గరుడోపాఖ్యానం
గత సంచిక తరువాయి “గాలవా! నీ గురువైన విశ్వామిత్రుని వద్దకు ఆరు వందల గుజ్రాలను తీసుకొని వెళ్ళి గురుదక్షిణగా ఆయనకు సమర్పించు నేనుకూడా నీతో వచ్చి ఆ మహాత్ముని దానికి అంగీకరించమని ప్రార్థిస్తాను. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినందువల్ల శాంతచిత్తుడై మన ప్రార్థన నంగీకరిస్తాడు. నీ కర్తవ్యమూ నెరవేరు తుంది. గురువు దీవెనను పొందుదువుగాని” అని నచ్చచెప్పిమహాధీరుడైన గరుత్మంతుడు ముని కుమారుని తీసుకొని విశ్వామిత్ర మహర్షికి పాలికి వెళ్ళాడు. ఆ తపోధనుడికి మ్రొక్కి - “ఈతండు బాలుండు, నీవు దయాళుండవు. ఇతనిని కృతార్థుం జేయవలయు” - 320వ - తృ.ఆ - ఉ.ప
అని ప్రార్థించి గరుడుడు విశ్వామిత్రునందుకు అంగీకరింపచేశాడు. ఆ విధంగా పక్షీంద్రుడు తనను గురు ఋణం నుండి విముక్తుని చేయటంతో గాలవుడు సంతోషభరితుడై మిత్రుని ఆలింగనం చేసుకొన్నాడు. "కశ్యపాత్మజా ! మిత్రుడంటే ఈ విధంగా ఉండాలి. నా కష్టాన్ని నీ కష్టంగా భావించి ఎందరెందరి దగ్గరకో నన్ను తీసుకొని పోయి సఫలీకృతుని చేశావు. ఏ లోక వాసులైనా నినమా సి “మిత్రధర్మం” అంటే ఏమిటో తెలుసుకొనేటట్లు చేశావు. బాల్యమిత్రుడినైనా నన్ను నీవు మరచిపోలేదు సుమా! అనుక్షణం నన్ను కాపాడావు. నీ ఋణం ఎలా తీర్చుకోగలను? పేరుకు నేను నీకు బాల్యమిత్రుడనే గాని, నీకూ - నాకూ ఎంత తారతమ్యం ఉంది? నీవా విష్ణుమూర్తి సన్నిధిలో సర్వదా నిలబడి ఆ పరమాత్ముడికి 'వందన సేవ'లో తరిస్తుంటావు. అంతేనా? ఆయన రథానికి ధ్వజంగా ఉండి, గరుడ ధ్వజుడిగా నారాయణుని అందరూ సంస్తుతించేటట్లు, నీ నామాన్ని కూడా సర్వులూ తలచేటట్లు విష్ణువు నుంచి వరం పొందావు. నీవంటి మహనీయుడు నాకు మిత్రుడు కావటం నా పూర్వజన్మ సుకృతం. మాతృ ఋణాన్ని, పితృ ఋణాన్ని తీర్చిన మహా మహుడివి. మాతృభక్తికి ఎవరు నిదర్శనం అంటే - గరుడుడొక్కడే అని వినుతింపబడిన వైనతేయుడివి. అమేయ బలపరాక్రమశాలివి. వాయువేగ సమన్వితుడవు. స్వర్గనాథుని మించిన పక్షీంద్రుడివి. సర్వలోక స్తవనీయుడవు. అహంకార మమకార వర్షితుడవు. నిన్ను తలిస్తే నారాయణుని స్తుతించినట్లే సుమా! వైకుంఠ నాథుడికి నీవన్న అంత వాత్సల్యం సుమా! అందుకే విష్ణుమూర్తికి నమస్కరించిన వారు వెంటనే ఆయనకు ఎదురుగా ఉండే నీకు నమస్కరించకుండా ఉండరు సుమాఁ మిత్రుడివైనా, నీకు నేను నమస్కరిస్తున్నాను” అని గాలవుడు మిక్కిలి భక్త్యానురాగాలతో గరుడునికి నమస్కరించి, విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళిపోయాడు.
కనుక సుయోధనా, నేను చెప్పిన విషయమంతా అర్థం చేసుకో. ఏ పనినీ నిర్బంధంతో చేయరాదు. ఆవిధంగా చేస్తే గాలవుడు పడినట్లే అనేక కష్టాలు పడవలసి వస్తుంది. గరుత్మంతుడాదుకొన్నాడు కనుక గాలవుని కోరిక ఫలించింది. గురుదక్షిణనిచ్చి గురుకృపను పొందగలిగాడు. పట్టుదలతో పాండవులకు పగవాడివి గాక తైతే బంధంతో బంధువుగా మెలగు. నీకు సర్వశుభాలూ జరుగుతాయి” అని నారద మహర్షి చెప్పినదంతా వింటూ విననట్లున్నాడు దుర్యోధనుడు. “విష్ణువు చెప్పిన దానిని గరుడుడు విని సజ్జనుడై ప్రవర్తించినట్లేనీవు కూడా శ్రీ కృష్ణుని హితవచనాలు విని ఉత్తముడిగా పేరు తెచ్చుకో” అన్న నారదుని మాటలు కురుపతికి రుచించలేదు. మహాసంగ్రామం జరిగి జననష్టం జరగకుండా ఉండటానికే కణ్వమహర్షి, నారద మునీంద్రుడు గరుడోపాఖ్యానం చెప్పి దుర్యోధనుని మనస్సు మరల్చడానికి విశ్వప్రయత్నం చేశారు. ప్రతి ఉపాఖ్యానమూ ప్రధాన కథ అయిన భారత కథకు అనుసంధింపబడే ఉంది. గరుడుని కథ వాటిలో మున్నెన్నదగినది. “బృహద్రథంతరాది సామంబుల చేత సోత్రంబు చేయంబడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై మనల్ని రక్షించు గాక!".
అంటూ ప్రారంభంలోనే ఉన్నత గుణ ప్రశంసతో ఉదంకుని పరిచయం చేశాడు ఆదికవి. సృష్టికర్త బ్రహ్మదేవునికి సముడు. పాపమనే బురదను కడిగివేయగలిగినంతటి తపశ్శక్తి సంపన్నుడు. నిర్భయుడు. ముశ్రీ ష్ఠుడు. అన్నిటినీ మించి పైల మహాముని శిష్యుడు. సాక్షాత్తు శ్రీ మన్నారాయణుని అపరావతారుడైన వేదవ్యాసుని ప్రధాన శిష్యుడు పైలుడు. ఆతని శిష్యుడు ఉదంకుడు. అంటే వ్యాస భగవానునికి ప్రశిష్యుడు. అంతటి పుణ్యుడు - "గురుదయ నణిమాది కాష్టగుణములతో” జ్ఞానాన్ని సముపార్జించాడు. ఉత్తమ శిష్యుడయ్యాడు. శిష్యోత్తముడయ్యాడు. విద్యార్జన పూర్తి చేసుకుని వినయ విధేయతలతో గురువుకు నమస్కరించి గురుదక్షిణగా ఏమివ్వాలో తెలుపమని ప్రార్థించాడు. పైలమునికి ఎటువంటి కోరికా లేకపోవటంతో గురుపత్ని కోరిక తీర్చమని నియోగించాడు ఉదంకుని. పరమానందంతో ఉదంకుడు మాతృసమానురాలైన గురుపత్నికి మ్రొక్కి కోరిక తెలుపమని వేడుకున్నాడు. పౌష్య మహాదేవి కుండలాలను తెచ్చివ్వమని తన కోరికను వెల్లడి చేసిన గురుపత్నికి నమస్కరించి, గురువు అనుమతి పొంది బయలుదేరాడు ఉదంకుడు. . గురుమూర్తి కోరిన అర్థాన్ని గురుదక్షిణగా సమర్పించి వంశాభివృద్ధిని పొందడమే శిష్యుని కర్తవ్యమని ఉపనిషద్వాక్కు అందుకు ప్రబల ప్రతీకా నిలిచినవాడు ఉదంకుడు. - పౌష్య మహారాజు రాజ్యానికి వెడుతూ దారిలో ఎదురైన ఒకానొక మహానుభావుని ఆదేశాన్ని పాటించి ఎద్దు పేడను తిని, ఆతని ఆశీస్సులు పొంది, పౌష్యుని రాజ్యాన్ని చేరుకున్నాడు.
విప్రోత్తముడు, తపశ్శక్తి సంపన్నుడు కనుక రాజుని దీవించి - తాను యాచకునిగా వచ్చినట్లు వినయంతో తన కోరికను చెప్పుకున్నాడు. తాను శాపానుగ్రహ సమర్థుడైనా, మహర్షి సత్తముడైనా వచ్చినది యాచనకి కాబట్టి వినయంగానే మహారాణి కుండలాలను ఇమ్మని పౌష్య మహారాజుని కోరాడు. మహర్షికి నమస్కరించి, తాను కృతార్థుడనైతినని పలికి, దేవేరి అంతఃపురానికి ఉదంకుని పంపాడు పౌష్యుడు. రాణి కనిపించలేదని వాపోయిన ఉదంకునితో -
అన్న మాటలలోనే ఉదంకుని పవిత్రత కూడా స్పష్టమవుతోంది. “భూవినుత; త్రిభువన పావన; అనవద్యా” అన్న సంబోధనలు ఉదంకుని దోషరాహిత్యాన్ని సూచిస్తున్నాయి. అలాంటి పవిత్రునికి - పరమ పవిత్ర పౌష్యమహారాణి - కనబడలేదంటే ఏదో జరిగి ఉండి ఉంటుందని మహారాజు చేసిన పరోక్ష సూచన అది. అప్పుడు ఉదంకునికి జ్ఞాపకం వచ్చింది - తాను వచ్చే దారిలో ఎద్దు పేడను తిని - చేతులు కడుక్కోలేదని. వెంటనే కాళ్ళు, చేతులు, ముఖం కడుగుకొని - శుచిగా తిరిగి అంతఃపురం చేరి మహారాణిని దర్శించి, ఆమె ఇచ్చిన కుండలాలను స్వీకరించి అమితానంద భరితుడవుతాడు. కారణం - గురుదక్షిణగా గురుపత్ని కోరిక తీర్చి తరించబోతున్నానని. . కుండలాలను ఇచ్చిన పౌష్యరాణి ఉదంక మహర్షికి నమస్కరించి, “తక్షకుడనే సర్పరాజు ఈ కుండలాల కోసం ఏనాటినుండో అపేక్షిస్తున్నాడు. ఆతడు మాయా దక్షుడు. అభేద్యుడు. గురుపత్నికి చేరేవరకు జాగ్రత్తగా రక్షించుకొమ్మ"ని హెచ్చరించింది. పౌష్యమహారాణికి కృతజ్ఞతలు చెప్పుకుని ఉదంకుడు పౌష్యమహారాజు యొక్క ఆతిథ్యాన్ని అంగీకరించి, భోజనం చేస్తుండగా - అన్నంలో వెంట్రుక వచ్చింది. అది దుష్టాన్నమని కోపించి, వెంటనే రాజును అంధుడవు కమ్మ"ని శపించాడు. “ఇంత చిన్న తప్పుకి - అంత పెద్ద శాపమా” అని ఆగ్రహించి రాజు కూడా ఉదంకుని "సంతాన హీనుడి”గా తిరిగి శపిస్తాడు. ఖిన్నుడైన ఉదంకుడు "సంతానం లేకుండా, వంశ వృద్ధి లేకుండా ఉండలేనని, శాపాన్ని ఉపసంహరించమ”ని కోరతాడు. అందుకు పౌష్యరాజు - -
"బ్రాహ్మణోత్తమా! విప్రుల హృదయం వెన్నతో సమానం. మాట మాత్రం పరుషం. ఇంద్రుని వజ్రాయుధానికి సమం. కానీ, రాజులకు మాట సున్నితంగానూ, మనస్సు కఠినంగానూ ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణునికి శాపవిమోచనాశక్తి ఉంటుంది. రాజులకు ఉండదు. దయ ఉంచి నీవే శాపాన్ని తొలగించు” – అని వేడుకుంటాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉదంకుడే "అతి కొద్దికాలంలోనే నీ అంధత్వం పోతుంద”ని కరుణతో పలికి - గురుపత్ని దగ్గరకు బయలుదేరుతాడు. ఇక్కడి ఈ పద్యం ఆదికవి నన్నయ రచనకే మకుటాయమానం. నేటికీ ఈ పద్యం నోటికిరాని తెలుగు పండితుడుండడు. అంతటి ప్రశస్తి కెక్కిన ప్రసిద్ధ పద్యమిది. మరో విశేషం - ఈ పద్యం నూరవది. మొట్టమొదటి పర్వంలో మొట్ట మొదటి ఆశ్వాసంలో వందవ పద్యమిది. శతసంఖ్య చాలా పవిత్రమైనది. ప్రశస్తమైనది. ప్రధానమైనది. శతసంఖ్యను సంతరించుకున్న ఈ పద్యం కూడా అంత ఘనత వహించినదే. గుర్వాశ్రమానికి వెళుతుండగా ఆచమించవలసిన సమయం ఆసన్నమైనదని తెలిసి, జలాశయం దగ్గర ఆగి, చేతిలోని కుండలాలను శుచి ప్రదేశంలో ఉంచి, నీటిలోకి దిగి ఆచమించాడు. ఉదంకుడు. ఆ ఒక్క క్షణకాలాన్ని వినియోగించుకున్నాడు - ఎంతో కాలంగా ఎదుచూ స్తున్న తక్షకుడు. దిగంబర వేషధారియై తటాలున ఆ కుండలాలను అపహరించి వేగంగా పరుగు తీశాడు. ఇక్కడొక విశేషం గమనించాలి. ఈ కుండలాలు పరమ పవిత్రమైనవి. విశిష్టమైన శక్తికలవి. అందుకే గురుపత్ని వాటిని ధరించాలని కోరుకున్నది. సాధ్వీమణులకు మాత్రమే ఈ కుండలాల ధారణ సాధ్యం. పరమ పవిత్ర, మహా పతివ్రత, అశుచులకు ఆగోచర అయిన పౌష్యమహాదేవి ధరించినవి. అఖండ తపశ్శాలి, వేదవ్యాసుని శిష్యోత్తముడు అయిన పైల మహర్షి ఇల్లాలు కూడా అంతటి సాధ్వియే. అందుకే ఆ కుండలాలను తెచ్చి పెట్టమని పుత్ర సముడైన ఉదంకుని పురమాయించింది. ఉదంకుడే అందుకు సమర్థుడు. అదృశ్యరూపంలో కాచుకుని ఉన్న తక్షకుడు వాటిని తస్కరించాడు. అదే విశేషం. అతి పవిత్ర కార్యం కానీ, లోకోత్తర కార్యం కానీ సాధించడం అంత సాధ్యం కాదు. అసాధ్యమైన కార్యాలకు, అతి పవిత్ర విషయ సాధనకు - నగ్నత్వత్రే ష్ఠం. సులభం. అదే చేశాడు సర్వేంద్రుడు.
అప్రమత్తంగా ఉన్న ఉదంకుడు కూడా వెంటనే తక్షకుని వెంట పరుగెత్తాడు. పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు నగ్నరూపం వదలి, నిజరూపంతో భూ రంధ్ర మార్గంలో కుండలాలతో సహా నాగలోకం చేరాడు. అదే భూవివరం ద్వారా ఉదంకుడు కూడా నాగలోకం చేరాడు. అణిమాది అష్టసిద్ధులను సాధించినవాడు కనుక ఉదంకుడు భూమార్గంలోకి దూరి మరీ వెళ్ళగలిగాడు. అథోలోకమైన సర్పలోకం చేరగలిగాడు కానీ తక్షకుని మాత్రం అందుకోలేకపోయాడు. కారణం - తక్షకాదులు దేవ సర్వేంద్రులు. అందుకే ఉదంకుడు తెలివిగా, భక్తితో దేవతా సర్పాలను స్తుతించి, ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నాడు. ముందుగా ఆదిసర్ప దైవమైన శేషుని - “బహువన పాదపాబ్ది కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహా మహీధర మజస్ర సహస్ర ఫణాళిదాల్చిదు స్సహతర మూర్తికిన్ జలధి శాయికి బాయక శయ్యయైన య య్యహి పతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్”
“మహా అరణ్యాలతోను, మహా వృక్షాలతోను, మహా సముద్రాలతోను, మహా కులపర్వతాలతోను, సర్వ ప్రకృతి శక్తితోను కూడిన గొప్ప భూమిని వేయి పడగలతో మోస్తున్న శేషుడు; శ్రీ మన్నారాయణునికి శయ్యగా ఉన్న శేషుడు; పాపాలను హరింపచేసే దేవుడైన శేషుడు, అనంతుడనే పేరుగల శేషుడు మాకు ప్రసన్నుడగుగాక” – అంటూ నుతించాడు.
"సర్పకులాన్ని మొత్తాన్ని సంరక్షించినవాడు, పరమశివునికే కంఠాభరణంగా శోభిల్లినవాడు అయిన వాసుకి మాకు ప్రసన్నుడగుగాక” - అని రెండవ సర్పదైవమైన వాసుకిని స్తుతించాడు.
"దేవతల, మనుషుల లోకాలలో తిరుగుతూ ఆ దేవతల చేత, మనుజుల చేత నిత్యం పూజలందుకుంటున్న వారు, అప్రమేయ పరాక్రమాన్ని కలవారు, ఐరావత నాగవంశంలోని వారు, కోటి సంఖ్యాకులైన భయంకర సర్పరాజులు మాపట్ల అనుగ్రహం కలవారుగా అగుదురు గాక” - అని సకల సర్పదేవతలను స్తోత్రం చేశాడు. చివరిగా తన కుండలాలను అపహరించిన తక్షకుని కూడా ప్రార్థించాడు.
“కుల పర్వతాల పొదరిళ్ళలోను, అడవులలోను, కురుక్షేత్రంలోను, అశ్వసేనునితో సహా తిరుగాడుతున్న పరాక్రముడు, శూరుడు, బలోపేతుడు, పాములకు రాజు అయిన తక్షకుడు మాకు ప్రసన్నుడై అనుగ్రహించు గాక” అని తక్షకుని ప్రశంసించాడు. అంతలో పాతాళలోకంలో - తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని చేస్తున్న ఇద్దరు స్త్రీలను; పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, గుర్రం మీద ఉన్న ఒక పురుషుడినూ సి, ఆశ్చర్యం చెంది, మంత్రపూర్వకంగా స్తుతించాడు. ఉదంకుని స్తోత్రానికి సంతసించిన ఆ దివ్యపురుషుడు వరాలిస్తానని తానే ఉదంకుని అనుగ్రహించాడు. "సర్ప వంశమంతా తనకధీనమయ్యే” వరం కోరాడు ఉదంకుడు. ఆ దివ్య పురుషుడు ఆదేశించినట్లు అక్కడి గుర్రం చెవిలో ఊదాడు. అంతే మహా అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి నాగలోకమంతా వ్యాపించాయి. దానితో నాగలోకమంతా అల్లకల్లోలమైపోయింది. నాగులన్నీ భయకంపితాలయ్యాయి. "శంకర నిభుడగు విశ్రుభ యంకర కోపాగ్ని యొక్కొ యనుచును జాతా తంకుడయి కుండలంబులు దంకునకును దెచ్చి యిచ్చె తక్షకుడంతన్” - ఆ.ప - ప్ర.ఆ - ప.112 “లయకారుడైన పరమశివునికి సముడైన అఖండ తపశ్శక్తి సంపన్నుని కోపాగ్నికి నాగలోకమంతా నశించిపోతుందేమో”నన్న భయంతో - తాను తస్కరించిన కుండలాలను తెచ్చి ఉదంకునికి ఇచ్చివేశాడు తక్షకుడు. మహదానంద భరితుడయ్యాడు ఉదంకుడు. కానీ, గురుపత్ని కుండలాలను ధరింపవలసినది ఈ రోజే. నేను ఇక్కడ నాగలోకంలో ఉన్నాను. భూలోకంలోని గురువు ఆశ్రమాన్ని ఎలా చేరుకోగలను? సమయానికి చేరలేకపోతే నా ఈ ప్రయత్నమంతా వ్యర్థమే కదా అని వాపోయాడు మనసులోనే. అది అర్థం చేసుకున్న ఆ దివ్యపురుషుడు - తన గుర్రాన్నెక్కి మనోవేగం కంటే వడిగా గురుగృహం చేరుకోమని అనుగ్రహించాడు. వెనువెంటనే ఆ గుర్రాన్నెక్కి తత్ప్రణమే గురువు ముందు నిలిచాడు ఉదంకుడు. - గురుపత్ని స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, బ్రాహ్మణులను భోజనానికి పిలిచి, అందరినీ రావించి, సిద్ధంగా ఉంది. అంత నమ్మకం ఉదంకుని సత్యసంధత మీద. సమర్థత మీద. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఉదంకుడు – తెచ్చిన కుండలాలను మాతృ సమానమైన గురుపత్నికి సమర్పించి, నమస్కరించి, దీవెనలందాడు. గురుపత్ని పవిత్రమైన ఆ కుండలాలను ధరించి, బ్రాహ్మణ సంతర్పణ చేసి, పండుగ చేసుకుని, మహదానందాన్ని మహా సంతృప్తిని పొందింది. అదంతూ సి, తరించానని తనివి చెందాడు శిష్యపుంగవుడు ఉదంకుడు. గురువు పైలర్షి కూడా సంతోష సంతృప్తులను చెందాడు. ఆనందాన్ని కలిగించిన ప్రియశిష్యుని చేరదీసి, ఆదరించి, ఆప్యాయంగా “ఎందుకు నాయనా - ఇంత ఆలస్యమయింది? ఇన్ని రోజులు పట్టింది? పౌష్యుని రాజ్యం ఇక్కడికి దగ్గరే కదా” అంటూ ప్రశ్నించాడు. అందుకు ఉదంకుడు - తాను దారిలో పొందిన అనుభవాలను, పడిన పాట్లనూ సిన విశేషాలను, చేసిన పనులను వివరంగా వినిపించి, వాటి అర్థాలను, అంతరార్థాలను అవగతం చేయమని వేడుకున్నాడు గురువును. దివ్యశక్తి సంపన్నుడు, త్రికాలవేది, వ్యాసర్షి శిష్య స్థుడు అయిన పైల మహర్షి -
“నాయనా! ఉదంకా! దారిలో ఎద్దునెక్కివచ్చి నీకెదురైన ఆ పురుషుడు ఎవరో కాదు. సాక్షాత్తు త్రిలోకాధినాథుడైన దేవేంద్రుడు. ఆతడెక్కిన ఎద్దు - దేవతల ఏనుగైన ఐరావతం. నీవు తినిన పేడ అమృతం. అంతేకాదు. నాగలోకంలో నీకు కనిపించిన స్త్రీలు ధాత. విధాత. వారు నేస్తున్న నలుపు, తెలుపు దారాలు రాత్రి, పగలు. పన్నెండు ఆకులున్న చక్రం - పన్నెండు మాసాలతో కూడిన సంవత్సరం. దానిని తిప్పుతున్న ఆరుగురు యువకులు వసంతాది ఆరు ఋతువులు. ఆ గుర్రం అగ్నిదేవుడు. ఆ దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడైన పర్జన్యుడు. మొదటనే ఇంద్రుమా సి, అమృతం తిన్నావు కనుక నీకు వాంఛితార్థ సిద్ధి కలిగింది. నీవు తల పెట్టిన పని సమగ్రంగా నెరవేరింది. కుండలాలు తెచ్చి ఇవ్వగలిగావు. అదీ సమయానికి అందించగలిగావు.
గురువుల పనులు సక్రమంగా నెరవేర్చే సజ్జనులకు విశిష్ట పుణ్యం తప్పక లభిస్తుంది. గురుకార్యం పూర్తి చేశావు. ఇంక నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు" - అని ఆశీర్వదించి, పంపాడు ఉదంకుని. ఉదంకుడు గురువు ఆనతిని తీసుకుని చాలాకాలం తపస్సు చేసి, సిద్ధిని పొందాడు. అయినా - తక్షకుడు చేసిన అపకారం మర్చిపోలేదు సరికదా ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. అఖండ తపశ్శక్తిశాలి తలుచుకుంటే జరగకుండా ఉంటుందా ఏదైనా - అని ఒక్కక్షణం ఆగాడు సూత మహరి. ఆశ్చర్యపోయిన శౌనకాదులు “మహరీ! ఉదంకుని అంతటి తపస్వికి అంత ఆగ్రహమా!? ఆ కోపంతో ఏం చేశాడు? నాగజాతిని కానీ, తక్షకుని కానీ శపించాడా?” - అని అత్యంత ఉత్సుకతతో అడిగారు. చిరునవ్వుతో సూతుడు “లేదు పుణ్యాత్ములారా. ఉదంకుడు శపించలేదు. కానీ, తపస్సు నుంచి లేచి, రాజాధిరాజైన జనమేజయుని కలిశాడు. ఇంతకూ జనమేజయుడు ఎవరంటారా? అభిమన్యుని మనుమడు. అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తు మహారాజు కొడుకే జనమేజయుడు. పరీక్షిత్తు మహిమోన్నతుడు. భయంకర కర్మకారకుడు, యుగపురుషుడు అయిన కలిదేవుని రాకను నివారించిన శక్తి సమర్థుడు. కలియుగ ఆరంభ కాలాన్ని ధర్మదేవత చేత నాలుగు పాదాలతో నడిపించిన ధర్మ నిషా గరిష్టుడు. ప్రజారంజకుడు. అంతటి మహోన్నతుని కాటువేసి చంపినవాడు తక్షకుడు.
“శృంగి మహరి వాక్కు ననుసరించి తక్షకుడు లోకోత్తర ఉపకారి అయిన నీ తండ్రిని కాటువేసి యమలోకానికి పంపాడు. దానికి ప్రతీకారంగా నీవు కూడా పలువురు మహర్పుల సమక్షంలో బ్రాహ్మణుల చేత సర్పయాగాన్ని చేయించి భయంకరమైన అగ్ని జ్వాలలలో తక్షకాది పాములన్నిటినీ భస్మం చేయి” – అంటూ ఉదంక మహర్షి - జనమేజయుని రేపించాడు. జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిపించి తన తండ్రి మరణ కారణాన్ని, అందులోని సూక్ష్మాన్ని అడిగి మరీ తెలుసుకున్నాడు - అని చెప్తున్న సూతునితో “అదేమిటి మహరీ. పరీక్షిత్తు మరణ కథలో సూక్ష్మం కూడా ఉందా ? మాకు తెలియజేయండి. విన కుతూహలంగా ఉంది” అని అడిగిన శౌనకాదులతో “సూక్ష్మం అంటే మరేదో కాదు. ఒక చిన్న అంశం దాగి ఉంది” అంటూ చెప్పనారంభించాడు సూతుడు.
పరీక్షిత్తుకు శాపం తగిలిన విషయమెరిగిన ఒక విప్రుడు - తిరిగి పరీక్షిత్తును బ్రతికించి తాను లబ్ది పొందుదామనుకుంటాడు. ఆ విప్రుడు ! ముని. పాముల విషానికి విరుగుడు మంత్రాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే కశ్యపునికి ఉపదేశించి, సర్పదష్టులను కాపాడమని వరమిచ్చాడు. లోక శ్రీ యోదాయకుడైన పరీక్షిత్తును మరల బ్రతికించడానికి బయలుదేరాడు. తక్షకుడు ఆ మునిని ఆపి, ఆతని శక్తి సంపదను కళ్ళారూ సి, ఆశ్చర్య చకితుడై “నేను చంపినవాడు తిరిగి బ్రతకకూడదు” - అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ కశ్యపునికి కావలసినంత ధనాన్ని తానే ఇచ్చి, వెనక్కి పంపివేసి, పరీక్షిత్తును కాటువేసి చంపేశాడు. రాజోత్తముడైన పరీక్షిత్తు శాపవశాత్తు మరణించినా - తిరిగి బ్రతికి ఉంటే ప్రజలకు అమోఘమైన మేలు జరిగి ఉండేది. ఆ కాస్త అవకాశాన్ని కూడా లేకుండా చేసిన తక్షకునిపై అమితమైన ఆగ్రహం కలిగింది జనమేజయునికి. దానికి తోడు మంత్రులు కూడా సర్పయాగం చేయమని ఉత్తేజపరిచారు. ఉదంకుడు, మంత్రులు చెప్పినవన్నీ కూలంకషంగా అర్థం చేసుకుని, సర్పయాగాన్ని చేసి తీరాలన్నీ పట్టు పట్టి ఋత్వికులను పిలిపించి -
“తక్షకుడు - తన విషాగ్నిచేత నా తండ్రిని ఎలా కాల్చివేశాడో - ఆ విధంగానే బంధుమిత్రులతో కూడిన ఆ తక్షకుడిని భయంకరమైన అగ్నిజ్వాలలలో కాల్చి - అటునా తండ్రికి, ఇటు ఈ ఉదంక మహరికి, సజ్జనులక్షత్రీ తి కలిగిస్తాను” అని పలికి యాగ సన్నాహాలను చేయమని చెప్పి, తద్విధానాన్ని అడిగి తెలుసుకున్నాడు. (సశేషం)