గరుడోపాఖ్యానం


గరుడోపాఖ్యానం


గత సంచిక తరువాయి వైనతేయుడు మహావీరుడిగానే కాక మహాభక్తుడిగా కూడా మహర్షుల చేతనే వినుతింపబడ్డాడు. అత్యంత తపోనిరతుడై విష్ణు తత్యాన్నే గ్రహించిన కారణ జన్ముడు. మాతాపితల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి, వారి ఆశీస్సులతో అనేకానేక విషయ సంగ్రహణం చేసి, వారి ఆజ్ఞానుసారం బదరికావనం ప్రవేశించి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుని దర్శించిన పుణ్యాత్ముడు. “అవ్విశ్వరూపునకు శాశ్వత పరిచర్య సేయంగల వాడవగుటం గృతారతం బొందితి” అని పితృదేవుడైన కశ్యప బ్రహ్మ చేతనే అభినందింపబడిన పరమభక్తుడు గరుడుడు. - 354 వచనం - ప్ర.ఆ - ఆనుశాసనిక పర్వము “ప్రియభక్తుండవు, భక్త ప్రియుడును విష్ణుండు, నీవు ప్రియుడై భక్తుం డయివర్తింతౌ విభుకడ దయ తెలియగ చెప్పవే యతని తెఱగెల్లన్" - 347 ప - ప్ర.ఆ - ఆనుశాసనిక పర్వము ఒకానొక సమయంలో గరుత్మంతుడు హిమాలయ పర్వతాలలో సంచరిస్తూ, పర్వత సౌందర్యానికి ముగ్ధుడై విహరిస్తూ, ఆ పర్వత సానువుల మీద ఆధ్యాత్మిక చర్చ చేస్తున్న మునులను చూసి ఆగి, వారికి నమస్కరించాడు. మునులు కూడా కశ్యపాత్మజుని చూసి ఆనంద పరవశులైనారు. “గరుత్మంతా! నీవు మహాత్ముడవు. విష్ణుమూర్తికి ప్రియ భక్తుడివి. విష్ణువు కూడా భక్తులంటే ఎంతో ఇష్టం గలవాడు కదా! నీవా విష్ణువుకు ఎల్లవేళలా ఇష్టుడవై, భక్తుడవై ఆయన వద్దనే ప్రవర్తిస్తుంటావు. ఆ దేవదేవుని సేవలో తరిస్తుంటావు. నీకు విష్ణువు గూర్చి తెలియని విషయమంటూ ఏదీ ఉండదు. విష్ణు తత్యాన్ని అంతా మాకు తెలియజెప్పు గరుడా!” అని మునులందరూ కోరడంతో విష్ణుభక్తిలో లీనమైపోయి క్షణం నిరుత్తరుడైనాడు గరుడుడు. నారాయణుడి పాదపద్మాలకు మనస్సులోనే నమస్కరించి వారడిగిన విష్ణుతత్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. “ముని శ్రేష్ఠులారా! భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడన్న విషయం మనకు స్థూలంగా తెలిసినది మాత్రమే. అంతమాత్రం