సాధన: భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని చేసే ప్రయత్నాన్నే సాధన అంటాము. అనగా సంస్కారాల మార్పుకు చేసే తీవ్రమైన ప్రయత్నము భగవంతునికి దగ్గర చేస్తుంది. మానవజన్మ సళ్ళ ఫ్రమైన సంపద. భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలమర్రే ష్టమైనది, అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది, కొలువలేనిది. కర్మతో జన్మ ఎత్తివచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము. పాప, పుణ్యములే సుఖ, దు:ఖములకు మూలము. తెలుసుకుని చేస్తే సాధన. లేదంటే యాతన.కులము అనగా సమూహము. సామూహిక ప్రయత్నం ప్రధానంగా సాధన చేయడం ఆనందదాయకం. అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో, షమైనది భగవత్కార్యము. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలముర్రే ష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.
భగవత్కార్యము:కృతయుగమున తపమర్రే తాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావముకలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ. దైవం నామాన్ని పదే పదే ఉచ్చరించడాన్ని నామజపము అంటారు. అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు. తెలుసుకుంటూ చేసేది సాధన. ప్రయత్నము. మన కోసం మనం చేసేదే ఝూ కార్యసాధన. నిశ్చయంగా సత్యస్వరూపుడు, పరమాత్ముడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు. సర్వవ్యాపి అయిశ్రీ మహావిష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.
వైష్ణవ అవతారతత్త్వము :
1. పరస్వరూపము : శుద్ద సత్త్వమయమగుటచే కోటి సూర్య ప్రకాశమానమై, వైకుంఠ లోకాలను కల్పవృక్షం కింద రత్న ఖచిత సింహాసనంపై శ్రీ , భూ, నీలా సమేతుడై, నిత్య ముక్తానుభావ్యుడై, నిరతిశయానంద యుక్తుడై వేంచేసియుండు స్వామి -పరస్వరూపము.
2. వ్యూహస్వరూపము: క్షీరసాగరాన,జగత్సృష్టికి మూలకందమై, జ్ఞానశక్తి, బలైశ్వర్య వీర్య తేజస్సులతో కూడుకొనియుండు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవాది నామాలచే వ్యవహరించబడే భగవత్స్వరూపం - వ్యూహ స్వరూపము.
3. విభవ స్వరూపం: దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ధర్మసంస్థాపన అప్రాకృత దివ్యమంగళ స్వరూపం తోడనే, ఈ లీలా విభూతికి విచ్చేసి, సకలమనుజనయన విషయాలై యుండు శ్రీ రామకృష్ణాద్యవతారాలు - విభవస్వరూపం.
4. అంతర్యామి స్వరూపం : నిఖిల ప్రవృత్తి కారకుడై సకల జీవాత్మలయందును పరమాత్మయై అంతర్యామిగా వేంచేసియుండి, సత్కర్మానుష్ఠానాన్ని అనుమతించు స్వరూపమే -అంతర్యామి స్వరూపం.
5.అర్చావతారం: భగవచ్ఛాస్తోక్త ప్రకారం శ్రీ మూర్తుల గల్పించి, యధాశాస్త్రంగా ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో వానిని ఆరాధించే భక్రో సరులచే పూజింపబడే భగవానుని దివ్యమంగళ విగ్రహం - అర్చావతారం.