మార్పు
లోకంలో రాత్రి పగలు ఉన్నట్లుగా జీవితములో సుఖాలతో పాటు దుఃఖాలు ఉంటాయి. నిజానికి రాత్రి పగలు, సుఖదుఃఖాలు, మంచివారు చెడ్డవారు, పండితుడు పామరుడు, ధనవంతుడు దరిద్రుడు, ఆశ్రయము నిరాశ్రయము మొదలగు అన్ని విషయాల కలయికనే జీవితము. భగవంతుడు మనకు ఎప్పుడు ఏది ప్రసాదించుననునది ఆయనకే తెలుసు. మన అర్హతను బట్టి చేసుకున్న పాపకర్మలను బట్టి ఇవి లభించునని పెద్దలంటారు. ఏది ఏమైనా ఒకే రకమైన స్థితిలో ఏ జీవుడు ఉండలేడు. ఎప్పటికి మార్పును లేదా క్రొత్త అనుభూతిని కోరుకుంటాడు. ప్రతివారు అంచెలంచెలుగా ఎదగాలనుకుంటరు. కాని ఏ స్థితిలో కూడా ఇక చాలు అనే అభిప్రాయంతో ఉండరు. ఇది జీవునికి కొంతకాలము ఆనందాన్నిచ్చినప్పటికి అతని జీవితాన్ని పాతాళానికి దిగజారుస్తుంది. ఏనాడు శాంతితో బ్రతకలేడు, అసూయ ద్వేషాలతో రగిలిపోతుంటాడు. అతనిని రజోగుణము ఆవరించి ఉంటుంది. చివరికి తాను సంపాదించిన డబ్బు, ఆస్తి, పరపతి రాళ్ల పాలో, దొంగల పాలో లేదా శత్రువుల పాలో అయిపోతుంది. చివరికి మనశ్శాంతి నశించి జీవితం వ్యర్థమైతుంది. అప్పుడు భగవంతుడిని గురించి గత జీవితకాలము వృథా చేశానని పశాతాపముతో బాధపడుతుంటారు. కాని ఈ బాధలు, నషాలు, రాత్రుల వంటివి లేకుండా ఉంటే మనిషి జీవితము ఏవిధంగా ఉంటుంది? భగవంతుడిని గుర్తించగలడా? తానే శక్తిమంతుడిననే నమ్మకముతో విర్రవీగేవాడు కదా! లోకములో మానవత్వపు చ్చాయలు జీవించి ఉండగలవా? ఇలా మంచిని రక్షించడం కోసమే, దైవత్వాన్ని గురించడం కోసమే కషాలు అనేవి ఉన్నాయి. అప్పుడే మనకు రోగం వసే మందు కోసం డాక్టరు వద్దకు పోయినట్లు భగవంతున్ని ఆశ్రయించగలము. తిరిగి మంచి మార్గమున పయనించగలము. పాత రోజులలోని చెడు అలవాట్లను త్యజించి,
మంచివాటిని జీవితమునకు ఆదర్శవంతమనుకున్నవాటిని మాత్రమే ఏరుకుని పాటించుదుము. ఇలాంటి సమయమే ప్రస్తుతము మనము ఎదుర్కొనుచున్న 'కరోనా' పరిస్థితి. ప్రతి పౌరుడు వారి వారి జీవితాన్ని పునఃపరిశీలించుకోవలసిన అవసరం ఏర్పడినది. తప్పులను సరిదిద్దుకోవాలి. మంచి మార్గాలను ఎంచుకోవాలి. భగవంతున్ని ఆశ్రయించాలి. అంతా ఆశ్రీ వేంకటేశ్వరుని కృపేనని గ్రహించాలి. ఆయన దయాదాక్షిణ్యాలపైనే మన జీవితము ఆధారపడిందని దృఢంగా నమ్మాలి. మానవత విలువలను ఆచరించాలి. ఒకరికొకరు సహాయకారులుగా మారాలి. జీవించి ఉన్న ఈ కొద్ది రోజులజీ మన్నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరున్ని క్షణక్షణం స్మరించాలి. జీవితాన్ని ఆయనకై అంకితం చేయాలి. ఇలా మన జీవితాన్ని చక్కని మారంలో నడిపించాలి. మనిషై పుట్టినందులకు ఋణం తీరుకోవాలి. అప్పుడే మన జీవితమునకు సార్ధకం లభిస్తుంది. ఈ రకమైన మార్పుకోసమే భగవంతుడుస్వయంగా కష్టపడుచున్నాడు. రోజుకు 70-80 వేల మంది జనాలు దర్శించుకునే తనను ప్రస్తుతం 3-4 వేల మందే దర్శించుకుంటున్నారు. కొన్నిరోజులు భక్తులే లేకుండా ఏకాంతంగా ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు. భక్తులంటే భగవంతునికి ఎంతో ఇష్టం, వైకుంఠం నుండి తిరుమల కొండకు దిగివచ్చింది కూడా భక్తుల కోసమే. అలాంటిది ఏ భక్తుడు లేక ఏకాంతంగా ఉన్నాడు. కారణం మనలో మార్పుకోసమే! మనము సదా మంచి మార్గమున పయనించాలన్న ఆయన సంకల్పం కోసమే. అంతా భగవంతునిదే అనే భావం మన మనస్సులో నింపడమే ఉద్దేశ్యం. సదా వేంకటేశం స్మరామి! స్మరామి!