తిరుమంత్రము అంటే నారాయణ మంత్రము. తిరుమంత్రమన్నది వైష్ణవ సంప్రదాయము. నారాయణ మంత్రముగజపించడం భక్తి ముక్తిదాయకముగ వడగల, తెంగల వైష్ణవులు భావిస్తారు. నారదుడు నిత్యం నారాయణ స్మరణ చేస్తూ మహతి మీటుతూ ముల్లోకములు సంచరిస్తున్నాడని మన నమ్మకం. ఆ పరమ భాగవతోత్తముడు "నమో భగవతే వాసుదేవాయ" అని ధ్రువుడికి చెవిలో ఉపదేశించినదినారాయణ మంత్రమే. ధ్రువుడి కథ భాగవతములో ప్రసిద్ధం. ..
ధ్రువుడు యమునలో స్నానం చేసి మధువనంలో ఆ మంత్రాన్ని జపించేవాడు. మొదట్లో మూడు దినములకొకసారి వెలగపండ్లు, రేగుపండ్లు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. తరువాత ఆరు రోజులకొకసారి ఎండుటాకులు భుజించేవాడు. నెలరోజుల తరువాత అవి కూడా విసర్జించి రెండు నెలల పాటు తొమ్మిది రాత్రుల కొకసారి జలభక్షణము, మూడు నెలలు విష్ణుధ్యానములో వాయుభక్షణముతో శ్వాసను బంధించాడు. తరువాతి నుంచి ఒంటికాలిపై నిలబడి స్థాణువువలె
విష్ణుధ్యానము చేశాడు. లోకపాలురు ఆ తపస్సు అగ్నిగా మారకముందే విష్ణువును ధ్రువునికి ప్రత్యక్షమయ్యేలా అంగీకరింపచేశారు. ప్రళయకాలంలో కూడా నాశనము చెందని ధ్రువపదము ఇప్పించారు. ఆ ధ్రువుడు భారతభూమిని 26వేల సంవత్సరాలు పాలించాడు. నారదుడు ధ్రువకీర్తికి నారాయణ మహిమను కారణముగా కీర్తించి మహతిపై వాయించాడని భాగవత పురాణంలో విదుర. యసంవాదములో చెప్పబడింది. వైష్ణవ సంప్రదాయముగా తిరుమంత్రము "ఓం నమో భగవతే వాసుదేవాయ" అవునా? కాదా? అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నారాయణ సంబంధమైన వైష్ణవ తిరుమంత్రము సామాన్య జనులకు కూడీ తిపాత్రమని వెలసిన కథ చెప్పాలని ముందుగా ధ్రువ వృత్తాంతము చెప్పడం జరిగింది.
ఒకప్పుడు హరిదాసు అను వైష్ణవ భక్తుడుండేవాడు. అతడు తిరుమంత్రము ఉపదేశించమని పడగల్ సంప్రదాయ వైష్ణవ గురువునాశ్రయించాడు. తిరుమంత్రముపదేశము పొందగల అర్హత ఉందా లేదా అని గురువు సందేహించాడు. పరీక్షిస్తున్నాడు. తాత్సారం చేస్తున్నాడు. శిష్యుడు పట్టు వదలకుండా తట్టుకునిభక్తి శ్రద్ధలతో గురువు అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు. కాలం గడిచిపోతోంది. ఒక రోజు గురు శిష్యులిద్దరూ ఒక అరణ్యదారి ప్రదేశంలో సంచరిస్తున్నారు. గురువుకు దాహం వేసింది. దగ్గరున్న కమండలంలో నీళ్ళు లేవు. ఒక చెట్టునీడను ఆగి శిష్యుని నీళ్ళను తెమ్మని కమండలమిచ్చి పంపాడు. ఆకాశంలో ఐదు పక్షులు ఎగురుతూ ఉంటే వాటి ననుసరించి జలాశయము కనుక్కుని కమండలంలో నీళ్ళు నింపుకుని వచ్చాడు.
కాలం విచిత్రమైనది. అదే సమయాన ఆయనకు మృత్యు ఘడియలు సమీపించాయని గురువు గ్రహించాడు. శిష్యునికి తిరుమంత్రముపదేశించకుండానే వెళ్ళిపోతున్నాని గురువు బాధపడ్డాడు. చెట్టుక్రిందనే నేలను శుభ్రం చేశాడు. ఆ నేల ప్రాంతము చెట్టుక్రింది. కాబట్టి తడిగా ఉంది. ఆ తేమ మట్టిలో తిరుమంత్రము రాసి ప్రాణాలు విడిచాడు. శిష్యుడికి అందుతుందని భావించాడు. ఆదూ శ్రీ మన్నారాయణుడు నవ్వుకున్నాడు. ఒక గోపాలకుడి వేషంలో అక్కడ తచ్చాడుతున్నాడు. అప్పుడొక వేశ్య అక్కడికి వచ్చింది. మరణించిన గురువుమూ సింది. నేలమీద అతడు రాసింది మంత్రముగా గ్రహించి లాభముండకపోతుందా అని ఒక తాటియాకును వెదికి సంపాదించింది. ఆ మంత్రాన్ని రాసుకుని వెళ్ళిపోయింది. ఎందుకైనా మంచిది ఎవరికీ తెలియకూడదని నేలపై రాయబడిన తిరుమంత్ర అక్షరాలు కనపడకుండా చెరిపివేసింది. నీళ్ళ కమండలముతో తిరిగివచ్చిన శిష్యుడు విచారించాడు. గోపాలుడిగా తచ్చాడుతున్న భగవంతుడు శిష్యుడు హరిదాసుకు జరిగింది చెప్పాడు. హరిదాసు గురువుకు చేయవలసిన అంత్యాచారాలు ముగించుకుని వేశ్యను వెదుక్కుంటూ వెళ్ళాడు. బహుశా కాంతా వ్యా మోహుడవుతాడా లేదా అన్నది భగవంతుని పరీక్ష. అది గోపాలుడిగా పరీక్షిస్తున్నాడు. వేశ్య ఆ మంత్రము రాసిన తాటాకివ్వనన్నది. పైగా హరిదాసుని తన దగ్గరే ఉండిపొమ్మంది. అతనిచే మంత్రము చదివిస్తే కాసులు కురుస్తాయని ఆమె భావించింది. కాని హరిదాసు చలించలేదు. కాంతా వ్యామోహము లేని అతనికి కనకముపై వ్యామోహముంటుందా? ఇదీ గోపాలుని రూప భగవానుడి పరీక్షే. తిరస్కరించి వచ్చేశాడు. ఆ సమయాన ధర్మరాజు యజ్ఞము చేస్తున్నాడు. వైష్ణవ బ్రాహ్మణునికి దక్షిణగా ధనకనక వస్తువాహనాలిస్తానని ఆహ్వానించాడు. కానిహరిదాసు తిరస్కరించి వేశ్య వృత్తాంతం చెప్పాడు. ఆమె నుంచి తనకు ఆ తాటియాకు ఇప్పించండి చాలని ధర్మజుని కోరాడు. వేశ్యకు ఆ ఆకుమీది మంత్రరాజము ఇచ్చే మోక్షపు విలువ తెలియదు. అది ధనము తెప్పించగల మంత్రరాజముగానే భావించిన ఆమె నమ్మకమును భగవానుడు అంగీకరించాడు. ఆమె కోరిక కూడా తీర్చాడు. అందుచేత ఆమె హరిదాసుకిచ్చే ధన కనక వస్తు వాహనములిస్తానన్న ధర్మరాజునుంచి కోరుకుని మారాడకుండా ఆకునిచ్చేసింది. కాంతా ధన కనక వ్యామోహములు లేని అతి తిరుమంత్రమును ఉపాసించి హరిదాసు తరించాడు. కేవలం తాటియాకు మీద రాసుకున్న పుణ్యానికి వేశ్యకు సిరిసంపదలబ్బడమే కాదు జీవనసరళిలో మార్పు వచ్చి పుణ్యకార్యాలు చేసి తరించింది. తిరుమంత్రము ఇహ పర సాధనగా భగవత్కృపకు పాత్రము చేస్తుందన్న ఈ కథ విష్ణుమహిమను చాటింది. జానపద ప్రాంతములలో పాటగా కూడా ఒకప్పుడు ప్రచారములో ఉండేది.