస్వామి "దేవీ! పూర్వం కృతయుగంలో ధర్ముడనే పేరుగల గొప్ప మనువు బ్రహ్మదేవుని నుండి ఈ మంత్రోపదేశాన్ని పొంది, ఈ పర్వతం పైనే జపించి, నన్ను దర్శించి, నా వరంతో పరమపదాన్ని పొందాడు. అలాగే పూర్వం ఇంద్రుడు దూర్వాస మహర్షి శాపం వలన స్వర్గం నుండి భ్రష్టుడై ఈ మంత్రంతో నన్నారాధించి మరల స్వర్గలోకాన్ని పొందాడు. భూదేవీ! ఇంకా అనేకమంది ఇతర మునులు కూడా ఈ మంత్రాన్ని జపించి మోక్షాన్ని పొందారు. సర్పరాజైన అనంతుడు కశ్యపుని నుండి ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది శ్వేతద్వీపంలో జపించి భూభర్త అయ్యాడు. కావున భూమిని కోరే మనుజులు ఈ మంత్రాన్ని ఎల్లప్పుడు జపించాలి" అన్నాడు.
ఇది విని సప్రీ తురాలైన భూదేవి మరల "దేవదేవా! మహత్తరమైన ఈ వేంకట పర్వతానికి జగత్పతి, నిర్మలుడు, దేవదేవుడైన శ్రీ నివాసుడుశ్రీ దేవీ భూదేవీ సహితుడై ఎప్పుడు వస్తాడు? కల్పాంతం వరకు జనార్దనుడు ఏవిధంగా ఉంటాడు? స్వామీ! నాకు దీనిని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కావున దయచేసి చెప్పండి" అని అడిగింది.
11. అగస్త్య మహర్షి ప్రార్థన - భగవంతుని దర్శనం
అంతట వరాహస్వామి పూర్వం జరిగిన వృత్తాంతాన్ని భూదేవితో ఈ విధంగా చెప్పాడు - "దేవీ! ఈ పవిత్ర వృత్తాంతం
జరిగినదానితోను, జరుగబోవుదానితోను కూడి ఉంది. పూర్వం వైవస్వత మన్వంతరంలో కృతయుగంలో వాయుదేవుడు చేసిన గొప్ప తపస్సుకు మెచ్చిశ్రీ భూదేవులతో కూడిశ్రీ నివాసుడు స్వామిపుష్కరిణీ తీరాన వేంచేశాడు. దీనికి దక్షిణ దిక్కులో పుణ్యతమమైన ఆనంద విమానంలో లక్ష్మీపతి వాయువుకు ప్రీ తికలిగిస్తూ నివసిస్తాడు. అప్పటినుండ్రీ నివాసుడు సేనాధిపతి అయిన విష్వక్సేనుని చేత ఆరాధించబడుతూ కల్పాంతం వరకు కంటికి కనబడని ఆ విమానంలో నివసిస్తాడు" అనగా విని భూదేవి "దేవదేవా! అదృశ్యుడైన భగవంతుని మానవులు ఎలా దర్శిస్తారు? దేవాదిదేవుడైన శ్రీ నివాసుడు తమకు కుడివైపున ఉండి జనులచే ఏవిధంగా ఆరాధింపడతాడు?" అని అడుగగా వరాహస్వామి "పూర్వం అగస్త్య మహర్షి ఈ పర్వతంపై సనాతనుడైన శ్రీ నివాసుని పన్నెండు సంవత్సరాలు ఆరాధించి ఆయన్ను సప్రే తుని చేసి 'స్వామీ! మీరు ఈ పర్వతంపై జనులందరికీ దర్శనమివ్వాలి' అని ప్రార్థించగా, శ్రీ భూమి సహితుడైన శ్రీ నివాసుడు 'అగస్త్యా! నీవు కోరిన విధంగా ప్రాణులందరికీ దృష్టి గోచరుడనౌతాను. దేవర్షీ! ఈ విమానం కూడా ఎప్పుడూ అదృశ్యం కాదు. కల్పాంతం వరకు నేనీ విమానంలో ప్రత్యక్షమవుతాను. ఇందుకు సందేహం లేదు' అని వరమీయగా అగస్త్య మహర్షి సంతసించి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పటినుండి భగవంతుడు చతుర్భుజుడై మునులచే ధ్యానించబడుతూ ఈ విమానంలో దర్శనమిస్తున్నాడు. ఆ తరువాత కుమారస్వామి, వాయుదేవుడు ఈయనను ఆరాధిస్తూ సేవిస్తున్నారు. ఈ విధంగా నాలుగు యుగాలు గడిచినాయి.
12. ఆది వరాహ క్షేత్రం
భరద్వాజ మహర్షి అర్జునునితో ఇలా అన్నాడు - "అర్జునా! సువర్ణముఖరీ నదికి ఉత్తర దిక్కున అర్థయోజన దూరంలో ప్రసిద్ధమైన శ్రీ వేంకటాచలం విలసిల్లుతున్నది.శ్రీ భ్రమైన ఈ పర్వతం సకల తీర్థరాజాలకు నివాసస్థానం. అంజనాద్రి, అనంతాద్రి, వృషభాద్రి, వృషాద్రి, వరాహాద్రులు వేంకటాచలానికి ఉపవనాలు. పూర్వశ్రీ మన్నారాయణుడు వరాహ రూపంలో నారాయణాద్రిని, వేంకటాద్రిని స్వీకరించడం వలన ఆర్యులు దీనిని ఆది వరాహ క్షేత్రమని కీర్తిస్తున్నారు.