శ్రీ అత్తివరదరాజ విశిష్టత
September 14, 2019 • Pullagurla Sai Reddy

 

శ్రీ అత్తివరదరాజ విశిష్టత - తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందింది. సుమారు వెయ్యికి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం (కంచి). | | కంచిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలోశ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతోంది. కంజీ అత్తివరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు (కంచిని దర్శించిన తెలుగువారికిశ్రీ వరదరాజస్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది)

| ఈ ఆలయంలోని విశేషత్రీ అత్తి వరదరాజస్వామి. పురాణకాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగసమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తిచెట్టు కాండంతోశ్రీ వరదరాజస్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టే నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించాడు. ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడీ చేస్తున్న సమయంలో వారి మూర్తికి హాని కలుగకుండా వుండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్ళు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట.

తదనంతర కాలంలో పరిస్థితి అంతా సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరచబడిశ్రీ అత్తివరదరాజ స్వామిని 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరగా 1979లో దర్శనం ఇచ్చితీ అత్తి వరదరాజస్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1వ తేదీ నుండి ఆగస్ట్ 17వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి 38 రోజులు శయన భంగిమ (పడుకున్న) లోను చివరి 10 రోజులు స్థానిక భంగిమ (నిలుచున్న) లోను దర్శనం ఇస్తారు.