మనమందరం తెలుసుకోవలసిన విషయాలు
September 17, 2019 • Pullagurla Sai Reddy

మనమందరం తెలుసుకోవలసిన విషయాలు - 38

మనము మన జీవితం సఫలం కావడానికి భగవంతుణ్ణి ఏమని కోరాలి? దీనిశ్రీ మద్భాగవతము దశమస్కంధములోని ఒక సంఘటనను ఒకసా ద్దాము.

శ్రీ కృష్ణుడు బలరామునితో మధురకు కంసమామ ఆహ్వానముపై అక్రూరునితో వెళ్ళినపుడు రాజవీధిలో నడుస్తూంటే పూమాలలను కట్టే మాలాకారుడు సుదాముడి ఇంటికి వెళ్ళారు. సుదాముడు అతిథి సత్కారాలు చేసి "మీకు నేనేమి సహాయాన్ని చేయగలనో సెలవివ్వండి" అని తను కూర్చిన పూలహారాలను వారిద్దరికీ సమర్పించగా - శ్రీ కృష్ణుడు - "సుదామా! నీవు కోరిన వరాన్ని ఇస్తాను" అని చెప్పగా...

"వారుని మాలికుడిచ్చిన భూరి | కుసుమదామములను భూషితులై నీ కోరిన వరమిచ్చెదమని కారుణ్యము సేయ | నతడుకని యిట్లనియెన్" సుదాముడు...

"నీ పాదకమల సేవయు, నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపారభూతదయయును, దాపసమందార! | నాకుదయసేయగదే"

అని నన్ను నీ దాసానుదాసునిగా ఆదరించవా - అటువంటి భాగ్యాన్ని ప్రసాదించి నాకు సకల ప్రాణుల యెడలను అపారమైన దయ ఉండునట్లునూ డమని వేడుకున్నాడు. జీవితము సార్థకము కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగినది ఏముంటుంది? పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన కులశేఖరాళ్వార్లు వారి ముకుందమాల స్తోత్రంలో 27వ శ్లోకమును ఒకసారి గుర్తు చేసుకుందాము.

పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన కులశేఖరాళ్వార్లు వారి ముకుందమాల స్తోత్రంలో 27వ శ్లోకమును ఒకసారి గుర్తు చేసుకుందాము.

"మజ్జన్మనఃఫల మిదం మధుకైటభారే! మత్పార్ధనీయమదనుగ్రహ ఏష ఏవ త్వదృృత్య భృత్య పరిచారకభృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథః"

నీ దాసుల దాసులకూ నేను దాసుడనయ్యేటట్లు అనుగ్రహించుమా అని కోరినాడు. ఇంతకంటే భగవంతుణ్ణి కోరేది ఏముంటుంది?