శ్రీవారి కథలు - నివాస దీక్షితులు


 వేంకటాచలానికి ఉత్తరంగా యోజన దూరంలో ఒక కుగ్రామం ఉంది. దాని పేరుకురువపురం. కురువ అంటే కొండకి వెళ్ళేదారి అని అర్థం. కొండపాదం దగ్గర ఈ గ్రామం ఉంది.కురువ గ్రామం నుంచి తిరుమలకు వెళ్ళే మార్గాన్ని తిరుమల మార్గం అని పిలుస్తారు. తొండమాన్ చక్రవర్తి పరిపాలించే రాజ్యంలోనే ఉన్న కురువ గ్రామంలో యాదవులు, కుమ్మరులు ఎక్కువగా నివసిస్తున్నారు. తిరుమలశ్రీ వారికి కావలసిన పాకశాలకి అవసరమైన మట్టి కుండలనీ... మూకుళ్ళనీ అక్కడి కుమ్మరులే చేసి భక్తితో సమర్పిస్తున్నారు. అలాగే అక్కడి యాదవులు స్వామి నైవేద్యానికి వినియోగించే నవనీతం... నెయ్యి... పాలు... పెరుగు అందిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా తరలి వస్తోంది. కురువపురం కొండకి వెళ్ళే దారిలో ఉండటం చేత అడవిని ఆనుకుని ఉండడం చేత అనేక క్రూరమృగాలు తరచుగా ఆ గ్రామంలోకి వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఆ గ్రామవాసులకి మాత్రం ఎటువంటి హానీ చేయ్యటం లేదు. అదంతాశ్రీ వారి కరుణే అని వాళ్ళు నమ్ముతుంటారు. వాళ్ళ నమ్మకం ఎప్పుడూ వమ్ముకాలేదు. ఆ ఆ గ్రామంలో ఒక నిరుపేద కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. కానీ అతనిని అందరూ కుమ్మరి దాసు అనే పిలస్తుంటారు. భీముని భార్య తమాలి గుణవంతురాలు. ఆ దంపతులకి సంతానం లేదుశ్రీ వేంకటేశ్వరస్వామి నివేదనకి అవసరమైన మట్టి కుండల్ని చేసి కొండకి పంపటమే భీముని నిత్యకృత్యం. అతను అందులో ఏమాత్రం ఏమరుపాటుని ప్రదర్శించడు. అతనికి మరో పని తెలియదు.


పొద్దున్నే నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు అనుక్షణం స్వామిని స్మరించుకుంటూ కుండల్ని చేస్తూ కాలం గడిపేస్తాడు భీముడు. పెందరాళే నిద్ర లేచి కాలకృత్యాల్ని తీర్చుకుని శుచిగా తిరునామాల్ని ధరించి తనకు కావలసినంత బంకమట్టిని తెచ్చుకుంటాడు భీముడు. ఆ మట్టి మీద నీళ్ళు చల్లి బాగా పిసుకుతాడు. కాళ్ళతో తొక్కుతాడు. అనువుగా సిద్ధమైన మట్టిని ముద్దలుగా చేసుకుంటాడు. ఆ ముద్దల్ని కుదురుగా చక్రం మీద...సారెమీద పెడతాడు. ఆ చక్రాన్ని పొడవాటి వెదురుకర్రతో వేగంగా గిరగిరా తిప్పుతాడు. అలా తిరుగుతున్న చక్రం మీద ఉన్న మట్టి ముద్దల్ని ఎంతో చాకచక్యంగా నేర్పుగా అందమైన కుండలుగా మలుచుకుంటాడు. నగిషీలు చెక్కుతాడు. సొగసులు అద్దుతాడు2తో చేస్తున్న పనే కదా అని ఎన్నడూ బద్దకించడు. అప్రమత్తంగా చేస్తాడు. తమాలి గుడిసెలోంచి బయటికొచ్చింది. కాసేపు నిలబడి భర్త చేస్తున్న పనిని ఎగాదిచూ సింది. “ఏందే సూత్తన్నావు?తో చేసేటి పనేగా?” సారెని తిప్పి కుండని చేస్తూ అడిగాడు భీముడు. “నీ పేరు బీమయ్య కాదు. బమ్మయ్య అని పెట్టాల్సింది. నీ సేతిలో ఏదో మాయ... మంత్రం ఉందనిపిస్తుంది. నిజం!” అంది నడ్డిన చేతులు పెట్టుకుని తమాలి. “ఏంటే ఇయ్యాలనువ్వు కొత్తగా సిత్రంగా మాట్లాడుతుండావు? నన్ను తెగ పొగిడేత్తుండావు! ఏంటి కత? సెప్పూ!” అన్నాడు చేసిన కుండను సారె మీద నుంచి కిందకు దింపుతూ భీముడు. సత్తె పెమానికంగా సెపుతుండా.... నువ్వు సేసినట్టు ఈ సుట్టుపక్కల ఎవరూ కుమ్మరం సెయ్యలేరనుకో” అంది తమాలి. "అంతా ఆ సామి దయ... ఇందులో నాదేముందే ఎర్రిమొగమా...” అన్నాడు భీముడు. ఆమె ఏదో అనబోతుండగా.... అటుగా వీధిలో పోతూ ఆగాడు భీముడి బాబాయి వెంకన్న, “భీముడూ” పిలిచాడు వెంకన్న. “ఏంటి సిన్నాన్నా!” కుండల్ని చేస్తూనే అన్నాడు భీముడు. “రేపటేల కొండకి పోతుండావా?” అడిగాడు వెంకన్న. “లేదు సిన్నాన్నా... తీరుబడి యాడుంది...” అన్నాడు భీముడు. “తప్పు... తప్పురా... భీముడూ! సెంపలేసుకో...” అన్నాడు వెంకన్న, వెంటనే భీముడు చెంపలేసుకున్నాడు. ఆ “అరేయ్! కొండకి వత్తానని మొక్కుకుని ఆగితే సామి ఊరుకోడు... ఆయనకి కోపమొత్తాది!” కళ్ళు పెద్దవి చేస్తూ స్తూ హితవు పలికాడు వెంకన్న. “అదీ... అట్టా గడ్డి పెట్టు మావాఁ ” అంది తమాలి. “నువ్వు గమ్మునుండు! పొద్దుటేల నిద్ర లేసిన కాడి నుంచి సేత్తే కానీ కొండమీదకి పంపేటి కుండలు సిద్ధం కావు.తో ఇదే సోదైం. ఏం సెయ్యమంటావు సెప్పు సిన్నాన్నా!” అన్నాడు భీముడు. వెంకన్న కాసేపు ఆలోచించాడు.


“నువ్వు సెప్పిందీ సత్తెమేరా భీముడూ!” అన్నాడు వెంకన్న. అప్పుడు భీముడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అలా వచ్చిందే తడవుగా అతను వేంకటేశ్వర స్వామి ప్రతిమని మట్టితో చేశాడు. ఎప్పుడో ఆనంద నిలయంటూ సిమనసులో ముద్రించుకున్న ఆ స్వామి మూర్తిని ఆనవాలుగా చేసుకుని మట్టి ప్రతిమని రూపొందించాడు భీముడు. ఆ ప్రతిమని తనకి ఎదురుగా పెట్టుకున్నాడు. ఆ స్వామిని అర్చించటానికి తులసీ దళాల్ని కూడా మట్టితో చేసుకున్నాడు. ఆ మట్టి తులసీ దళాలతో స్వామిని అర్చించిన తర్వాతేకుండల్నిచెయ్యటం ఆరంభిస్తున్నాడు భీముడు. దాంతో తాను కొండకి వెళ్ళలేకపోతున్నాననే బాధ దూరమయింది. తమాలికి మాత్రం ఆ లోటు అలాగే ఉంది. విసుగూ విరామం లేకుండా కుండలు చేస్తూనే ఉన్నాడు. కొండకి పంపుతూనే ఉన్నాడు భీముడు. అతని మనసులోని దిగులు క్రమంగా దూరమవుతోంది. కాలం ఆగదు కదా! పరుగులు పెడుతోంది. గోవిందనామస్మరణం చేస్తూ కుండలు చేస్తున్నాడు భీముడు. మట్టి పిసుకుతోంది తమాలి. “ఏందో మన బతుకు. ఒక అచ్చటా ముచ్చటా లేదు. పిల్లా చట లేదు. మట్టి పిసుక్కోవటం... కుండలు చెయ్యటం... కూడు తినటం... నిద్ర పోవటం... గానుగెద్దు జీవితం...తో కొండకి ఎడదామనుకుంటున్నాం. ఈ కుండల మూలాన పడితేగా.


ఏందోలే” విరక్తిగా విసుగ్గా అంది తమాలి. “అదేందే... అట్టా అంటుండావు. అట్టా అనబోకే. మనం కుండలు సేసి పంపకపోతే సామికి నైవేదైం ఆగిపోదూ... తప్పు... తప్పు... అపశారం... అపశారం...” చెంపలేసుకుంటూ భీముడు అన్నాడు. మూతి మూడు వంకర్లు తిప్పుతూ భర్త వంక కోపయా స్తూ మట్టి పిసుకుతోంది తమాలి. “అయినా... నీ పిచ్చి కానీ.... సామి మన ముందరే ఇడుగో ఇక్కడే ఉండే... ఇంక మనకేం కొరత... ఇగో బంకమట్టితో సేసిన తులసీదళాలతో పూజ సేత్తున్నా... నాకు ఆస్తిపాస్తులు లేవు గందా... రెక్కాడితే డొక్కాడని బతుకు మనది... మనం బుకిలి... బకితి రెండూ సూసుకోవాలె... దిగులేం పడమాకు... ఎడదాం. కొండకెడదాం... ఆయన ఆగ్న రానీ....” అంటూ భార్యని ఓదార్చాడు భీముడు. “సరేలే... మన సోదికేం గానీ... పొద్దెక్కుతుండాది... తొరగా పని కానీ.... బువ్వ తిందువు కానీ....” అంటూ గుడిసె లోకి పోయింది తమాలి. ఆనందనిలయంలో వేంకటేశ్వరుడు “తొండమానూ! నా నిరుపేద భక్తుడు డాలన్నావుగా... పదూద్దాం ” అన్నాడు. “అలాగే స్వామీ!” అన్నాడు తొండమానుడు. “ఆ భకుతడు కురువ పురంలో ఉంటాడు. అతని పేరు భీముడు. కుమ్మరివాడు. నా పాకశాలకి కుండల్ని అతనే పంపిస్తాడు. నీ రాజ్యంలోనే కురువపురం ఉంది కదూ!” అన్నాడు స్వామి. “అవును... అవును” అన్నాడు తొండమానుడు. ఇద్దరూ కలిసి గుర్రం మీద కురువపురానికి వెళ్ళారు. భీముని గుడిసె ముందు ఆగారు. స్వామి విషయం చెప్పాడు. వెంటనే భీముడూ అతని భార్య స్వామి పాదాల మీద మోకరిల్లారు. వాళ్ళని చూడగానే చక్రవర్తి అహంకారం పటాపంచలయింది... వివేకం మేలుకుంది... వినయం వచ్చి చేరింది.


"గోవిందా! మేం ఒట్టి మట్టి మడుసులం... మాకు మంత్రాలు రావు... తంత్రాలు తెలియవు.... బకితి అంటే ఏదో తెలియదు... పూజఎట్టా సెయ్యాలో ఎరుక లేదు. దమెట్టటం మాత్రం తెలుసు! అమాయకంగా చెప్పాడు భీముడు. “నా ప్రతిమకి నువ్విక్కడ సమర్పించే మట్టి తులసీదళాలు అక్కడ ఆనందనిలయంలో నాకు అందుతున్నాయి. భీముడూ నీ నిర్మలమయిన మాటలూ మనస్సూ బాగా నచ్చాయి. సువర్ణ తులసీ దళాల కంటే నీ మట్టి తులసీ దళాలంటేనే నాకు మక్కువ ఎక్కువ” అన్నాడు స్వామి. " ఆమాటల్నివిని ఆదంపతులు పరమానందభరితులయ్యారు. శ్రీ వారి మాటలకి చక్రవర్తి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ దంపతులు స్వామినీ చక్రవర్తినీ తమ గుడిసె లోపలికి తీసుకెళ్ళారు. మట్టితో చేసిన పీటల మీద వాళ్ళని కూర్చోబెట్టారు. “తమాలీ! నాకు బాగా ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా పెడతావా?” అడిగాడు స్వామి. “తినటానికా...” అంటూ తటపటాయించింది తమాలి. “నువ్వేది పెట్టినా తింటాను!” అన్నాడు స్వామి. క్షణంలో జొన్న సంకటి కాచి కొత్త కుండల్లో పోసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది తమాలి. "సంకటి చాలా రుచిగా ఉంది. మీకేం కావాలో కోరుకోండి. అన్నాడు స్వామి.


"స్వామీ! మీ దర్శనం అయింది. మాకంతే చాలు! ” అన్నారు కుమ్మరి దంపతులు. "దంపతులారా! మీకు ముక్తిని అనుగ్రహిస్తున్నాను” అన్నాడు స్వామి. “ధన్యులం స్వామీ'” అన్నారు దంపతులు. అంతలో దివ్య విమానం వచ్చి వాళ్ళ ముందు వాలింది. స్వామికి నమస్కరించి దంపతులు ఆ విమానాన్ని ఎక్కి శ్రీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. శ్రీ వేంకటేశ్వర స్వామితో కలిసి తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయానికి చేరుకున్నాడు.